Indian billionaires
-
బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై దేశంలోనే అత్యంత ధనిక మహిళ పోటీ!
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో దేశంలో అత్యంత ధనిక మహిళ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇంతకీ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై పోటీ చేస్తున్న దేశంలోనే అత్యంత మహిళా సంపన్నురాలు ఎవరు?హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర నగర ఎంపీ నవీన్ జిందాల్ తల్లి సావిత్రి జిందాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. హిసార్ అసెంబ్లీ నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..హిసార్ ప్రజలు నా కుటుంబ సభ్యులు.నా భర్త ఓం ప్రకాష్ జిందాల్ ఈ కుటుంబంతో మంచి సంబంధం ఉంది. జిందాల్ కుటుంబం ఎప్పుడూ హిస్సార్‌కు సేవ చేస్తూనే ఉంది. ప్రజల అంచనాలకు అనుగుణంగా,వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను పూర్తిగా అంకితభావంతో పనిచేసేందుకు సిద్ధంగా అని అన్నారు.ఇదీ చదవండి : కేజ్రీవాల్‌కు బెయిలా? జైలా?బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై పోటీసావిత్రి జిందాల్ ప్రస్తుత రాష్ట్ర మంత్రి,హిసార్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కమల్ గుప్తాపై పోటీ చేస్తున్నారు. మీ అబ్బాయి బీజేపీ ఎంపీగా పనిచేస్తున్నారు. మీరు అదే పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కమల్ గుప్తాపై పోటీ చేస్తున్నారు. అంటే బీజేపీ రెబల్ అభ్యర్థిగా మారారా? అని ప్రశ్నించగా.. అలా ఏం లేదు. బీజేపీ సభ్యత్వం తీసుకోకుండానే నా కుమారుడు నవీన్ జిందాల్ తరుఫున లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేశాను’అని గుర్తు చేశారు. రెండు సార్లు ఎమ్మెల్యే సావిత్రి జిందాల్ 2005,2009లలో హిసార్ నియోజక వర్గ ఎమ్మెల్యేగా పని చేశారు. 2013లో సింగ్ హుడా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. కాగా, ఈ ఏడాది మార్చిలో సావిత్రి జిందాల్,ఆమె కుమారుడు నవీన్ జిందాల్ పార్టీని వీడారు.నవీన్ జిందాల్ బీజేపీలో చేరి ఎంపీగా గెలుపొందారు. ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఫోర్బ్స్ ఇండియా జాబితాలోకాగా, సావిత్రి జిందాల్ ఈ ఏడాది ఫోర్బ్స్ ఇండియా జాబితాలో 29.1 బిలియన్ డాలర్ల నికర సంపదతో దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా చోటు సంపాదించారు -
రికార్డ్ స్థాయిలో బిలియనీర్ల సంపద: టాప్ మహిళ ఎవరో తెలుసా?
భారతీయ మహిళలు ఉద్యోగ, వ్యాపార రంగాల్లోదూసుకుపోవడమే కాదు. ఫోర్బ్స్ జాబితాలో అత్యంత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకుంటున్నారు. తాజాగా విడుదల చేసిన 'ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్ లిస్ట్' 2024లో 17మంది మహిళలు చోటు సాధించారు. ఈ ఏడాది భారతదేశం సంపదలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. 2023లో 169 మంది ఉండగా తాజాగా 200 మంది భారతీయులు ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించుకోవడం విశేషం. 25 మంది కొత్త బిలియనీర్లు ఈ జాబితాలో చేరారు. వీరి సంపద రికార్డు స్థాయిలో 41 శాతం పుంజుకుని 954 బిలియన్లకు డాలర్లకు పెరిగింది. టాప్ -10 మహిళా బిలియనీర్లు సావిత్రి జిందాల్: భాభారతీయ సంపన్న మహిళ జాబితాలో జిందాల్ కుటుంబానికి చెందిన జిందాల్ గ్రూప్ చైర్పర్సన్. సావిత్రి జిందాల్ 35.5 బిలియన్ల డాలర్ల నికర విలువతో అగ్రస్థానంలో ఉన్నారు. రేఖా ఝున్‌ఝన్‌వాలా: ఇండియన్ వారెన్ బఫెట్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా. రెండో స్థానంలో నిలిచారు. ఆమె నికర విలువ 8.5 బిలియన్ డాలర్లు వినోద్ రాయ్ గుప్తా: హావెల్స్ ఇండియాకు చెందిన వినోద్ రాయ్ గుప్తా 5 బిలియన్ డాలర్లతో ఈ జాబితాలో చోటు సంపాదించారు. రేణుకా జగ్తియాని: ల్యాండ్‌మార్క్ గ్రూప్ చైర్పర్సన్, సీఈవో రేణుకా జగ్తియాని 4.8 బిలియన్ల డాలర్లతో ఈ జాబితాలోకి అరంగేట్రం చేశారు. 2023,మే లో మిక్కీ జగ్తియాని కన్నుమూయడంతో, ఆమె కంపెనీ బాధ్యతలను చేపట్టారు. స్మితా కృష్ణ-గోద్రెజ్: గోద్రెజ్ కుటుంబానికి చెందిన స్మితా కృష్ణ మహిళల బిలియనీర్ల జాబితాలో ఐదో ప్లేస్‌లో నిలిచారు. ఈమె నికర విలువ 3.8 బిలియన్ డాలర్లు. గోద్రెజ్ కుటుంబ ఆస్తులలో గణనీయమైన వాటాను కలిగి ఉన్నారు. ఇతర మహిళా బిలియనీర్లు - నికర విలువ రాధా వెంబు (3.4 బిలియన్ డాలర్లు) , అను అగా (3.3 బిలియన్ డాలర్లు), లీనా తివారి (3.2 బిలియన్ డాలర్లు), ఫల్గుణి నాయర్ (2.9బిలియన్ డాలర్లు), కిరణ్ మజుందార్-షా (2.7 బిలియన్ డాలర్లు), మృదులా పరేఖ్ (2.1 బిలియన్ డాలర్లు), సరోజ్ రాణి గుప్తా (1.6 బిలియన్ డాలర్లు), రేణు ముంజాల్ (1.6 బిలియన్ డాలర్లు, సారా జార్జ్ ముత్తూట్ (1.3 బిలియన్ డాలర్లు), అల్పనా డాంగి (1.2 బిలియన్ డాలర్లు), సుబ్బమ్మ జాస్తి (1.1 బిలియన్ డాలర్లు), కల్పనా పరేఖ్ (1.1 బిలియన్ డాలర్లు) -
12 మంది కుబేరులు: అదానీ రోజు సంపాదన 1600 కోట్లు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సంక్షోభం తరువాత సంపదలో భారతీయ కుబేరులు గ్లోబల్ బిలియనీర్లనుదాటి ట్రిలియనీర్లుగా దూసుకు పోతున్నారు. దేశంలో 12 మంది అపర కుబేరుల నికర విలువ రూ. ఒక ట్రిలియన్ కంటే ఎక్కువేనని తాజా నివేదిక తేల్చింది. ఇందులో అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ అగ్రస్థానంలో ఉండటంలో ఆశ్చర్యమేమీలేదు. ఎందుకంటే అదానీ గత ఏడాది రోజుకు 1,600 కోట్ల రూపాయలు ఆర్జించారు. ప్రస్తుతం గౌతమ్ అదానీ రూ. 10.9 ట్రిలియన్లకు పైగా నికర విలువతో దేశంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా, ప్రపంచంలో మూడో ధనవంతుడిగా ఉన్నారు. ఇటీవల అదానీ ప్రపంచంలో రెండో రిచెస్ట్పర్సన్గా నిలిచిన తొలి ఆసియా వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశారు. ప్రస్తుతం అదానీ, టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ , బెర్నార్డ్ ఆర్నాల్ట్ తర్వాత భూమిపై మూడో అత్యంత ధనవంతుడు. అంబానీకి షాకిచ్చిన అదానీ సంపద నిర్వహణ సంస్థ ఐఐఎఫ్ఎల్ వెల్త్ భాగస్వామ్యంతో పరిశోధనా సంస్థ హురున్ ఇండియా విడుదల చేసిన ర్యాంకింగ్‌ల ప్రకారం బిలియనీర్ గౌతమ్ అదానీ రూ. 10,94,400 కోట్ల నికర విలువతో సంపన్న భారతీయుల జాబితాలో టాప్‌లో ఉన్నారు. తద్వారా గతేడాది జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీని వెనక్కి నెట్టేశారు. అంబానీ రూ. 7,94,700 కోట్ల నికర సంపదతో రెండో స్థానంలో నిలిచారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 జాబితా బుధవారం వెల్లడైంది. 12 మంది భారతీయుల నికర విలువ రూ. 1 ట్రిలియన్ కంటే ఎక్కువగా ఉందని నివేదించింది. ఈ జాబితాలో ముఖేష్ అంబానీ, సైరస్ పూనావల్లా, శివ్ నాడార్, రాధాకిషన్ దమానీ పేర్లు ఉన్నాయి. 2022లో బొగ్గు-పోర్ట్-టు-ఎనర్జీ సంస్థ అదానీ గ్రూపు సంపద అప్రతిహతంగా ఎగిసింది. లక్ష కోట్ల మార్కెట్ క్యాప్‌తో ఒకటి కాదు, ఏకంగా ఏడు కంపెనీలను నిర్మించిన ఏకైక కంపెనీ అదానీ అని హురున్ ఇండియా ఎండీ, ముఖ్య పరిశోధకుడు అనస్ రెహమాన్ జునైద్ పేర్కొన్నారు. అంతేకాదు రూ. 1.6 ట్రిలియన్ల నికర విలువతో అదానీ తమ్ముడు వినోద్ అదానీ కూడా ఆరో స్థానంలో ఉన్నారు. ఇక ఈ జాబితాలో సీరం వ్యవస్థాపకుడు సైరస్ పూనావల్లా ,హెచ్‌సీఎల్ శివ్ నాడార్ ఉన్నారు. వీరి సంపద వరుసగా రూ. 2 ట్రిలియన్లు, రూ. 1.85 ట్రిలియన్లుగా ఉంది. అలాగే ట్రిలియనీర్ల జాబితాలో రాధాకిషన్ దమానీ, ఎస్పీ హిందుజా, ఎల్ఎన్ మిట్టల్, దిలీప్ షాంఘ్వీ, ఉదయ్ కోటక్, కుమార్ మంగళం బిర్లా , నీరాజ్ బజాజ్ ఉన్నారు. వీరితో పాటు షాంఘ్వీ ,కోటక్ ఈ జాబితాలోకి కొత్తగా ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. జాబితాలో క్విక్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జెప్టో వ్యవస్థాపకురాలు అతి పిన్న వయస్కురాలు 19 ఏళ్ల కైవల్య వోహ్రా, మరొక స్టార్టప్ వ్యవస్థాపకురాలు నైకా ఫౌండర్ ఫల్గుణి నాయర్ ఉన్నారు. వీరిద్దరూ బయోకాన్ ఎండీ కిరణ్ మంజుందార్-షాను అధిగమించి మరీ " రిచెస్ట్సెల్ఫ్ మేడ్ ఇండియన్ విమెన్" గా నిలిచారు. వేదాంత్ ఫ్యాషన్ వ్యవస్థాపకుడు రవి మోడీ నికర విలువలో 376 శాతం జంప్‌తో జాబితాలో అత్యధికంగా సాధించిన వారిగా నిలిచారు. సంపన్నుల జాబితాలో 283 మంది వ్యక్తులతో ముంబై టాప్‌లో ఉంది. ఆ తరువాత న్యూ ఢిల్లీలో 185 మంది , బెంగళూరు 89 మంది రూ. 1,000 కోట్లకు పైగా నికర విలువను కలిగి ఉన్నారని నివేదిక తేల్చింది. 100 మంది స్టార్టప్ వ్యవస్థాపకుల నికర విలువ 10 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉందని నివేదిక చూపింది. -
అమ్మో.. 2025 నాటికి ఇంతమంది కుబేరులవుతారా?!
ముంబై: ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, అదర్ పూనవాలా వీరంతా.. కరోనా మహమ్మారి విరుచుకుపడిన 2020లో సంపదను పెంచుకున్న కుబేరులు. కానీ, అదే ఏడాది దేశంలోని సంపన్నుల ఉమ్మడి సంపద మాత్రం 4.4 శాతం తగ్గి 12.83 లక్షల కోట్ల డాలర్లకు (రూ.919 లక్షల కోట్లు) పరిమితమైనట్టు క్రెడిట్ సూసే సంస్థ నివేదికను విడుదల చేసింది. దీనికి కారణం డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడమేనని పేర్కొంది. ఫలితంగా డాలర్ రూపంలో మిలియనీర్లు (కనీసం మిలియన్ డాలర్లు/రూ.7.4 కోట్లు, అంతకుపైన) చదవండి: ఐపీఓకి మరో మూడు కంపెనీలు, కళకళలాడుతున్న మార్కెట్లు భారత్‌లో 2019 నాటికి 7,64,000 మంది ఉంటే, 2020 చివరికి 6,98,000కు తగ్గిపోయినట్టు ఈ నివేదిక తెలిపింది. ప్రపంచ సంపన్నుల్లో భారత్‌లో కేవలం 1 శాతం మందే ఉన్నారంటూ.. 2025 నాటికి భారత్‌లోని మిలియనీర్ల సంఖ్య 13 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేసింది. ‘‘2020లో భారత్‌లో ప్రతీ వయోజన వ్యక్తి సగటు విలువ 14,252 డాలర్లుగా ఉంది. 2000 నుంచి 2020 మధ్యన చూసే వార్షికంగా 8.8 శాతం పెరిగింది. అదే కాలంలో ప్రపంచ వ్యాప్తంగా సగటు వృద్ధి 4.8 శాతంగానే ఉంది’’అని క్రెడిట్‌సూసే తెలిపింది. 50 మిలియన్ డాలర్లు (రూ.370 కోట్లు) అంతకు మించి సంపద కలిగిన వారు భారత్‌లో 4,320 మంది ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. 52 లక్షల కొత్త మిలియనీర్లు అంతర్జాతీయ సంపద 2020లో 28.7 లక్షల కోట్ల డాలర్లు పెరిగి 418.4 లక్షల కోట్ల డాలర్లకు చేరినట్టు క్రెడిట్‌సూసే నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా 52 లక్షల మంది మిలియనీర్లు 2020లో కొత్తగా అవతరించినట్టు.. మొత్తం మిలియనీర్ల సంఖ్య 5.61 కోట్లకు చేరుకున్నట్టు ఈ సంస్థ పేర్కొంది. మొదటిసారి ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లో మిలియనీర్ల సంఖ్య ఒక శాతానికి పైకి చేరుకున్నట్టు తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ 2020లో ప్రతీ గంటకు రూ.90 కోట్ల చొప్పున తన సంపదను పెంచుకున్నట్టు ఇటీవలే హరూన్ ఇండియా సంపన్నుల నివేదిక గణాంకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకారం 2020లో ముకేశ్ సంపద రూ.2,77,700 కోట్ల మేర పెరిగి రూ.6,58,400 కోట్లకు చేరింది. -
గంటకు అంబానీ ఆదాయం ఎంతో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ:ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతాకాదు. దిగ్గజ ఆర్థికవ్యవస్థలు కూడా తీవ్ర మాంద్యంలోకి జారుకున్నాయి. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా దేశీయంగా కోట్లాదిమంది కార్మికులు ఉపాధిలేక రోడ్డున పడ్డారు. కనీసం ఆదాయం లేక తీరని సంక్షోభంలోకి కూరుకుపోయారు. ఈ సంక్షోభానికి సంబంధించిన ఆక్స్‌ఫాం నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. దేశంలో తీవ్రమవుతున్న ఆదాయ అసమానతలపై ప్రధానంగా ఆందోళన వ్యక్తం చేసింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో సోమవారం ఈ నివేదికను ప్రవేశపెట్టింది. దీనిప్రకారం భారతీయ బిలియనీర్ల సంపద 35 శాతం పుంజుకుంది. దీంతో వారి ఆస్థి 422.9 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. ఈ విషయంలో అమెరికా చైనా, జర్మనీ, రష్యా , ఫ్రాన్స్ తరువాత భారతదేశం ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉంది. కరోనావై మహమ్మారి మూలంగా భారతదేశంలోని దేశ బిలియనీర్ల సంపద 35 శాతం పెరిగింది. మరోవైపు పేదలు నిరుద్యోగం, ఆకలితో చావులకు గురయ్యారు. కోట్లాది కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ఫలితంగా ఆదాయ అసమానతల రేషియో మరింత దిగజారిందని వ్యాఖ్యానించింది. లాక్డౌన్ సమయంలో 84 శాతం కుటుంబాలు వివిధ రకాల ఆదాయ నష్టాలను చవిచూశాయని, 2020 , ఏప్రిల్‌లోనే ప్రతి గంటకు 1.7 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని నివేదిక పేర్కొంది. ఇది అనధికారిక రంగాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీసినట్లు నివేదిక పేర్కొంది. మొత్తం 12.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోగా, వీరిలో 75 శాతం మంది అనధికారిక రంగంలో 9.2 కోట్ల ఉద్యోగాలు కోల్పోయారని తెలిపింది. ఈ పరిస్థితులను వెంటనే పరిష్కరించకపోతే ఈ సంక్షోభం మరింత తీవ్రమవుతుందని ఆక్స్‌ఫాం ఇండియా సీఈఓ అమితాబ్ బెహార్ హెచ్చరించారు. మరోవైపు లాక్డౌన్ అమలు చేసిన 2020 మార్చి కాలంనుంచి భారతదేశంలోని టాప్ 100 బిలియనీర్ల ఆదాయం భారీ పెరుగుదలను చేసింది. అంతేకాదు వీరి ఆదాయాన్ని 138 మిలియన్ల పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి, రూ. 94,045 చొప్పున పంచడానికి సరిపోతుందని వెల్లడించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ ఒక గంటలో ఆర్జించిన సంపదను పొందాలంటే సగటు నైపుణ్యం లేని కార్మికుడికి వెయ్యి సంవత్సరాలు పడుతుందని పేర్కొంది. అలాగే ఒక సెకనులో సృష్టించిన దాన్ని సాధించాలంటే మూడు సంవత్సరాలు పడుతుందని నివేదిక తెలిపింది. ఆరోగ్య సంరక్షణలో ఉన్న అసమానతలను కూడా ఎత్తి చూపిన నివేదిక మరో కీలక వ్యాఖ్య చేసింది. కోవిడ్ సమయంలో దేశంలోని టాప్ 11 బిలియనీర్లు ఆర్జించిన సంపదపై కేవలం ఒక శాతం పన్ను విధించినా ప్రజలకు సరసమైన ధరలో నాణ్యమైన మందులను అందించే కేంద్ర జనఔషధి పథకం కేటాయింపులను 140 రెట్లు పెంచుకోవచ్చని అభిప్రాయపడింది. అలాగే 2020 ఏప్రిల్‌లో 1.7 కోట్ల మంది మహిళలు ఉద్యోగాలు కోల్పోయారని తెలిపింది. ముఖ్యంగా లాక్డౌన్ తరువాత మహిళా నిరుద్యోగిత 15 శాతం పెరిగిందని నివేదించింది. కాగా 2020 ఆగస్టులో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఈ గ్రహం మీద నాల్గవ ధనవంతుడిగా నిలిచిన సంగతి తెలిసిందే. మహమ్మారి సమయంలో ఒకవైపు దేశంలో 24 శాతం మంది ప్రజలు నెలకు 3,000 లోపే ఆర్జించగా, అంబానీ మాత్రం గంటకు 90 కోట్ల రూపాయలు సంపాదించారు. ఒక్క అంబానీ ఆర్జించిన సంపాదనతోనే 40 కోట్లమంది అసంఘటిత కార్మికులను కనీసం అయిదునెలలపాటు ఆదుకోవచ్చని ఆక్స్‌ఫాం నివేదించడం గమనార్హం. -
ఆ 63 మంది కుబేరుల ముందు... బడ్జెట్ దిగదుడుపు!
దావోస్: పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలను ప్రతిబింబిస్తూ.. మన దేశ జనాభాలో 70 శాతం (సుమారు 95.3 కోట్ల మంది) జనాభాతో పోలిస్తే 1 శాతం కుబేరుల సంపద ఏకంగా నాలుగు రెట్లు పైగా ఉంది. దేశీయంగా 63 మంది బిలియనీర్ల మొత్తం సంపద విలువ.. పూర్తి ఆర్థిక సంవత్సర బడ్జెట్ పరిమాణాన్ని (2018–19లో రూ. 24.42 లక్షల కోట్లు) మించింది. ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్యుల పక్షం వహించాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ మానవ హక్కుల సంస్థ ఆక్స్‌ఫామ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా ’టైమ్ టు కేర్’ పేరిట ఆక్స్‌ఫామ్ దీన్ని విడుదల చేసింది. దీని ప్రకారం.. ప్రపంచ జనాభాలో సుమారు 60 శాతం (460 కోట్లు) ప్రజలకు మించిన సంపద 2,153 మంది బిలియనీర్ల దగ్గర ఉంది. ‘అసమానతలను తొలగించే కచ్చితమైన విధానాలు లేకుండా సంపన్నులు, పేదల మధ్య వ్యత్యాస సమస్యలను పరిష్కరించడం కుదరదు. కానీ చాలా కొన్ని ప్రభుత్వాలు మాత్రమే ఈ దిశగా కృషి చేస్తున్నాయి‘ అని ఆక్స్‌ఫాం ఇండియా సీఈవో అమితాబ్ బెహర్ పేర్కొన్నారు. 24 వరకూ జరగనున్న డబ్ల్యూఈఎఫ్ సదస్సులో భారత్ నుంచి పలువురు వ్యాపార దిగ్గజాలు, ప్రభుత్వ అధికారులు పాల్గొననున్నారు. నివేదికలోని మరికొన్ని ఆసక్తికర అంశాలు.. ► టెక్నాలజీ సంస్థ సీఈవో ఓ ఏడాదిలో సంపాదించే మొత్తాన్ని ఆర్జించాలంటే సాధారణ మహిళా పనిమనిషికి 22,277 ఏళ్లు పడుతుంది. ఆమె ఏడాది సంపాదనను.. సెకనుకు రూ. 106 చొప్పున టెక్ సీఈవో 10 నిమిషాల్లో సంపాదిస్తున్నారు. ► మహిళలు, బాలికలు రోజుకు 326 కోట్ల గంటల పనిని ఎలాంటి భత్యాలు లేకుండా చేస్తున్నారు. దీనికి లెక్కగడితే ఏటా రూ. 19 లక్షల కోట్లవుతుంది. ఇది 2019లో దేశీ విద్యారంగానికి కేటాయించిన మొత్తం బడ్జెట్ (రూ. 93,000 కోట్లు)కు 20 రెట్లు ఎక్కువ. ► సంక్షేమ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచడంద్వారా 1.1 కోట్ల మేర కొత్త ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. తద్వారా 2018లో కోల్పోయిన 1.1 కోట్ల ఉద్యోగాలను తిరిగి సృష్టించవచ్చు. ► అంతర్జాతీయంగా చూస్తే మొత్తం ఆఫ్రికాలో మహిళల దగ్గరున్న సంపద కన్నా ప్రపంచంలో టాప్ 22 మంది బిలియనీర్ల వద్ద ఉన్న సంపదే ఎక్కువ. ► వచ్చే 10 ఏళ్ల పాటు ఒక్క శాతం కుబేరులు తమ సంపదపై అదనంగా కేవలం 0.5 శాతం పన్ను చెల్లించిన పక్షంలో.. వృద్ధులు, బాలల సంక్షేమం, విద్యా, వైద్యం వంటి రంగాల్లో 11.7 కోట్ల పైచిలుకు ఉద్యోగాల కల్పనకు అవసరమైన పెట్టుబడులకు సరిసమానంగా ఉంటుంది. సోషల్ మొబిలిటీలో అట్టడుగున భారత్.. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలు కూడా ఉన్నత స్థాయిలకు చేరేందుకు అనువైన పరిస్థితులను సూచించే సోషల్ మొబిలిటీ సూచీలో భారత్ అట్టడుగు స్థానంలో ఉంది. డబ్ల్యూఈఎఫ్ రూపొందించిన కొత్త సూచీలో .. 82 దేశాల జాబితాలో 76వ స్థానంలో నిల్చింది. అయితే, దీన్ని మెరుగుపర్చుకోగలిగితే అత్యధికంగా లాభపడే దేశాల్లో చైనా, అమెరికా తర్వాత భారత్ కూడా ఉంటుందని సంబంధిత నివేదికలో డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. ఆర్థిక, సామాజిక నేపథ్యంతో పనిలేకుండా అందరూ పూర్తి స్థాయిలో ఎదిగేందుకు సమాన అవకాశాలు ఏ దేశంలో ఎంత మేర లభిస్తున్నాయన్నది తెలిపేందుకు ఈ సూచీ ఉపయోగపడుతుంది. ప్రధానంగా విద్య, వైద్యం, టెక్నాలజీ తదితర 5 అంశాల ప్రాతిపదికన దీన్ని లెక్కిస్తారు. ఈ విషయాల్లో డెన్మార్క్ టాప్‌లో ఉంది. డబ్ల్యూఈఎఫ్ సదస్సు ప్రారంభం... ప్రపంచ దేశాల అధినేతలు, విధానకర్తలు, వ్యాపార దిగ్గజాలు, ఇతరత్రా ప్రముఖులు హాజరవుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్లాస్ ష్వాబ్ ఈ సందర్భంగా ఆహూతులకు స్వాగతం పలికారు. ‘ఈ 50వ వార్షిక సదస్సులో పాల్గొంటున్న అన్ని దేశాలు, భాగస్వాములు, సభ్యులు, సాంస్కృతిక సారథులకు, యువ నేతలకు స్వాగతం‘ అని ఆయన పేర్కొన్నారు. వ్యాపార సంస్థలు కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఫోరం ఏర్పడిందని, ఇప్పటికీ అదే స్ఫూర్తితో కొనసాగుతోందని ష్వాబ్ చెప్పారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణె సహా పలువురు ప్రముఖులకు క్రిస్టల్ అవార్డ్స్ పురస్కారాలను ప్రదానం చేశారు. మానసిక ఆరోగ్యం ఆవశ్యకతపై అవగాహన పెంచేందుకు కృషి చేసినందుకు గాను పదుకొణె ఈ అవార్డుకు ఎంపికయ్యారు. వివిధ దేశాల నుంచి 3,000 పైగా ప్రతినిధులు సదస్సులో పాల్గొంటున్నారు. -
ఎవరీ భారతీయ కుబేరుడు..?
బ్రిటన్‌లోని స్కాట్లాండ్ సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయంలో చేరనున్న ఓ అమ్మాయికి ఆమె తండ్రి సమకూర్చిన సకల సౌకర్యాలను చూసి బ్రిటన్ పత్రికలు ముక్కున వేలేసుకున్నాయి. కూతురి సపర్యల కోసం భారతీయుడైన ఆ తండ్రి విలాసవంతమైన భవంతిని కొనుగోలుచేయడమేకాకుండా ఆమె అడుగులకు మడుగులొత్తేందుకు 12 మంది ఉద్యోగులను నియమించడం అక్కడి పత్రికల్లో పతాకశీర్షికలకెక్కింది. ప్రిన్స్ విలియమ్స్, అతని భార్య కేట్ మిడిల్టన్ చదివిన సెయింట్ ఆండ్రూస్ వర్సిటీలోనే ఓ భారతీయ కుబేరుడి కూతురు ఎంట్రీ అట్టహాసంగా మారింది. స్కాట్లాండ్లో అత్యంత సుందరమైన భవంతుల్లో ఒకదాన్ని తండ్రి కొనుగోలుచేసి, ఆమెకు బాగా ఇష్టమైన వంటకాలు చేసి వడ్డించేందుకు ఒక పాకశాస్త్రప్రవీణుడిని, ఇంటిని శుభ్రంగా ఉంచేందుకు ఒక పనిమనిషిని, ఆమె డ్రెస్‌లు, ఆమెకు కావాల్సిన వస్తువులను అందుబాటులో ఉంచేందుకు మరో మనిషిని, అమ్మాయి ఇంట్లోకి వచ్చేటపుడు వెళ్లేటపుడు తలుపులు తీసి పట్టుకోవడానికి మరో వ్యక్తినీ, ఇలా ఆమెకు దాదాపు అన్ని పనుల్లో సాయపడేందుకు 12 మంది ఉద్యోగులను నియమిం చారు ఆమె తండ్రి. ఈ ఉద్యోగాలకోసం దరఖాస్తు చేసుకోవాలని సిల్వర్ స్వాన్ రిక్రూట్మెంట్ అనే ఓ ప్రముఖ జాబ్ ఏజెన్సీలో ప్రకటన సైతం ఇచ్చారు. బలహీనంగా ఉండకుండా, హుషారుగా ఉండేవారు మాత్రమే కావాలని పేర్కొన్నారు. భవంతిలో పనిచేయనున్న ఉద్యోగులకు వేతనం సైతం భారీస్థాయిలోనే ఉంది. ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.28 లక్షల వేతనం ఇస్తామని ప్రకటించడంతో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరనేది పెద్ద మిస్టరీ అయ్యింది. ఆ కుటుంబం వివరాలు తెలిసిన వారు సమాచారమివ్వాలని బ్రిటన్ పత్రికలు కోరడం మరో విశేషం. -
కూతురి కోసం కోట్లు ఖర్చుపెడుతున్నాడు!
‘కూతురు ఏదైనా అడిగితే లేదని చెప్పలేని ఒకే ఒక ప్రాణి నాన్న’. తన దగ్గర ఉన్నప్పుడు కూతురిని యువరాణిలా చూసుకునే తండ్రి.. దేనికైనా బయటకి పంపించాల్సి వస్తే అన్ని జాగ్రత్తలతోనే పంపుతాడు. ప్రతి తండ్రి తన కూతురు బంగారం అంటారు.. మరి బంగారాన్ని జాగ్రత్రగా కాపాడుకోవాలనేదే తండ్రి తాపత్రయం. అలాంటి తాపత్రయమే పడ్డాడు ఓ భారత కుబేర తండ్రి. చదువు నిమిత్తం తన కూతురిని పరాయి దేశానికి పంపిచాల్సి వచ్చింది. అయితే అక్కడ తన గారాల పట్టికి ఎలాంటి లోటుపాట్లు రాకుండా ఉండటానికి ఏకంగా 12 మంది సిబ్బందిని నియమించాడు. ఈ 12 మంది వారివారి రంగాల్లో నిష్ణాతులు. కుక్, వెయిటర్, ఫిజీషియన్, డ్రైవర్, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ ఇలా 12 మందిని కూతురికి సహాయంగా ఉండటానికి భారీ వేతనాలతో పరాయి దేశం పంపించాడు . అసలు ముచ్చటేంటంటే.. భారత్‌లో అత్యంత సంపన్నుడి(పేరు వెల్లడించలేదు) కూతురుకి స్కాట్లాండ్ లోని యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్‌లో సీటు లభించింది. అక్కడి ఓ హాస్టల్లో ఆమె చేరింది. వారం రోజుల అనంతరం ఆ యువతి.. ఇక్కడ అన్ని పనులు తానే చేసుకోవడం ఇబ్బందిగా ఉందని తండ్రితో చెప్పింది. దీంతో ఒక విలాసవంతమైన భవానాన్ని కూతురు కోసం అద్దెకు తీసుకొని, దేశంలో వివిధ రంగాల్లో అనుభవం కలిగిన వారిని భారీ వేతనంతో(సంవత్సరానికి రూ. 28.5 లక్షలు) పంపించాడు. తన కూతురికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఉద్యోగులకు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇలా నాలుగు సంవత్సరాల యూనివర్సిటీ ఫీజు కన్నా సిబ్బంది వేతనమే ఎక్కువగా ఉంది. -
మళ్లీ ముకేశ్ అంబానీ టాప్...
- ‘ఫోర్బ్స్’ భారతీయ బిలియనీర్లలో అగ్రస్థానం; సంపద 21 బిలియన్ డాలర్లు - ప్రపంచ జాబితాలో 39వ ర్యాంక్ వాషింగ్టన్: భారత బిలియనీర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మళ్లీ 8వ సారి అగ్రస్థానంలో నిలిచారు. 21 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ ప్రపంచ జాబితాలో ముకేశ్ 39వ స్థానంలో ఉన్నారు. సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ శాంఘ్వీ 20 బిలియన్ డాలర్లతో 44వ స్థానంలో ఉన్నారు. విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ 19 బిలియన్ డాలర్లతో 48వ స్థానంలో ఉన్నారు. ⇒ ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 79.2 బిలియన్ డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 16వ సారి అగ్ర స్థానంలో కొనసాగుతున్నారు. ఈయన తర్వాతి స్థానంలో 77.1 బిలియన్ డాలర్లతో మెక్సికన్ వ్యాపారవేత్త కార్లోస్ స్లిమ్ రెండో స్థానంలో, 72.7 బిలియన్ డాలర్లతో ప్రముఖ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ మూడో స్థానంలో ఉన్నారు. ⇒ గతేడాది 1,645గా ఉన్న బిలియనీర్ల సంఖ్య ఈ ఏడాది 1.826కి పెరిగింది. ⇒ వీరి ఆస్తి విలువ మొత్తంగా 7.05 ట్రిలియన్ డాలర్లుకాగా, సగటు 3.86 బిలియన్ డాలర్లు. ⇒ ఆసియా-ఫసిఫిక్‌లో 562, యూఎస్‌లో 536, యూరప్‌లో 482 బిలియనీర్లు ఉన్నారు. ⇒ గతేడాది 172గా ఉన్న మహిళ బిలియనీర్ల సంఖ్య ఈ ఏడాది 197కు చేరింది. ⇒ అతి చిన్న వయసులో బిలియనీర్ల జాబి తాకెక్కిన వ్యక్తి స్నాప్‌చాట్ సీఈఓ ఈవన్ స్పీగెల్ (24). సంపద విలువ 1.5 బిలియన్ డాలర్లు. -
భారత కుబేరుల జేబులో స్పోర్ట్స్ టీమ్‌లు..!
న్యూయార్క్: స్పోర్ట్స్ టీమ్‌లను సొంతం చేసుకోవడం భారత సంపన్నుల సరికొత్త స్టేటస్ సింబల్‌గా మారిం దని ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ తెలిపింది. స్పోర్ట్స్ టీమ్‌లను సొంతం చేసుకునే రేసులో భారత కుబేరులు ఇప్పుడు తలమునకలై ఉన్నారని వివరించింది. సంపన్న భారతీయుల్లో అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ముకేశ్ అంబానీ ఈ రేసులో కూడా దూసుకుపోతున్నారని వివరించింది. ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియన్స్ ముకేశ్ అంబానీదే. 2008లో 11 కోట్ల డాలర్లకు కొన్న ఈ టీమ్ ప్రస్తుత విలువ 20 కోట్ల డాలర్లని అంచనా. ఫోర్బ్స్ అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో 38వ స్థానంలో ఉన్న కళానిధి మారన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను, 98వ స్థానంలో ఉన్న జీఎంఆర్ జి.ఎం. రావు ఢిల్లీ డేర్ డెవిల్స్‌ను సొంతం చేసుకున్నారు. సాకర్‌కు సంబంధించి వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఇండియన్ సూపర్ లీగ్‌లో టీమ్‌లను సొంతం చేసుకోవడంపై అంబానీలు కన్నేశారు. వీడియోకాన్ వేణు గోపాల్ ధూత్, సంజీవ్ గోయెంకాలు కూడా ఈ సాకర్ టీమ్‌లను కొనుగోలుదారుల్లో ఉన్నారు. భారత పురాతన క్రీడ కబడ్డీకి సంబంధించి మార్చిలో ప్రొ కబడ్డి లీగ్ ప్రారంభమైంది. 37 రోజుల పాటు జరిగిన ఈ కబడ్డీ పోటీలను 43.5 కోట్ల మంది టీవీ ప్రేక్షకులు చూశారని అంచనా. ఎక్కువ మంది వీక్షకులు చూసిన రెండో అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ ఇదే. ఉదయ్ కోటక్, కిశోర్ బియానీలు కబడ్డీ టీమ్‌లను సొంతంచేసుకున్నారు.