
ప్రపంచంలో చాలామంది ధనవంతులు ఉన్నారు, వీరిలో దాదాపు అందరూ.. విలాసవంతమైన జీవితాలను గడుపుతూ, ఖరీదైన బంగ్లాలు, వాహనాలు కలిగి ఉన్నారు. అయితే అత్యంత విలాసవంతమైన లేదా ఖరీదైన నివాసాలను కలిగి ఉన్న.. కుబేరులు ఎవరు? వారికి సంబంధించిన రియల్ ఎస్టేట్స్ వంటివి ఈ కథనంలో తెలుసుకుందాం..
ముఖేష్ అంబానీ
భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నివాసాన్ని కలిగి ఉన్నారు. ముంబైలో ఉన్న 27 అంతస్తుల నివాసం (ఆంటిలియా) విలువ దాదాపు రూ. 15,000 కోట్లు. ఇది కాకుండా దుబాయ్‌లోని పామ్ జుమేరాలో బంగ్లా, యూకేలోని బకింగ్‌హామ్‌షైర్ ఎస్టేట్, మాన్‌హట్టన్‌లో లగ్జరీ హోటల్ (న్యూయార్క్) వంటివి ఉన్నాయి.

పంకజ్ ఓస్వాల్
2023లో స్విట్జర్లాండ్‌లోని జింగిన్స్‌లో.. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన భవనాలలో ఒకటైన 'వరి విల్లా' (Vari Villa)ను కొనుగోలు చేశారు. 40,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నిర్మాణ కళాఖండాన్ని ఒబెరాయ్ ఉదయవిలాస్, ది లీలా హోటల్స్ వంటి వాటికి ప్రసిద్ధి చెందిన జెఫ్రీ విల్కేస్ రూపొందించారు. దీని ధర రూ. 1,650 కోట్లు.
లక్ష్మీ మిట్టల్
ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన.. లక్ష్మీ మిట్టల్ లండన్‌లో 'బిలియనీర్స్ రో'లో రెండు విలాసవంతమైన భవనాలను కలిగి ఉన్నారు. వీటి విలువ రూ. 2,000 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం. ఇది మాత్రమే కాకుండా.. ఢిల్లీలో కూడా రూ. 31 కోట్ల ఖరీదైన బంగ్లా కలిగి ఉన్నారు. రియల్ ఎస్టేట్ కాకుండా.. క్వీన్స్ పార్క్ రేంజర్స్ అనే ఫుట్‌బాల్ క్లబ్‌కు యజమానిగా ఉన్నారు.

అదార్ పూనవాలా
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ 'అదార్ పూనవల్లా' 2023 చివరిలో లండన్‌లోని హైడ్ పార్క్ సమీపంలోని అబెర్‌కాన్‌వే హౌస్‌ను సుమారు రూ. 1,444 కోట్లకు కొనుగోలు చేశారు. ఇది 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది ఒకప్పుడు డొమినికా కుల్జిక్ యాజమాన్యంలో ఉండేది.
హిందూజా బ్రదర్స్
హిందూజా సోదరులు ప్రకాష్, అశోక్, శ్రీచంద్, గోపీచంద్.. కార్ల్టన్ హౌస్ టెర్రస్ అనే విలాసవంతమైన ఆరు అంతస్తుల విలాసవంతమైన ప్యాలెస్ కలిగి ఉన్నారు. ఇది లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ దగ్గర ఉంది. దీనిని 2006లో కొనుగోలు చేశారు. ఇది యూకేలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన భవనాలలో ఒకటిగా ఉంది.
ఇదీ చదవండి: రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా?
రవి రుయా
ఎస్సార్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు 'రవి రుయా' 2023లో లండన్‌లోని హనోవర్ లాడ్జ్‌ను సుమారు రూ. 1,200 కోట్లకు కొనుగోలు చేశారు. ఇది కూడా అత్యంత ఖరీదైన విలాసవంతమైన భవనాలలో ఒకటిగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment