శేషాచలకొండల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు తమిళ కూలీలను అరెస్ట్ చేశారు.
తిరుపతి: చిత్తూరు జిల్లా శేషాచలకొండల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు తమిళ కూలీలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 27 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. జీవకోన, ఎర్రగుంట అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా.. కారులో తరలించడానికి సిద్ధంగా ఉన్న ఎర్ర దుంగలను పోలీసులు గుర్తించారు. కారుతో పాటు దుంగలను స్వాధీనం చేసుకున్నారు.