తిరుపతి: తిరుమల శేషాచల అడవుల్లో ఆదివారం కూంబింగ్ నిర్వహించారు. అర్ధరాత్రి ఆమండూరు వద్ద ఎర్రచందనం కూలీలపై ఆకస్మిక దాడి చేశారు. ఈ ఘటనలో 54 మంది ఎర్రచందనం కూలీలను అరెస్ట్ చేశారు. వీరంతా తమిళనాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం చంద్రగిరి పీఎస్ తరలించారు.
గత నెల చివర్లో శేషాచల అడవుల్లో ఎర్రచందనం దొంగలు, ఎస్‌టీఎఫ్ దళాల మధ్య జరిగిన భీకర పోరులో ముగ్గురు దొంగలు మృతిచెందగా, నలుగురు పోలీసులు గాయపడిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో వంద మంది కూలీలు ఒక్కసారిగా రాళ్లు, విల్లంబులతో దాడిచేశారు.