సీన్‌ తొలగించాల్సిందే | IAF objects to scenes in movie AK vs AK | Sakshi
Sakshi News home page

సీన్‌ తొలగించాల్సిందే

Published Thu, Dec 10 2020 12:08 AM | Last Updated on Thu, Dec 10 2020 5:43 AM

IAF objects to scenes in movie AK vs AK - Sakshi

అనురాగ్‌ కశ్యప్‌, అనిల్‌ కపూర్‌

అనిల్‌ కపూర్, పాపులర్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఏకే వర్సెస్‌ ఏకే’. విక్రమాదిత్యా మోత్వానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 24న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్‌లో అనిల్‌ కపూర్‌ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్‌ డ్రస్‌లో కనిపిస్తారు. అలాగే ఆయన మాట్లాడిన డైలాగుల్లో అభ్యంతరకర పదజాలం ఉంది. ఈ విషయంలో ‘ఐఏఎఫ్‌’ (భారత వైమానిక దళం) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎఫ్‌ అధికారిగా అనిల్‌ కపూర్‌ ధరించిన డ్రెస్‌ కోడ్‌ సరిగ్గా లేదని ఐఏఎఫ్‌ పేర్కొంది. అలాగే ట్రైలర్‌లో ఉపయోగించిన పదజాలం ఇబ్బందికరంగా ఉందని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్‌ చేసింది. ఈ విషయంపై అనిల్‌ కపూర్‌ క్షమాపణ కోరుతూ వీడియో విడుదల చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement