
చంఢీఘడ్ : భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన ఎంఐజీ–29 యుద్ధ విమానం శుక్రవారం పంజాబ్‌లో కూలిపోయింది. షహీద్ భగత్ సింగ్ నగర్‌లోని చువార్పూర్ గ్రామంలోని పొలాల్లో ఎంఐజీ–29 యుద్ధ విమానం కూలిపోయిందని ఎస్‌బీఎస్ నగర్ ఎస్‌పీ వజీర్ సింగ్ ఖైరా తెలిపారు.
విమానం కూలిపోయినట్టు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తమకు సమాచారం అందిందని ఎస్‌బీఎస్ నగర్ సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అల్కా మీనా చెప్పారు. విమానం కూలిపోక ముందే పైలట్ పారాచూట్ ద్వారా బయటకు దూకినట్టు గ్రామస్తుల ద్వారా సమాచారం అందిందన్నారు. పెను ప్రమాదం నుంచి పైలట్ తప్పించుకున్నారని, అతడి జాడను గుర్తించి హెలీకాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్టు ఓ సీనియర్ అధికారి చెప్పారు.