
హైదరాబాద్‌లో 9 వేల మంది మిలియనీర్లు..
హైదరాబాద్ : భారత్‌లో అత్యంత సంపద కలిగిన వారు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారంటే ? ముంబై అని చెబుతోంది ఓ సంస్థ నివేదిక. దేశ ఆర్థిక రాజధానిగా పేరుపొందిన ముంబైలోనే అత్యధికంగా బిలియనీర్లు, మిలియనీర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపింది. దేశంలో అత్యధికంగా సంపద కలిగిన వ్యక్తులు ఏ నగరంలో ఉన్నారనే విషయంపై న్యూ వెల్త్ వరల్డ్ (ఎన్‌డబ్ల్యూడబ్ల్యూ) అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఇటీవల ఆ సంస్థ విడుదల చేసిన సర్వే నివేదికలో ఈ విషయం పూర్తిగా వెల్లడైంది.
ముంబైలో అధిక మొత్తంలో సంపద కలిగిన వ్యక్తులు ఉన్నారని నివేదికలో ఎన్‌డబ్ల్యూడబ్ల్యూ చెప్పింది. ముంబైలో 28 మంది బిలియనీర్లు ఉండగా, 46 వేల మంది మిలియనీర్లు ఉన్నారు. ఆ తర్వాత స్థానం ఢిల్లీకి దక్కింది. ఢిల్లీలో 18 మంది బిలియనీర్లు ఉండగా, 23 వేల మంది మిలియనీర్లు ఉన్నారు. ఆ తర్వాత క్రమంలో బెంగుళూరు, హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై, పూణె, గూర్గాం నగరాల్లో అత్యధికంగా బిలియనీర్లు, మిలియనీర్లు ఉన్నట్టు ఆ రిపోర్ట్ తెలిపింది.