Antiques
-
కాదేదీ బిజినెస్‌కు అనర్హం.. రెంజిని కళాహృదయం నిద్రలేచిన వేళ
‘కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బు బిళ్ల...కావేదీ కవితకనర్హం అన్నారు శ్రీశ్రీ. కుక్కపిల్ల, అగ్గిపుల్లల సంగతేమిటోగానీ వృథాగా పడి ఉన్న ఖాళీ సీసాలు మాత్రం తమ విలువ తెలుసుకోమన్నాయ్! మరి రెంజిని కళాహృదయం ఊరుకుంటుందా! ఎన్నెన్నో కళాకృతులను సృష్టించి పాత వస్తువులకు కొత్త శోభను తీసుకువచ్చింది. తన అభిరుచిని వ్యాపారంగా మలిచి విజయం సాధించింది 35 సంవత్సరాల రెంజిని థామస్....దుబాయ్‌లో ఎం.బి.ఎ. ఫైనాన్స్ చదువుకున్న రెంజిని ఆ రంగంలో కాకుండా మీడియా ఫీల్డ్‌లో పనిచేసింది. 2015లో స్వరాష్ట్రం కేరళకు వచ్చిన రెంజినికి వివాహం అయింది. ‘9 టు 5’ షెడ్యూల్ బోర్ కొట్టడం వల్ల మళ్లీ ఉద్యోగం చేయాలనిపించలేదు. ఖాళీ సమయాన్ని తన ఇష్టమైన పెయింటింగ్‌తో గడిపేది.స్వస్థలం కొచ్చిలో తన పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఆర్ట్ లవర్స్‌తో ఒక కమ్యూనిటీని ఏర్పాటు చేసింది. భర్త కూడా ఆర్టిస్ట్ కావడం వల్ల ఇంటినిండా ఆర్ట్ ముచ్చట్లే! బయటకు వెళ్లినప్పుడు రెంజినికి ఎక్కడ పడితే అక్కడ వృథాగా పడి ఉన్న గాజు సీసాలు కనిపించేవి. భర్త నిర్వహించే ‘సౌండ్ స్టూడియో’కు పాత సంగీత పరికరాలను కొనుగోలు చేయడానికి పాత వస్తువులు అమ్మే ఒక దుకాణానికి వెళ్లింది. అక్కడ వృథాగా పడి ఉన్న ఖాళీ సీసాలు కనిపించాయి. ఆ సమయంలో తనలోని కళాహృదయం నిద్రలేచింది! సీసాలతో పాటు పాత టైర్ రిమ్స్. బకెట్లు, గ్లాసులు.. మొదలైనవి సేకరించడం ప్రారంభించింది రెంజిని. ఒక ఫైన్ మార్నింగ్ వాటితో ఆర్ట్ మొదలుపెట్టింది. వృథా వస్తువులతో కొన్ని హోమ్డేకర్ ఐటమ్స్ తయారుచేసి ఫ్రెండ్స్‌కు బహుమతిగా ఇచ్చింది.‘అద్భుతం’ అనడమేకాదు ‘వీటితో వ్యాపారం చేస్తే బాగుంటుంది’ అని సలహా ఇచ్చారు. వారి సలహాతో ఆన్–డిమాండ్ ఆర్డర్స్ కోసం డెకరేషన్ ఐటమ్స్ తయారీ మొదలుపెట్టింది. వివిధ రూపాల్లో ఆర్ట్ కోసం ఖర్చుపెట్టడం తప్ప ఆర్ట్ ద్వారా డబ్బు సంపాదించడం తనకు ఇదే తొలిసారి! పర్యావరణం కోసం పనిచేస్తున్న ‘క్లైమెట్ కలెక్టివ్’ అనే స్వచ్ఛందసంస్థ మహిళా వ్యాపారుల కోసం ‘క్లైమెట్ ఛేంజింగ్ కాంపిటీషన్’ నిర్వహించింది. రెంజిని తయారుచేసిన కళాకృతులను చూసి ‘క్లైమెట్ కలెక్టివ్’ నిర్వాహకులు ప్రశంసించారు. మరిన్ని కళాకృతులు తయారు చేయాల్సిందిగా కోరారు. రెంజిని ఈ పోటీలో సెమీ–ఫైనల్స్ వరకు వెళ్లింది. ఐఐఎం–బెంగళూరు స్టార్టప్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన రెంజిని అక్కడ ఎన్నో విషయాలు తెలుసుకుంది. అప్ సైకిల్డ్ ప్రాడక్ట్స్‌కు మంచి డిమాండ్ ఉన్న విషయం తనకు అర్థమైంది. ఈ ఉత్సాహంతో ‘వాపసీ’ పేరుతో ఆన్లైన్లో డెకరేషన్ స్టోర్ ప్రారంభించింది. ఇందులో గ్లాస్ బాటిల్స్, కొబ్బరి చిప్పలు, రకరకాల పాతవస్తువులతో తయారు చేసిన 21,000 హోమ్డెకరేషన్ ఐటమ్స్ కనువిందు చేస్తాయి. గ్లాస్ వర్క్ అనేది కత్తి మీద సాములాంటిది. బోలెడు ఓపిక ఉండాలి. చిన్న తప్పు దొర్లినా గ్లాస్ పాడై పోతుంది. తాను చేసిన తప్పులతోనే ఎన్నో పాఠాలు నేర్చుకుంది రెంజిని. ‘మొదట్లో నా వర్క్స్‌పై నాకు అంతగా ఆత్మవిశ్వాసం ఉండేది కాదు. అయితే ఐఐఎం–బెంగళూరు పాఠాలతో నాపై నాకు ఆత్మవిశ్వాసం ఏర్పడింది’ అంటున్న రెంజిని థామస్ భవిష్యత్‌లో మరిన్ని పర్యావరణ హిత కళాకృతులను తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. -
శిథిలావస్థలో ఉన్న ఇంటిని తవ్వుతుండగా...బయటపడ్డ నిధి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో శిథిలావస్థలో ఉన్న ఇంటిని తవ్వుతుండగా కోటి రూపాయాలు విలువ చేసే నిధి బయటపడింది. ఐతే ఆ నిధిని సదరు ఇంటి యజమానికి చెప్పకుండా కూలీలే పంచుకుని తమ అవసరాలకు ఉపయోగించుకోవడంతో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ధార్ సమపంలోని నల్చా దర్వాజా చిట్నీస్ చౌక్‌లోని ఇంట్లో ఎనిమిది మంది కూలీలు పనిచేస్తున్నారు. కూలీలు ఆ ఇంటిలో పని నిమిత్తం తవ్వకాలు జరుపుతుండగా ఒక గోడ నుంచి కోటీరూపాయల పైనే విలువ చేసే నిధి బయటపడింది. ఆ నిధిలో సుమారు 103 పురాతన నాణేలు, పాత బంగారు ఆభరణాలను సదరు కార్మికులు పంచుకున్నారు. ఐతే అందులో ఒక కార్మికుడు తన వాటా నిధిలోని బంగారు నాణాలను ఉపయోగించి తన అప్పులను తీర్చకోవడమే కాకుండా బైక్‌ని కొనుగోలు చేయండం వంటివి చేశాడు. దీంతో పోలీసులు అనుమానించి ఆ కార్మికుడుని విచారించగా అసలు విషయం బయటపడింది. వాస్తవానికి ఆ ఇల్లు శివనారాయణ రాథోడ్‌కి చెందినది. అతని ఇల్లు రెండు భాగాలు నిర్మించబడి ఉంది. అందులో ఒక భాగంలో సదరు యజమాని కుటుంబం ఉంటుంది. మరోక భాగంలో ఇంటి పనులు జరుగుతున్నాయి. పనులు జరుగుతున్న ఇంటిలోనే ఈ నిధి బయటపడింది. కానీ వారు ఈ విషయాన్ని యజమానికి చెప్పకుండా చాలా జాగ్రత్తపడ్డారు. దీంతో పోలీసులు సదరు కూలీల నుంచి ఆ నిధిని స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: బెలూన్‌లో గాలిని నింపే సిలిండర్ పేలి చిన్నారి మృతి) -
ఓ కుటుంబాన్ని కోటిశ్వరులుగా మార్చిన ప్లవర్‌వేజ్
ఒక్కోసారి అదృష్టం ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. మన దగ్గర ఉన్నవాటి నుంచే అదృష్టం తలుపుతడుతుందని కూడా అనుకోం. ఒక్కోసారి చాలా వింతగా అనుకోను కూడా అనుకోని, ఊహించని సంఘటనలు ఎదరువుతుంటాయి. ఇలాంటి సంఘటనల కారణంగానే మన కళ్లముందు అప్పటి వరకు చాలా సాదాసీదాగా ఉన్నవాడు ఒక్కసారిగా రాత్రికి రాత్రే స్టార్ అయ్యిపోతుంటాడు. అలాంటి వారిని ఇప్పటి వరకు ఎంతోమందిని చూసుంటాం. కానీ ఇంట్లో వృద్ధాగా పడి ఉన్న ఒక ఫ్లవర్ వేజ్ ఒక కుటుంబాన్ని కోటిశ్వరుణ్ణి చేసిందంటే నమ్మగలరా!.ఔను నిరుపయోగంగా ఒక మూలన పడి ఉన్న ప్లవర్ వేజ్ ఓ కుటుంబం తలరాతని మార్చేసింది. వివరాల్లోకెళ్తే...యూకేలోని మిడ్‌ల్యాండ్స్‌లో నివసిస్తున్న ఒక కుటుంబం 1980లలో ఒక ప్లవర్ వేజ్ జాడీని కొనుగోలు చేశారు. ఐతే వాళ్లు దాన్ని ఇంట్లో అలంకరణ వస్తువుగా కొన్నేళ్లు ఉపయోగించారు. కాలక్రమేణ పగుళ్లు రావడంతో దాన్ని వంటగదిలో ఓ మూలన పెట్టేశారు. ఆ ప్లవర్ వేజ్‌ని వాడడం మానేసి చాలా ఏళ్లయ్యింది. ఐతే అనుకోకుండా ఒక రోజు వారింటికి వచ్చిన ఓ ఆర్కియాలజిస్ట్ దృష్టిలో ఆ ప్లవర్ వేజ్ పడింది. ఆయన ఆ ప్లవర్ వేజ్ జాడీ విశిష్టత గురించి వివరించి చెప్పాడు. ఇది నీలిరంగులో ఉన్న వెండి, గోల్డ్‌తో తయారు చేయబడిన పాత్ర అని చెప్పాడు. ఇది 18వ శతాబ్దపు రాజు కియాన్లాంగ్ కాలంలో ఉపయోగించేవారని ఆ పాత్రపై ఉన్న ఆరు అక్షరాల ముద్ర ద్వారా తెలియజేశాడు. అంతేకాదు ఈ రాజరికపు ప్లవర్ వేజ్ జాడీతో బంగారం, వెండికి సంబంధించిన పనులు చేసేవారని తెలుసుకుని ఆ కుటుంబం ఆశ్చర్యపోయింది. దీనిపై ఎనిమిది అమర చిహ్నాలు ఉన్నాయని, అవి దీర్ఘాయువును శ్రేయస్సును సూచిస్తుందని ఆ నిపుణుడు వివరించాడు. ప్రస్తుతం ఈ జాడి ధర రూ. 1 కోటి 44 లక్షల రూపాయల వరకు పలుకుతుందని కూడా చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న ఒక చైనా ధనవంతుడు ఆ ఫ్లవర్ వేజ్ జాడీని 1.2 మిలియన్ పౌండ్లకు (దాదాపు రూ.11 కోట్ల 53 లక్షలు) కొనుగోలు చేశాడు. అంతేగాదు తమ వంశీయులు పోగొట్టుకున్న వారసత్వ సంపదను తిరిగి పొందినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడతను. (చదవండి: బోనులో ఉన్న సింహంతో పరాచకాలు ఆడాడు...ముచ్చెమటలు పట్టించేసిందిగా: వీడియో వైరల్) -
నకిలీ పురాతన వస్తువుల పేరుతో దాదాపు రూ.9 కోట్లు కొట్టేశారు!
Delhi man duped of Rs 9 crore over fake antique items: ఇంతవరకు మనం రకరకాల చోరీలు గురించి విన్నాం. ఉద్యోగం ఇప్పిస్తానని లేక స్కీం పేరిట అధిక మొత్తంలో మోసాలకు పాల్పడటం గురించి విని ఉంటాం. కానీ ఏకంగా పురాతన వస్తువులను అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు విక్రయిస్తామని చెప్పి ఇద్దరూ దుండగలు కోట్లలో డబ్బును కొట్టేశారు. అసలు విషయంలోకెళ్తే...ఇద్దరు వ్యక్తులు రేడియో ధార్మిక గుణాలు కలిగిన పురాతన వస్తువులను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు ఎక్కువ ధరకు విక్రయిస్తామనే సాకుతో దాదాపు రూ.9 కోట్ల మోసానికి పాల్పడ్డారు. ఈ నిందుతులను ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం అరెస్టు చేసింది. పైగా ఆ నిందుతులని పోలీసులు ఘజియాబాద్‌కు చెందిన 44 ఏళ్ల అమిత్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన 44 ఏళ్ల గణేష్ ఇంగోల్‌గా గుర్తించారు. ఈమేరకు ఢిల్లీ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఛాయా శర్మ మాట్లాడుతూ..."గౌతమ్ పూరి అనే ఆమె ఫిర్యాదు మేరకు ఆ నిందుతులను అరెస్టు చేశాం. బాధితురాలితో ఆ నిందుతులు తాము భారత్, విదేశీ అంతరిక్ష సంస్థలతో సంబంధం ఉన్నవారిగా పరిచయం చేసుకున్నారు. అంతేకాదు బార్క్, డీఆర్డీవో, పురావస్తు శాస్త్రవేత్తలు మాత్రమే పురాతన వస్తువులను తనిఖీ చేయగలరని చెప్పారు. అంతేగాక అంతర్జాతీయ మార్కెట్లో పురాతన వస్తువులకు అంగుళానికి రూ 11 కోట్లు వరకు ధర ఉంటుందని బాధితుడికి ఆశ చూపారు. ఈ మేరకు ఆ నిందుతులు రైస్ పుల్లర్, రేడియోధార్మిక అద్దం, కొన్ని పురాతన వస్తువును చూపించి బాధితుడిని నమ్మించారు. అయితే తొలుత పురాతన వస్తువును పరీక్షించడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందని చెప్పి పెట్టుబడిగా సుమారు రూ.8.93 కోట్లు స్వాహా చేశారు. అంతేకాదు ఆ నగదుని చెక్కు, ఆర్టీజీఎస్, రూపంలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పైగా ఆ పురాతన వస్తువులను నాసాకు ప్రపంచవాతావరణ సంస్థకు విక్రయిస్తామని చెప్పారుఅయితే నిందుతుడు గణేష్ ఇంగోలు మెకానికల్ ఇంజనీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ మాత్రమే కాక ఆరు నెలల పాటు బార్క్ నుండి ప్రాజెక్ట్ శిక్షణ పొందాడం విశేషం. అయితే ఈ చీటింగ్ కేసులో మరో ఎనిమిది మంది ఉన్నారని, పైగా వారి పై వివిధ రాష్ట్రాల్లో పలు కేసులు నమోదైయ్యాయి." అని పోలీసులు వెల్లడించారు. (చదవండి: పోస్ట్‌మార్టం చేయబోతుండగా లేచి కూర్చున్న ఖైదీ! షాక్ తిన్న వైద్యులు!!) -
ఇవి మామూలు కళ్లద్దాలు కావు.. కనీసం రూ.25 కోట్లు
చూడ్డానికి మామూలు కళ్లద్దాల్లాగే కనిపిస్తున్నాయి కదూ.. ! అయితే.. వీటిని వేలం వేయనున్న సథబీస్ సంస్థ మాత్రం ఇలాంటివి ప్రపంచంలో మరెక్కడా లేవని చెబుతోంది.. ఏంటి విషయమని ఆరా తీస్తే.. వీటితో మనకున్న లింకు కూడా బయటపడింది. 17వ శతాబ్దానికి చెందిన ఈ కళ్లద్దాలు.. మన దేశాన్ని పాలించిన మొఘలులకు చెందినవట. సాధారణంగా కళ్లద్దాల అద్దాలను గాజుతో చేస్తారు. వీటిని మాత్రం వజ్రం, పచ్చతో చేశారు. అది కూడా మన గోల్కొండ వజ్రాల గనిలో లభ్యమైన ఓ 200 క్యారెట్ల వజ్రం నుంచే వీటిల్లో ఒక అద్దాన్ని తయారుచేశారట. మొఘలుల కాలం నాటి కళాకారుల పనితనానికి ఇదో మచ్చుతునకని సథబీస్ ప్రతినిధులు చెబుతున్నారు. దీన్ని అప్పటి మొఘల్ చక్రవర్తి లేదా ఆయన దర్బారులో పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి ధరించి ఉండొచ్చని అంటున్నారు. జ్ఞానసిద్ధికి.. దుష్టశక్తులు దరిచేరకుండా ఉండటానికి వీటిని ధరించేవారట! వచ్చే నెల్లో జరగనున్న వేలంలో ఇవి కనీసం రూ.25 కోట్లు పలుకుతాయని సథబీస్ సంస్థ చెబుతోంది. -
అద్దం విలువ ఏడున్నర లక్షలా..!?
లండన్: రోజు లేవగానే బ్రష్ చేసుకుంటూ ముఖం చూసుకునే తమ బాత్రూం అద్దం వెనక ఎంతో చరిత్ర ఉందని ఆ కుటుంబానికి తెలియదు. ఆ అద్దాన్ని ఇప్పుడు వేలం వేస్తే 8 వేల పౌండ్లు(7,68,590.90 రూపాయలు) ఖరీదు చేస్తుందని తెలిసి వారు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టారు. ఒక అద్దానికి అంత ఖరీదు ఎందుకు అంటే.. అది ఫ్రాన్స్ చివరి రాణి మేరీ ఆంటోనిట్టేకు చెందినది కావడమే కారణం. 19, 15 అంగుళాల కొలత గల ఈ అద్దం 18వ శతాబ్దానికి చెందినదిగా తూర్పు బ్రిస్టల్ వేలం కంపెనీ గుర్తించింది. దీని చుట్టూ ఉన్న నగిషీలను 19వ శతాబ్దంలో చెక్కినట్లు గుర్తించారు. ఇక ఫ్రేమ్‌లోని వెండి ఫలకం మీద ఈ అద్దం తొలుత మేరీ ఆంటోనిట్టే వద్ద ఉండేదని తరువాత దాన్ని మూడవ నెపోలియన్ భార్య ఎంప్రెస్ యూజీని కొనుగోలు చేసిందని ఉంది. ఇదే కాక మేరీ ఆంటోనిట్టే ఎస్టేట్ నుంచి ఎంప్రెస్ యూజీని అనేక వస్తువులను కొనుగోలు చేసిందని సమాచారం. (చదవండి: 60 లక్షలు పలికిన లింకన్ వెంట్రుకలు) ఇక ప్రస్తుతం విషయానికి వస్తే ఒక కుటుంబ సభ్యుడు మాట్లాడుతూ.. ‘మా అమ్మమ్మ నుంచి ఈ అద్దాన్ని వారసత్వంగా పొందాము. అయితే దాని నిజమైన విలువను గ్రహించకుండా మా బాత్రూంలో వేలాడదీశాము’ అని తెలిపాడు. ఈస్ట్ బ్రిస్టల్ వేలం ఐడెన్ ఖాన్ మాట్లాడుతూ.. "ఈ అద్దానికి ఎంతో అద్భుతమైన చరిత్ర ఉంది. కానీ పాపం ఇంతకాలం బాత్రూంలో పడి ఉంది. ఇది చరిత్ర నిజమైన భాగం- పద్దెనిమిదవ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధ వ్యక్తులకు దీనితో దగ్గరి సంబంధం ఉంది" అన్నారు. మేరీ ఆంటోనిట్టే ఫ్రాన్స్ చివరి రాణి. లూయిస్ 16ని ని వివాహం చేసుకున్నారు. ఆమె 1774 -1792 మధ్య పాలన సాగించారు. ఫ్రెంచ్ విప్లవం సమయంలో ఆమె ఉరితీయబడ్డారు.. -
ముంబై నుంచి తీసుకెళ్తేనే.. స్టేట్మెంట్ ఇస్తా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని గోకుల్‌చాట్–లుంబినీ పార్క్‌ల్లో 2007 ఆగస్టు 25న చోటు చేసుకున్న జంట పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న అనీఖ్ షఫీఖ్ సయీద్ ‘మారా’ చేస్తున్నాడు. ప్రస్తుతం ముంబైలోని తలోజ జైల్లో ఉన్న ఇతడిపై అహ్మదాబాద్ కోర్టులో విచారణ సాగుతోంది. అయితే తనను ముంబై నుంచి తీసుకెళ్తేనే వాంగ్మూలం ఇస్తానంటూ తన లాయర్ ద్వారా అహ్మదాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయించాడు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం)కు చెందిన ఈ ఉగ్రవాదికి హైదరాబాద్‌లోని ప్రత్యేక న్యాయస్థానం 2018లో ఉరి శిక్ష విధించింది. అనీఖ్ స్వస్థలం మహారాష్ట్రలోని పుణె. ఇతగాడికి ఖలీద్ అనే మారు పేరు కూడా ఉంది. పుణెలో కంప్యూటర్లు, మొబైల్స్ దుకాణం నిర్వహించేవాడు. ఐఎంలో కీలక ఉగ్రవాది అయిన రియాజ్ భత్కల్ ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లాడు. గోకుల్‌చాట్–లుంబినీ పార్క్ పేలుళ్ల కోసం సిటీకి వచ్చినప్పుడు తన పేరును సతీష్‌గా మార్చుకున్నాడు. రియాజ్ ఆదేశాల మేరకు మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరితో కలిసి 2007 జూలైలో హైదరాబాద్ వచ్చారు. అదే ఏడాది ఆగస్టు 25న రియాజ్ భత్కల్ గోకుల్ ఛాట్‌లో, అనీఖ్ షఫీఖ్ లుంబినీపార్క్‌లో బాంబులు అమర్చగా... మహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి దిల్‌షుక్‌నగర్‌లో బాంబు పెట్టాడు. మొదటి రెండూ పేలగా, మూడోదానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మిగిలిన నిందితులతో పాటు అనీఖ్ కూడా అరెస్టయ్యాడు. ఈ కేసుల విచారణ 2018లో పూర్తికావడంతో న్యాయస్థానం అనీఖ్‌కు ఉరి శిక్ష విధించింది. అయితే మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో ఐఎం సృష్టించిన వరుస పేలుళ్లలోనూ అనీఖ్ కీలక పాత్ర పోషించాడు. దీంతో మహారాష్ట్ర పోలీసులు తమ కేసుల విచారణ కోసం ముంబైకి తరలించారు. ప్రస్తుతం తలోజ జైల్లో ఉన్న ఇతడిపై అహ్మదాబాద్ కోర్టులోనూ విచారణ జరుగుతోంది. దీంతో లాక్డౌన్ మొదలయ్యే వరకు అనీఖ్‌కు అవసరమైన ప్రతి సందర్భంలోనూ ముంబై నుంచి అహ్మదాబాద్‌కు తీసుకువెళ్లేవారు. కరోనా నేపథ్యంలో అహ్మదాబాద్ కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ ప్రారంభించడంతో అతను అప్పటి నుంచి జైలుకే పరిమితమయ్యాడు. అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో ఇతడి నుంచి అక్కడి కోర్టు అదనపు వాంగ్మూలం నమోదు చేయాలని భావించింది. దీంతో ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తలోజ జైలులో ఉన్న అనీఖ్ వాంగ్మూలం రికార్డుకు ఆదేశాలు ఇచ్చింది. అయితే తాను అలా స్టేట్మెంట్ ఇవ్వనంటూ ఈ ఉగ్రవాది స్పష్టం చేశాడు. తనను తలోజ జైలు నుంచి అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలుకు తరలిస్తేనే వాంగ్మూలం ఇస్తానంటూ అందులో పేర్కొన్నాడు. తలోజ జైలు అధికారులు తనకు అహ్మదాబాద్ కేసుకు సంబంధించిన రికార్డులు ఇవ్వలేదని తన పిటిషన్లో వివరించాడు. లాక్‌డౌన్‌కు ముందే తనను సబర్మతి జైలుకు తరలించేందుకు కోర్టు వారెంట్ ఇచ్చిందని, దీనిని పట్టించుకోని తలోజ జైలు అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నాడు. కేసుల విచారణకు అడ్డంకులు సృష్టించి, జాప్యం చేయడానికే ఇతగాడు ఇలా వ్యవహరిస్తున్నాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. అనీఖ్‌కు ఇప్పటికే హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడింది. మిగిలిన కేసుల విచారణ పూర్తయిన తర్వాతే దీన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ కేసుల విచారణకు పొడిగిస్తే శిక్ష అమలు కూడా మరింత ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో అనీఖ్ ఇలా చేస్తున్నాడని పేర్కొంటున్నారు. -
ఇవేంటో గుర్తుపట్టగలరా?
రైల్వేకోడూరు రూరల్: సాంకేతికతతో పురాతన పనిముట్లు కాల గమనంలో ఇమడలేక పోతున్నాయి.. ముఖ్యంగా నాడు ఆహార అవసరాలకు ఉపయోగించుకునే రోలు కుదేలయ్యింది.. తిరగలి(విసురురాయి) తిరగలేక కనుమరుగయ్యింది.. జాడీ(కాగులు) జాడలేకుండా పోయింది. నేడు మానవుడు కాలంతో పరిగెత్తుతూ ఆధునిక యంత్రాల మీద ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి. నాడు గ్రామాల్లోని ప్రతి ఇంటిలో ఒక రోలు ఉండేది. ఇంటి మధ్యలో రోలు ఏర్పాటు చేసుకునేవారు. ఆ రోలులో వివిధ రకాల పచ్చళ్లు నూరుకోవడం, పొడులు చేసుకునేవారు. అలాగే అక్కడక్కడా పెద్దవారి(పలుకుబడి ఉన్న) పెద్దపెద్ద రోళ్లను ఉపయోగించుకుని వడ్లు, కొర్రలు దంచుకునేవారు. నేడు మిక్సీలు రావడంతో పాత రోళ్లు మూలనపడ్డాయి. అయితే రోళ్లలో దంచుకుని తింటే ఆ రుచి భలేగుండేదని పెద్దలు గుర్తుచేసుకుంటున్నారు. అలాగే రైతులు పండించిన రాగులు, సజ్జలు తిరగలి(విసురురాయి) లో విసురుకుని పిండి చేసుకుని వాడేవారు. పిండి మిషను రాకతో తిరగలి కాస్త తిరగకుండా మూలనపడింది. మహిళలు తిరగలి వద్ద కూర్చుని పనిచేసుకుంటూ ఊరి ముచ్చట్లు పెట్టుకునేవారు. టీవీలు, మిక్సీలు రావడంతో అలాంటి వాతావరణం కాసింతయినా కానరాదు. నేటి తరం పిల్లలకు కూడా తిరగలి అంటే ఏంటో తెలియని స్థితిలో ఉన్నారు. గతంలో రైతులు పండించిన ధాన్యాన్ని జాడీలు (కాగులు)లో నిల్వ ఉంచేవారు. వీటిని ప్రత్యేకంగా తయారు చేయించుకునేవారు. ఒక్కో కాగులో 80 సేర్లు నుంచి 120 సేర్ల వరకు వడ్లు నిల్వ చేసుకునే వారు. ఏదిఏమైనా పాత కాలంలోనే ప్రజలు ఆరోగ్యంగా ఉండేవారని పలువురు అంటున్నారు. -
బయటపడ్డ 1100 ఏళ్ల నాటి బంగారు నాణేలు
జెరూసలేం : వేయి సంవత్సరాల కిందట మట్టి పాత్రలో దాచిన వందలకొద్దీ బంగారు నాణేలను ఇజ్రాయెల్ యువకులు గుర్తించారు. ఈనెల 18న ఈ నిధిని కనుగొన్నారని ఇజ్రాయెల్ పురాతన సంపద అథారిటీ సోమవారం వెల్లడించింది. మధ్య ఇజ్రాయెల్‌లో జరుగుతున్న తవ్వకాల వద్ద ఈ నిధి టీనేజ్ వాలంటీర్ల కంటపడిందని అధికారులు తెలిపారు. దాదాపు 1100 సంవత్సరాల కిందట ఈ బంగారు నాణేలను భూమిలో పాతిపెట్టిన వ్యక్తి వాటిని తిరిగి తీసుకువెళ్లాలని ఆశించాడని, అందుకు ఆ ప్రాంతంలో ఓడను కూడా సిద్ధం చేశాడని ఇజ్రాయెల్ అధికారి లియత్ నదవ్‌జివ్ వెల్లడించారు. ఈ సంపదను తిరిగి తీసుకువెళ్లకుండా అతడిని నిరోధించింది ఏమటనేదే మనం అంచనా వేయగలిగిందని చెప్పారు. అమూల్య సంపదను దాచిన సమయంలో ఆ ప్రాంతంలో వర్క్‌షాపులు ఉండేవని, వాటి యజమాని ఎవరనేది ఇప్పటికీ అంతుబట్టని విషయమని అన్నారు. పురాతన బంగారు నాణేలను కనుగొన్న వాలంటీర్లలో ఒకరైన ఒజ్ కొహెన్ ఇవి అద్భుతంగా ఉన్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తవ్వకాల్లో భాగంగా భూమిని తవ్వుతున్న క్రమంలో తాను ఈ బంగారు నాణేలను చూశానని, ఇలాంటి ప్రత్యేక పురాతన సంపదను కనుగొనడం ఉద్వేగంతో కూడిన అనుభవమని చెప్పారు. తొమ్మిదో శతాబ్ధంలో అబ్బాసిద్ కాలిఫేట్ హయాంకు చెందిన 425 నాణ్యమైన 24 క్యారెట్ బంగారు నాణేలు అప్పట్లో చాలా విలువైనవని పురాతన సంపద అథారిటీకి చెందిన నాణేల నిపుణులు రాబర్ట్ కూల్ అన్నారు. ఆ నాణేల విలువతో అప్పట్లో ఓ వ్యక్తి ఈజిప్ట్‌లో అత్యంత విలాసవంతమైన నగరంలో లగ్జరీ హౌస్‌ను కొనుగోలు చేయవచ్చని కూల్ అంచనా వేశారు. చదవండి : ఇజ్రాయెల్‌లో చైనా రాయబారి అనుమానాస్పద మృతి -
430కు కొన్నాడు. 6కోట్లకు అమ్ముడుపోయింది!
ప్రాచీన కాలానికి చెందిన ఓ చదరంగం పావు.. లండన్‌లో జరిగిన వేలంపాటలో ఏకంగా రూ. 6.3 కోట్లకు అమ్ముడుపోయింది. సుమారు 900 ఏళ్ల కిందటి లెవిస్ చెస్‌మ్యాన్ పావును 1964లో ఓ వ్యక్తి కేవలం ఐదు పౌండ్ల (రూ. 430)కి కొనుగోలు చేశాడు. లండన్ సౌత్‌బైలో మంగళవారం జరిగిన వేలంపాటలో ఓ గుర్తుతెలియని బిడ్డర్ ఈ పావును 7.35 లక్షల పౌండ్ల (రూ. 6.3 కోట్ల)కు సొంతం చేసుకున్నాడు. సైనిక యోధుడి రూపంలో ఉన్న ఈ పావు 8.8 సెంటీమీటర్ల పొడవు ఉంది. 12వ శతాబ్దానికి చెందిన వార్లస్ అనే సముద్ర జంతువు దంతంతో ఈ పావును తయారు చేశారు. నార్సె యోధుల రూపంలో లెవిస్ చెస్‌మ్యేన్ పావులు ఉంటాయి. యూరోపియన్ చరిత్రలో వైకింగ్ శకానికి (క్రీ.శ. 800 నుంచి 1066 మధ్యకాలం) చెందిన ఈ కాలపు కళాకృతులు ఎంతో విశిష్టమైనవి. వీటికి మార్కెట్లో గొప్ప ధర పలుకుతుంది. రూర్క్ (చదరంగంలో ఏనుగు)ను తలపిస్తున్న ఈ పావును స్కాటిష్ ప్రాచీన కళాకృతుల డీలర్ వద్ద మొదట కనుగొన్నారు. ఇలాంటి చదరంగం పావులు 1831లో స్కాట్లాండ్లోని ఇస్లే ఆఫ్ లెవిస్‌లో పెద్ద ఎత్తున లభించాయి. మొత్తం ఐదు సెట్ల చెస్ పావులు అక్కడ దొరికాయి. వాటి నుంచి అదృశ్యమైన ఈ చెస్‌పావు.. కాలక్రమంలో అనేకమంది చేతులు మారుతూ.. చివరకు గత మంగళవారం లండన్‌లో వేలంపాటకు వచ్చినట్టు భావిస్తున్నారు. 1964లో ఎడిన్‌బర్గ్‌కు చెందిన డీలర్ తమ నుంచి ఈ చెస్ పావును రూ. 430కి కొనుగోలు చేసినట్టు స్కాటిష్ డీలర్ కుటుంబం ప్రతినిధి తాజాగా మీడియాకు తెలిపారు. -
మ్యూజియాలు భద్రమేనా?
సాక్షి, హైదరాబాద్: ఘనమైన గత వైభవానికి ప్రతీక.. భావితరాలకు జ్ఞాపిక.. పూర్వీకులు మనకిచ్చిన పురాతన చారిత్రక సంపద. తరతరాల చరిత్రకు ఆధారాలు, అలనాటి పాలనకు దర్పణాలు ఆ విలువైన పురాతన వస్తువులు. అత్యంత విలువైన ఆ సంపదకు క్రమంగా ఆపద ముంచుకొస్తోంది. చారిత్రక సంప దను కాపాడాల్సిన మ్యూజియాలకు రక్షణ కరువవుతోంది. చరిత్రను చాటే ఆనవాళ్లు ఒక్కొక్కటిగా కాలగర్భంలో కలసిపోయే పరిస్థితి తలెత్తుతోంది. ‘నిజాం’లో చోరీ: పురావస్తు శాఖ నిర్వహిస్తున్న మ్యూజియాల్లో కొన్నింటికి రక్షణ కరువై విలువైన సంపద దుండగుల చేతికి చిక్కుతోంది. ఇటీవలి హైదరాబాద్ నిజాం మ్యూజియం దొంగతనమే ఇందుకు ఉదాహరణ. మ్యూజియాలపై ప్రభుత్వాల అలసత్వం, అక్కడ తగినంత భద్రత, సీసీ కెమెరాలు లేకపోవడం చోరీలకు కారణంగా చెప్పొచ్చు. పురావస్తు శాఖకు బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించకపోవడం, సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడం కూడా ఆ శాఖపై చిన్నచూపును తెలుపుతోంది. రాష్ట్రంలోని పురావస్తు శాఖలో 200 మంది సిబ్బంది అవసరం ఉండగా 50 మంది కూడా లేకపోవడంతో మ్యూజియాలకు రక్షణ లేకుండా పోతుంది. అన్నింటా విలువైన సంపదే హైదరాబాద్‌లో రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్మారక మ్యూజియం, సెంటినరీ జూబ్లీ హెరిటేజ్ మ్యూజియం, ఖజానా, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, పిల్లలమర్రి, అలంపూర్, పానగల్ మ్యూజియాలతో పాటు నాగార్జునసాగర్, కొలనుపాకలో పురావస్తు శాఖ వస్తు ప్రదర్శన శాలలు నడుస్తున్నాయి. వీటిల్లో రాజుల కాలం నాటి ఆయుధాలు, మట్టి కుండలు సహా మరిన్ని విలువైన వస్తువులున్నాయి. నాగార్జున కొండ మ్యూజియం 1959లో అప్పటి విద్యా శాఖ మంత్రి హుమాయన్ కబీర్ మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1923 నుంచి 1960 వరకు నాగార్జునసాగర్ పరిసరాల్లో పురావస్తు శాఖ వారు నిర్వహించిన తవ్వకాల్లో బయటపడిన శిలలు, శిల్పాలు, శాసనాలు ఇక్కడ ఉన్నాయి. ఫణిగిరిలో ఓ ఇంట్లో..: రాష్ట్రంలో పలుచోట్ల చారిత్రక వస్తువులు, ఆనవాళ్లు గుర్తించినా భద్రపరచడానికి నిధులు, సరిపడా సిబ్బంది లేక పురావస్తు శాఖ కునారిల్లుతోంది. ఫణిగిరిలోని విలువైన సంపదను గ్రామంలోని ఓ ఇంటి గదిలో ఉంచారు. పానగల్ మ్యూజియంలోనూ అనేక విగ్రహాలు ఆలనాపాలనా లేకుండా పడి ఉన్నాయి. ‘పానగల్’కు రక్షణేదీ? నల్లగొండ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోని పానగల్ ఆర్కియాలజీ మ్యూజియాన్ని 1992లో ఏర్పాటు చేశారు. అనేక వినతుల తర్వాత మ్యూజియం ఏర్పాటు చేసినా దాని అభివృద్ధిని, జిల్లాలోని పురాతన వస్తువుల పరిరక్షణనూ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తమకున్న పరిధిలో చాలీచాలని సిబ్బందితోనే చారిత్రక సంపద పట్ల ఆసక్తి ఉన్న శాఖ ఉద్యోగులు, ఇతర చరిత్రకారుల సాయంతో సంపద పరిరక్షణకు తోచింది చేస్తున్నారు. మ్యూజియానికి కనీసం ప్రహరీ కూడా లేకపోవడంతో ఆరుబయట ఉన్న విగ్రహాలు, వస్తువులకు రక్షణ కరువైంది. 2014లో ఈ మ్యూజియం నుంచి 12వ శతాబ్దం నాటి గణపతి విగ్రహాన్ని దుండగులు అపహరించారు. సిబ్బంది సంఖ్య అరకొరగానే ఉండటంతో పగలు ఒకరు, రాత్రి ఇద్దరే (ఒకరు తాత్కాలిక ఉద్యోగి) రక్షణగా ఉంటున్నారు. -
ఈ కత్తుల్లో ఉన్నది గ్రహాంతరాల పదార్థం!
గ్రహాంతర వాసులు ఉన్నారా? అంటే లేరని ఠకీమని సమాధానం చెబుతాంగానీ.. కొన్ని విషయాలు మనల్ని ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తూంటాయి. ఫొటోలో కనిపిస్తున్న కత్తుల్నే ఉదాహరణగా తీసుకుందాం. ఎప్పుడో కొన్ని వేల ఏళ్ల క్రితం ఈజిప్టు రాజు టుటన్‌ఖమూన్ వాడినదట ఇది. గత ఏడాదే దీన్ని ఎక్స్ రేలతో విశ్లేషించారు. దీన్నిబట్టి ఇది ఈ భూమ్మీది లోహమైతే కాదని తేల్చేశారు. అవునా? మరి ఎక్కడి నుంచి వచ్చింది? అని మనమంతా తలలు బద్దలు కొట్టుకుంటూ ఉంటే ఫ్రాన్స్ శాస్త్రవేత్తలు తాజాగా ఇంకో బాంబు పేల్చారు. టుటన్‌ఖమూన్ ఖడ్గం మాత్రమే కాదు.. సుమారు 3300 ఏళ్ల క్రితం నాటి కంచుయుగపు ఈజిప్టు, కొన్ని ఇతర దక్షిణాసియా దేశాల్లో లభించిన చాలా వస్తువులు కూడా ఈ గ్రహానికి చెందినవి కావని అంటున్నారు. కంచుయుగం నాటి ఆయుధాల్లో రాగిని తుత్తునాగం, ఆర్సినిక్ వంటి లోహాలను కలిపితే వచ్చే కంచుతో తయారయ్యేవని మనకు తెలుసు. ఈ కాలంలో ఇనుముతో చేసిన వస్తువులు చాలా అరుదు. ముడి ఇనుమును అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద కరిగించాల్సి రావడం దీనికి ఒక కారణం. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానమూ అప్పట్లో అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు టుటున్ఖమూన్ ఖడ్గంతోపాటు కొన్ని ఇతర వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించారు. దీనిద్వారా తేలిందేమిటంటే... ఈ పురాతన వస్తువుల్లో వాడిన ఇనుము.. గ్రహాంతరాళాల నుంచి వచ్పిపడిన ఉల్కాశకలాలకు సంబంధించినదీ అని! -
భగీరథ తవ్వకాల్లో పురాతన వస్తువులు
► గుప్త నిధులుగా ప్రచారం రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండలో మిషన్ భగీరథ పైపులైను తవ్వకాల్లో గుప్త నిధులు బయట పడ్డాయన్న ప్రచారం మండలంలో దాహనంలా వ్యాపించింది. వాటిని చూసేందుకు ప్రజలు తండోప తండాలుగా వచ్చారు. పైపులైన్ తవ్వకాలు జరుగుతుండగా మంగళవారం గ్రామంలోని బస్టాండ్ çవద్ద పురాతన కాలం నాటి రాగి కూజ, చెంబు, పాత్రలు ఉన్నట్లు గుర్తించారు. సమాచారం తెలియడంతో రఘునాథపల్లి ఎస్సై రంజిత్‌రావు వచ్చి ఆ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అయితే వాటిలో గుప్త నిధులు లభ్యమయ్యాయా.? బయటపడిన సమయంలో వాటిని ఎవరైనా తీసుకున్నారా? అన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఇదే ప్రాంతంలో గతంలో గుప్త నిధులు లభ్యమైనట్లు గ్రామస్తులు చర్చించుకోవడం గమనార్హం. ఈ విషయమై తహసీల్దార్ రవిచంద్రారెడ్డిని వివరణ కోరగా తమకు ఆలస్యంగా సమాచారం అందిందని తమ వీఆర్వో శ్రీహరిని స్వాధీనం చేసుకోమని పంపగా అప్పటికే ఎస్సై తీసుకెళ్లినట్లు తెలిసిందన్నారు. పాత కాలం నాటి రాగి చెంబు, పాత్రలు మాత్రమే ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. వాటిని బుధవారం పురావస్తు శాఖకు అప్పగిస్తామని తెలిపారు.