
సాక్షి, న్యూఢిల్లీ: ఓ వైపు చైనా బలగాలు వాస్తవాధీన రేఖ నుంచి రెండు కిలోమీటర్ల మేర వెనక్కు వెళ్లినా, భారత్ మాత్రం గల్వాన్ వ్యాలీ ఘటనను దృష్టిలో ఉంచుకుని ఆచితూచి అడుగేస్తోంది. డ్రాగన్ దుర్భుద్దిని దృష్టిలో పెట్టుకుని ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండేందుకు వైమానిక దళాలను సంసిద్ధంగా ఉంచింది. సుఖోయ్, చినూక్, అపాచీలతో సహా మిగ్–29 ఫైటర్ జెట్లు రాత్రి వేళల్లో ఆపరేషన్లకు సిద్ధంగా ఉన్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని పెద్దాఫీసరు మంగళవారం తెలిపారు. (చైనా యాప్‌ల బ్యాన్ దిశగా అమెరికా?)
గతంలో రాత్రిపూట పైటర్ జెట్లతో గస్తీ ఇబ్బందికరంగా ఉండేదని, ప్రస్తుతం పరిస్థితులు మారాయని మాజీ ఎయిర్ వైస్ మార్షల్ మన్మోహన్ బహదూర్ చెప్పారు. చైనా మళ్లీ దుందుడుకు చర్యకు దిగితే దీటుగా బదులిచ్చేందుకే లడఖ్‌లోని ఎయిర్‌బేస్‌లు హైఅలర్డ్లో ఉన్నాయని మరో అధికారి వెల్లడించారు. గల్వాన్ ఘటన తర్వాత సైనికులను లడఖ్ తరలించడంలో వాయుసేనకు చెందిన సీ–17 గ్లోబ్ మాస్టర్ 3, సీ130జే సూపర్ హెర్క్యూలిస్ విమానాలు కీలకపాత్ర పోషించాయని ఆయన తెలిపారు. (భారీ కుంభకోణం : బ్యాంకు మాజీ సీఈఓ ఆత్మహత్య?)
చైనా విదేశాంగ మంత్రితో భారత భద్రతా సలహాదారు ధోవల్ సమావేశం తర్వాత గల్వాన్ వ్యాలీ, హాట్ స్పింగ్స్తో పాటు గోగ్రా ప్రాంతంలో 1.5 కిలోమీటర్ల మేర చైనా సైనికులు వెనక్కు వెళ్లారు. కీలకమైన పాంగ్యాంగ్ సో వద్ద గల ఫింగర్ పాయింట్ లో ఉంటున్న చైనా సైనికుల సంఖ్య తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment