న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ పథకం కింద భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ‘అగ్నివీర్‌వాయు’ ద్వారా రిజిస్ట్రేషన్ మొదలైందని ఐఏఎఫ్ ట్విట్టర్ ద్వారా తెలిపింది.
అగ్నిపథ్ పథకం ద్వారా 17.5–23 ఏళ్ల మధ్య యువతను నాలుగేళ్ల సర్వీసులోకి తీసుకుంటారు. వీరిని అగ్నివీర్‌గా పిలుస్తారు. వీరిలో 25% మందిని రెగ్యులర్ సేవలకు వినియోగించుకుంటారు. ఈ పథకం వల్ల సైనిక బలగాల కార్యాచరణ సామర్థ్యం దెబ్బతింటుందంటూ దేశవ్యాప్తంగా మొదలైన నిరసనలు హింసాత్మక రూపం దాల్చడం తెలిసిందే.
Registration window to apply for #Agniveervayu is operational from 10 am today.
— Indian Air Force (@IAF_MCC) June 24, 2022
To register, candidates may log on to https://t.co/kVQxOwkUcz#Agnipath#भारतीयवायुसेनाकेअग्निवीर pic.twitter.com/2ZQl8Ak6nn
Comments
Please login to add a commentAdd a comment