mig 29
-
ఆగ్రాలో కుప్పకూలిన MiG-29 విమానం..
ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన మిగ్-29 ఫైటర్ జెట్ విమానం సోమవారం కుప్పకూలిపోయింది. విమానం నెల కూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. అయితే ప్రమాదం నుంచి పైలట్, కో పైలట్ సురక్షింతంగా బయటపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే విమానం నుంచి కిందకు దూకి ఇద్దరు పైలెట్లు తమ ప్రాణాలను కాపాడుకున్నారు.పంజాబ్ అదంపూర్ నుంచి ఆగ్రా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే విమానం ల్యాండింగ్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో కూలిపోయిందని రక్షణశాఖ అధికారులు తెలిపారు. కాగరౌల్‌లోని సోనిగా గ్రామ సమీపంలోని ఖాళీ పొలాల్లో పైలట్ విమానం కూలిపోయిందని, జనావాస ప్రాంతంలో కూలి ఉంటే భారీ నష్టం జరిగేదని పేర్కొన్నారు. ప్రమాదంపై కోర్టు విచారణకు ఆదేశించనున్నట్లు తెలిపారుఅయితే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ మిగ్-29 విమానం కూలడానికి కారణాలు తెలియరాలేదు. విమానం కూలిన ప్రదేశంలో జెట్ నుంచి పొగలు వెలువడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మిగ్-29 యుద్ధ విమానం కూలిపోయి మంటలు చెలరేగడం ఇదేం మొదటిసారి కాదు. సెప్టెంబర్ 2న రాజస్థాన్‌లోని బార్మర్‌లో సాంకేతిక లోపంతో మిగ్-29 యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ఘటనలోనూ ప్రమాదానికి ముందు పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. -
గోవా తీరంలో కుప్పకూలిన మిగ్-29కే ఫైటర్ జెట్
పనాజీ: భారత నౌకాదళానికి చెందిన మిగ్-29కే ఫైటర్ జెట్ ప్రమాదానికి గురైంది. గోవా తీరంలో సాధారణ పెట్రోలింగ్‌కు వెళ్లి నేవీ బేస్‌కు తిరిగి వస్తున్న క్రమంలో సముద్రంలో కుప్పకూలిపోయింది. యుద్ధవిమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగానే కూలిపోయినట్లు నౌకదళం వెల్లడించింది. అయితే, ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే పైలట్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మిక్-29కే యుద్ధ విమానం ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశించింది నేవీ. 2019 నుంచి మిగ్-29కే ప్రమాదానికి గురికావటం ఇది నాలుగోది. ఫైటర్ జెట్‌లో రష్యా తయారు చేసిన కే-36డీ-3.5 జెట్ నుంచి విడిపోయే సీటు ఉంది. ఈ సాంకేతికత ప్రపంచంలోనే అత్యాధునికమైనదిగా చెబుతారు. హ్యాండిల్ లాగగానే ముందుగా వెనుక సీట్లో ఉన్న పైలట్, ఆ తర్వాత ముందు సీటులోని పైలట్ జైట్ నుంటి బయటపడతారు. ఇదీ చదవండి: ‘మాకు 5జీ ఫోన్లు కావాలి’, స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలకు కేంద్రం ఆదేశాలు -
ఉక్రెయిన్ సాయాన్ని అడ్డుకున్న అమెరికా!!
ఉక్రెయిన్‌కు ప్రత్యక్ష సాయం చేయని అమెరికా.. పరోక్షంగా బయటి నుంచి అందే సాయాన్ని అడ్డుకోవడం విశేషం. అమెరికా ఎయిర్ బేస్ ద్వారా ఉక్రెయిన్‌కు MiG-29 ఫైటర్ జెట్లను పంపాలనుకున్న పోల్యాండ్ ప్రతిపాదనను అగ్రరాజ్యం తోసిపుచ్చింది. అసలు ఆ ప్రతిపాదనను అమెరికా తప్పు పట్టింది. ఉక్రెయిన్‌కు సాయం చేయాలన్న పోల్యాండ్ ప్రతిపాదన.. మొత్తం నాటో కూటమికి ఆందోళన కలిగించే విషయమైని పేర్కొంది. జర్మనీలోని రామ్‌స్టెయిన్‌లో ఉన్న యూఎస్ ఎయిర్‌బేస్‌కు చెందిన సోవియట్ కాలం నాటి విమానాలను ఉక్రెయిన్‌కు తరలించే ప్రతిపాదనను అమెరికా అధికారులు వ్యతిరేకించారు. ఒప్పందం ప్రకారం MiG-29 ఫైటర్ జెట్లను ఉక్రెయిన్ పంపడం సాధ్యపడదని తెలిపారు. అయితే వాటి స్థానంలో F-16 ఫైటర్లను తరలించవచ్చని చెప్పారు. కానీ, ఇది పోల్యాండ్‌కు ఏమాత్రం ఇష్టం లేదు. ఈ విషయంపై పెంటగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌పై రష్యా వైమానికదాడులు చేస్తున్న క్రమంలో యూఎస్-నాటో ఎయిర్ బేస్ నుంచి MiG-29 ఫైటర్ జెట్లను పోల్యాండ్ పంపాలన్న ప్రతిపాదన సరైంది కాదని తెలిపారు. అదేవిధంగా ఈ ప్రతిపాదన మొత్తం నాటో కూటమికి ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. తాము పోల్యాండ్, ఇతర NATO మిత్రదేశాలతో ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. లాజిస్టికల్ సవాళ్లతో కూడిన పోల్యాండ్ ప్రతిపాదన సమర్థనీయం కాదని తెలిపారు. మరోవైపు రష్యా బలగాలు.. ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్నాయి. రష్యా మిలటరీ బలగాలు విధ్వంసం 14వ రోజు కూడా కొనసాగుతోంది. ఇక, ఇవాళైన చర్చల్లో పురోగతి ఉంటుందేమో అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అంతా. చదవండి: భారత్‌కు రుణపడి ఉంటా: పాక్ విద్యార్థిని భావోద్వేగం -
టార్గెట్ ఎక్కడో.. సరిగా అక్కడే..
పురుషులు ఏదైనా టాస్క్ పూర్తి చేస్తే టార్గెట్ చుట్టుపక్కలవి కూడా అన్యాయంగా ధ్వంసం అయిపోతాయి. కొల్లాటరల్ డ్యామేజ్! మహిళలు అలాక్కాదు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టి క్షణాల్లో పక్కకు వచ్చేస్తారు. ఇది నిరూపణ అయిన సంగతే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో తాజాగా ఒక అజ్ఞాత మహిళా ఫైటర్ పైలట్ కు మిగ్– 29 యుద్ధ విమానాన్ని నడపడంలో శిక్షణ ఇవ్వబోతున్నారు. ఎంత ఎగువకు లేచి, ఎంత వాలున మలుపు తీసుకుని, ఎంత దిగువకు చేరి ఆపరేషన్ ‘పూర్తి’ చేయాలో కూడా ఆ మహిళా పైలట్ నేర్చుకుంటారు. బైసన్, సుఖోయ్, రఫెల్ అయ్యాయి. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ తన మహిళా ఫైటర్ పైలట్ల చేతికి మిగ్ 29ను అందించబోతోందన్న మాట! అసలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఎంతమంది మహిళా ఫైటర్ పైలట్లు ఉన్నారు? ఎన్ని రకాల యుద్ధ విమానాలు ఉన్నాయి? యుద్ధం వస్తే కనుక కొల్లాటరల్ డ్యామేజ్‌ని తగ్గించడం కోసం మొదట గగనతలంలోకి ఎగరబోతున్నది మహిళా ఫైటర్ లేనా? భారత వాయుసేనలోని యుద్ధ విమానాల మహిళా పైలట్లు ఇప్పటికే మిగ్–21 బైసన్, సుఖోయ్–30, రఫేల్ వంటి ఫైటర్ జెట్లను నడుపుతున్నారు. క్షణాల్లో నిటారుగా లేచి, కనురెప్పపాటులో ఏటవాలుగా తిరిగి, చప్పున సమాంతర రేఖగా మారి, భూ ఉపరితలానికి దాదాపుగా దగ్గరగా దిగి, శత్రుస్థావరాలను ఒక్క ఉదుటన పేల్చేసి, రయ్యిన పైకి లేచి వచ్చే విన్యాసాలలో నైపుణ్యాన్ని సాధించినవారే వారంతా! ఇప్పుడిక మిగ్–29 వంతు. భూగోళమే దద్దరిల్లేలా పిడుగుపాటు వేగంతో కదలే ఈ యుద్ధ విమానాన్ని నడపడంలో తొలిసారి ఒక మహిళా ఫైటర్ పైలట్‌కు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐ.ఎ.ఎఫ్) శిక్షణ ఇవ్వనుంది. ఇప్పటికే వాయుసేనలో ఉన్న ఫైటర్ పైలట్లలో ఆమె ఒకరైనప్పటికీ, ఆమె ఎవరన్నదీ ప్రస్తుతానికైతే గోప్యమైన సంగతే. బహుశా శిక్షణ పూర్తయ్యాకో, శిక్షణాసమయంలోనో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆమె పేరును బయటపెట్టవచ్చు. మిగ్–29 : భారత వాయుసేన బాహుబలి తొంభై ఏళ్ల నుంచీ భారత వాయుసేన ఉన్నప్పటికీ ఇటీవల ఐదేళ్ల క్రితం మాత్రమే ఐ.ఎ.ఎఫ్ తొలిసారి మహిళల్ని ఫైటర్ పైలట్లుగా తీసుకుంది! భారత రక్షణ దళంలో అదొక చరిత్రాత్మక పరిణామం. అమ్మాయిలేంటీ, శత్రువు వెన్ను విరిచేందుకు గాలిలోకి యుద్ధ విమానాలను తిప్పడం ఏంటి అని అప్పుడే పురుష ప్రపంచం నొసలు విరిచింది. ఐ.ఎ.ఎఫ్ ఆ విరుపుల్ని పట్టించుకోలేదు. పైగా.. ఫైటర్ జెట్‌కి ఏం తెలుసు.. తనను నడుపుతోంది పురుష పైలటో, మహిళా పైలటో అని నవ్వేసి, స్త్రీ పురుషుల మధ్య జెండర్ యుద్ధవాతావరణాన్ని తేలికపరిచింది. ఐ.ఎ.ఎఫ్.లోని ఫైటర్ జట్లు ఒక్కోటీ ఒక్కో రకంగా ఉంటాయి. వాటిని ఒక్కో విధమైన ప్రత్యేక నైపుణ్యంతో నడపవలసి ఉంటుంది. వాటన్నింటిలో ఆరితేరిన మహిళా పైలట్లకు నేర్చుకోడానికి ఇప్పుడు మిగిలింది మిగ్–29 మాత్రమే. అందులోనూ శిక్షణ పొందితే భారత వాయుసేనకు ఇక కొండంత ధైర్యం. ఏ అమ్మాయి ఏ జెట్నైనా ‘డీల్’ చేయగలదు. ఎలాంటి అనూహ్య పరిస్థితిలోనైనా జెట్‌ను బయటికి తీయగలదు. చైనా, పాకిస్తాన్లను విశ్వసించలేని ప్రస్తుత తరుణంలో మహిళా పైలట్లకు ఇది అత్యవసర శిక్షణ. గత ఏడాది ఫ్లయిట్ లెఫ్ట్‌నెంట్ శివాంగి సింగ్‌కు ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న రఫేల్ యుద్ధ విమానాన్ని అప్పగించింది ఐ.ఎ.ఎఫ్.! హర్యానాలోని అంబాలాలో ఉన్న వైమానిక స్థావరం నుంచి రఫేల్‌ను నడపడంతో శివాంగి శిక్షణ పొందుతున్నారు. భారత వాయుసేన 2015 నుంచీ తీసుకుంటూ వచ్చిన పది మంది మహిళా ఫైటర్ పైలట్లలో శివాంగి ఒకరు. ఈ పదిమందికి కూడా మిగ్–21తో శిక్షణ ప్రారంభం అయింది. తర్వాత మిగతా యుద్ధ విమానాల శిక్షణ. ప్రస్తుతం ఒక మహిళాపైలట్ చేతికి అందబోతున్నదని రూఢీగా తెలుస్తోన్న మిగ్–29 గత పదేళ్లలోనూ అనేకమైన మార్పులతో వృద్ధి చెందుతూ వస్తోంది. ఏవియానిక్స్, వెపన్స్, రాడార్, ‘హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే’ (హెచ్.ఎం.డి.) వంటివన్నీ అధునాతనం అయ్యాయి. ఉదా : హెచ్.ఎం.డి.! మొదట్లో ఈ హెల్మెట్.. పైలట్ కళ్లకు గ్రాఫిక్స్‌గా హెచ్చరికల సమాచారం అందించేది. ఇప్పుడిది ఇమేజెస్‌గా డిస్ప్లే అవుతోంది. ఈ కొత్త టెక్నాలజీలను అర్థం చేసుకోవడం, ఆపరేట్ చెయ్యడం, ప్రమాదాలను తప్పించుకోవడం, ఎదురు దాడుల నుంచి కాపాడుకోవడం.. ఇవన్నీ శిక్షణలో ప్రాథమికమైనవిగా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పదిమంది మహిళా ఫైటర్ పైలట్లతో పాటు 18 మంది మహిళా నేవిగేటర్లు (భూమి పై నుంచి విమాన మార్గాన్ని, విమాన కదలికల్ని నియంత్రించేవారు) భారత వాయు సేనలో ఉన్నారు. వీళ్లు కాక 1875 మంది మహిళా ఆఫీసర్లు ఐ.ఎ.ఎఫ్.లో అత్యన్నతస్థాయి విధుల్ని నిర్వహిస్తున్నారు. త్రివిధ దళాలను.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్.. కలిపి చూస్తే మహిళా ఆఫీసర్ల సంఖ్య గత ఏడాది సెప్టెంబరు నాటికి 9,118. రక్షణ దళాలలోకి మరింత మంది మహిళల్ని తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ఈ మధ్యే పార్లమెంటులో వెల్లడించింది. ‘‘ఇది మహిళల అవసరం కాదు. మన రక్షణ వ్యవస్థ అవసరం. మూడు రక్షణ దళాలూ మహిళల శక్తి సామర్థ్యాలతో బలోపేతం కావలసి ఉంది’’ అని ఇటీవలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. రిటైర్డ్ వింVŠ కమాండర్ అనుపమా జోషి అన్నారు. 1990ల ఆరంభంలో ఐ.ఎ.ఎఫ్.లోకి వచ్చిన తొలి మహిళా ఆఫీసర్ల బ్యాచ్‌కి చెందినవారు అనుపమ. ఆర్మీలోని వైమానిక విభాగం (ఏవియేషన్ వింగ్)లోకి కూడా త్వరలోనే మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్లు రాబోతున్నారు! ఆర్మీ ఏవియేషన్ వింగ్ లో ప్రస్తుతం ఉన్న మహిళా అధికారులు గ్రౌండ్‌కు మాత్రమే పరిమితమై ఉన్నారు. ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్లను కూడా ఆపరేట్ చేస్తుంటుంది. వాటిని నడిపేందుకు ఈ జూలైలో తొలి బ్యాచ్ మహిళా అధికారులకు పైలట్లుగా శిక్షణ ప్రారంభిస్తున్నారు. 2022 జూలై నాటికి వారి శిక్షణ పూర్తవుతుంది. నేవీ మరికాస్త ముందుంది. గత సెప్టెంబరులో శిక్షణ పూర్తి చేసుకున్న ఇద్దరు మహిళల్ని తొలిసారి యుద్ధ నౌకల్లోని హెలికాప్టర్లకు ఫైటర్ పైలట్‌గా తీసుకుని చరిత్ర సృష్టించింది. లక్ష్యాన్ని గురి చూసి ఛేదించగల శక్తి పురుషుల కన్నా మహిళలకే ఎక్కువని అనేక శాస్త్రీయ పరిశోధనల్లో రుజువైన సంగతే. పురుషులూ ఛేదిస్తారు కానీ.. లక్ష్యానికి ఆనుకుని ఉన్న జనావాసాలు కూడా ధ్వంసం అవుతాయి. పౌరులూ మరణించే ప్రమాదం ఉంటుంది. ఈ నష్టాన్నే ‘కొల్లాటరల్ డ్యామేజ్’ అంటారు. భవిష్యత్తులో యుద్ధం వస్తే కనుక కొల్లాటరల్ డ్యామేజ్‌ని నివారించేందుకు లేదా తగ్గించేందుకు