దేశ వ్యాప్తంగా పేదరికం,ద్రవ్యోల్బణం, ఆకలి కేకలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఫలితంగా సామాన్యులు జానెడు పొట్ట నింపుకునేందుకు పడరాని పాట్లు పడుతుంటే..ధనికుడు మరింత ధనికుడవుతున్నాడు. ఇటీవల ఇన్వెస్ట్‌మెంట్ మైగ్రేషన్ అడ్వైజరీ సంస్థ హెన్లీ & పార్ట్‌నర్స్ విడుదల చేసిన ప్రపంచ దేశాల సెంటీ మిలియనీర్ల జాబితాలో భారత్ 3 స్థానాన్ని సంపాదించుకుంది.
హెన్లీ నివేదిక ప్రకారం..ఒక వ్యక్తి వద్ద రూ. 830 కోట్లు, అంతకంటే ఎక్కువ ఉండటాన్ని సెంటీ మిలియనీర్లుగా పరిగణలోకి తీసుకుంది. వరల్డ్ వైడ్‌గా ఈ సెంటీ మిలియనీర్లు 25,490 మంది ఉండగా ఒక్క భారత్‌లోనే 1132 మంది ఉన్నారు. వెరసీ యూకే, రష్యా, స్విట్జర్లాండ్ వంటి దేశాలను అధిగమించి సూపర్ రిచ్ టెక్ టైటాన్స్, ఫైనాన్షియర్‌లు, బహుళజాతి సీఈఓలు, వారసులు వేగంగా అభివృద్ధి చెందుతున్న, శక్తివంతమైన జాబితాలో భారతీయులు నిలిచారు.
ఏ దేశంలో ఎంత మంది ఉన్నారంటే
పైన పేర్కొన్నట్లుగా ప్రపంచ వ్యాప్తంగా 25,490మంది సెంటీ మిలియనీర్లు ఉండగా వారిలో భారతీయులు 1132 మంది, కెనడాలో (514) , జర్మనీలో (966), రష్యాలో (435), చైనాలో (2,021), జపాన్‌లో (765), అమెరికాలో (9,730), యూకేలో (968), స్విట్జర్లాండ్‌లో (808), ఆస్ట్రేలియాలో (463) మంది ఉన్నారు.
ఏ సిటీల్లో ఎంతమంది ఉన్నారంటే
సెంటీ మిలియనీర్లు భారత్‌కు చెందిన ముంబైలో 243 మంది, అమెరికా న్యూయార్క్ నగరంలో (737), అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రం లాస్ ఏంజెలెస్ నగరంలో (393), చైనా రాజధాని బీజింగ్‌లో (363), చైనాలోని అతిపెద్ద నగరం, ఫైనాన్షియల్ హబ్ షాంఘైలో (350), ఇంగ్లండ్ రాజధాని లండన్‌లో (406), శాన్‌ప్రాన్స్‌సిస్కో బే ఏరియాలో (623), స్విట్జర్లాండ్ దేశం జెనీవా నగరంలో (345), అమెరికాకు చెందిన రాష్ట్రాల్లో అత్యధిక జనాభా ఉన్న చికాగోలో (340), సింగపూర్‌లో (336), అమెరికా హూస్టన్ నగరంలో (314), చైనా పరిపాలన విభాగ ప్రాంతం హాంగ్ కాంగ్ నగరంలో (280), రష్యా రాజధాని మాస్కోలో (269), జపాన్ రాజధాని టోక్యోలో (263), స్విట్జర్లాండ్ దేశం జురిచ్ నగరంలో (258) ఉన్నారు.
సెంటీ మిలియనీర్లు పెరుగుతున్న మార్కెట్ శాతం ఎంతంటే
ప్రపంచ దేశాల్లో సెంటీ మీలియనీర్లు పెరుగుతున్న మార్కెట్ శాతాన్ని హెన్లీ నివేదిక వెలువరించింది. అందులో వియాత్నంలో సెంటీమిలియనీర్ల గ్రోత్‌రేటు 95శాతం, భారత్‌లో 80 శాతం, మారిషస్‌లో 75 శాతం, న్యూజిల్యాండ్‌లో 72 శాతం, ఈస్ట్ ఆఫ్రికా రువాండాలో 70 శాతం, ఉగాండాలో 65 శాతం, ఆస్ట్రేలియాలో 60 శాతం, పోలాండ్‌లో 58 శాతం, యూరప్ దేశం మాల్టాలో 56 శాతం, కెన్యాలో 55 శాతం, స్విట్జర్ ల్యాండ్‌లో 54 శాతం, చైనాలో 53 శాతం, యూఏఈలో 52 శాతం, మోనాకోలో 50 శాతం, ఇజ్రాయిల్‌లో 50 శాతంతో సెంటీ మీలియనీర్లు మార్కెట్ వృద్ధి చెందుతున్నట్లు తేలింది.
చదవండి👉 ఆకాష్ అంబానీ మాస్టర్ ప్లాన్ అదిరింది, జియో యూజర్లకు బంపరాఫర్
Comments
Please login to add a commentAdd a comment