సార్వత్రిక ఎన్నికలకు రోజులు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ 'ఆర్‌కేఎస్ భదౌరియా' (రిటైర్డ్) మార్చి 24న బీజేపీలోకి చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో బీజేపీలో చేరారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన బదౌరియా.. సిట్టింగ్ ఎంపీ జనరల్ వీకే సింగ్ స్థానంలో ఘజియాబాద్ స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది. పార్టీలో చేరిన తర్వాత ఆర్‌కేఎస్ భదౌరియా (రిటైర్డ్.) మాట్లాడుతూ.. తాను ఐఏఎఫ్‌లో నాలుగు దశాబ్దాలకు పైగా పనిచేశానని, దేశ నిర్మాణానికి మరోసారి సహకరించేందుకు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
భారతీయ వైమానిక దళం(IAF)లో భదౌరియా సుదీర్ఘ సేవలందించారని బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే కొనియాడారు. రక్షణ దళాలలో క్రియాశీల పాత్ర పోషించిన తర్వాత రాజకీయ రంగంలో చురుకుగా పాల్గొంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా.. 543 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకోగా, భారత జాతీయ కాంగ్రెస్ (INC) కేవలం 52 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 282 సీట్లు గెలుచుకోగా, INC కేవలం 44 సీట్లు మాత్రమే సాధించింది.
#WATCH | Former Chief of Air Staff, Air Chief Marshal (Retd.) RKS Bhadauria joins BJP in the presence of party General Secretary Vinod Tawde and Union Minister Anurag Thakur. pic.twitter.com/n3s9k7INmf
— ANI (@ANI) March 24, 2024
Comments
Please login to add a commentAdd a comment