నగరంలోని శివారు ప్రాంతాల్లో బుధవారం ఎస్ఓటీ, నార్కొటిక్స్ బ్యూరో జాయింట్ ఆపరేషన్ జరిపింది. ఈ అపరేషన్లో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచిన పలురకాల డ్రగ్స్ స్థావరాలపై అధికారులు ఒక్కసారిగా దాడులు జరిపారు
హైదరాబాద్: నగరంలోని శివారు ప్రాంతాల్లో స్మగ్లింగ్ కు పాల్పడుతున్న డ్రగ్స్ మాఫియాపై బుధవారం ఎస్ఓటీ, నార్కొటిక్స్ బ్యూరో జాయింట్ ఆపరేషన్ జరిపింది. ఈ అపరేషన్లో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచిన పలురకాల డ్రగ్స్ స్థావరాలపై అధికారులు ఒక్కసారిగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో నిల్వ ఉంచిన డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ మాఫియా స్మగ్లింగ్ కార్యాకలపాలకు పాల్పడుతుందన్న సమాచారం మేరకు అధికారులు జాయింట్ ఆపరేషన్ చేసి మహారాష్ట్ర, హైదరాబాద్, చైన్నై గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 12మందిని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా వారినుంచి 2 లక్షల నగదు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నట్టు సైబరాబాద్ సిటీ పోలీస్ పేర్కొన్నారు.