మొదట మహిళా ఫైటర్ పైలట్లనే గగనతలంలోకి భారత వాయు సేన పంపే అవకాశాలైతే లేకపోలేదు. వాయుసేనకు మహిళాశక్తి భారత సరిహద్దుల్లో చైనా, పాక్‌ల అతిక్రమణలు ఎప్పటికైనా యుద్ధానికి దారి తీసేవే. గత ఏడాది జూలైలో చైనా మన సరిహద్దుల్లోకి చొచ్చుకుని వచ్చిన సమయంలోనే ఫ్రాన్స్‌కు మనం ఆర్డరు పెట్టిన 36 రఫేల్ యుద్ధ విమానాలలో తొలి విడతగా ఐదు విమానాలు భారత్‌తో దిగాయి. వైమానిక దాడుల అవసరమే కనుక కలిగితే చైనా పాక్‌ల కంటే కూడా శక్తిమంతమైన యుద్ధ విమానాలు మన దగ్గర ఉన్నాయన్న సంగతి ప్రపంచానికి తెలియని వాస్తవమేమీ కాదు. భారత వాయు సేనలో ఇప్పటికే ఉన్న ‘తేజస్’లు దేశవాళీ ఫైటర్ జెట్లు కాగా, సుఖోయ్‌లు రష్యాలో తయారై వచ్చినవి. మిరాజ్ 2000 లు ఫ్రాన్స్ తయారీ. మిగ్–21లు (బైసన్ అని కూడా అంటారు) మిగ్–29లు కూడా రష్యా నుంచి తెప్పించుకున్నవే. సెపెక్యాట్ జాగ్వార్లది బ్రిటన్, ఫ్రాన్స్‌ల ఉమ్మడి టెక్నాలజీ. వీటన్నిటిలోనూ మన మహిళా ఫైటర్ పైలట్లు శిక్షణ పొందినవారే. ఇప్పుడు మిగ్–29 శిక్షణకు తొలిసారి ఒక మహిళా ఫైటర్ పైలట్‌ను భారత వాయు సేన పంపబోతోంది. -
గల్లంతైన మిగ్ పైలెట్ లెటర్ వైరల్
న్యూఢిల్లీ: భారత నేవీ ఎయిర్ క్రాఫ్ట్ మిగ్-29కే శిక్షణ విమానం గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒక పైలెట్ సురక్షితంగా బయటపడగా.. నిషాంత్ సింగ్ అనే మరో పైలెట్ గల్లంతయ్యాడు. ప్రస్తుతం అతడిని క్షేమంగా తిరిగి తీసుకొచ్చేందుకు నేవీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. నిషాంత్ సింగ్‌కు సంబంధించిన ఓ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అతడి సృజానత్మకతకి నెటిజనులు ఫిదా అవుతున్నారు. త్వరగా.. క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు. ఏడు నెలల క్రితం నిషాంత్ సింగ్ వివాహం చేసుకున్నాడు. ఇందుకు గాను సీనియర్ అధికారుల అనుమతి కోరుతూ రాసిన ఉత్తరం ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ ఉత్తరంలో నిషాంత్ పెళ్లి చేసుకోవడం అంటే జీవితాన్ని త్యాగం చేయడం వంటిదే అన్నాడు. తెలిసి తెలిసి ఇందులోకి దూకుతున్నానని.. ఇక జీవితంలో మరోసారి ఇలాంటి తప్పు చేయనని.. కనుక ఈ ఒక్కసారి బుల్లెట్‌ని కొరకడానికి అనుమతివ్వాల్సిందిగా సీనియర్లను కోరాడు. అంతేకాక తన త్యాగానికి అధికారులంతా సాక్ష్యంగా ఉండాలని.. కావున వారంతా ఈ కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని నిషాంత్ అభ్యర్థించాడు. ఈ ఏడాది మే 9న ఉన్నతాధికారులకు నిషాంత్ రాసిన లెటర్ ఇలా కొనసాగింది.. ‘ఇంత తక్కువ సమయంలో మీ మీద ఇలాంటి బాంబు వేశాను. కానీ మీరు అంగీకరించాలి. స్వయంగా నా మీద నేనే ఓ న్యూక్లియర్ బాంబ్ వేసుకుంటున్నానని గమనించాలి. కంబాట్‌లో ఓ పక్క వేడిని భరిస్తూనే సెకన్ల వ్యవధిలో నిర్ణయాలు తీసుకోవడం అలవాటయ్యంది. అందుకే ఈ నిర్ణయం తీసుకోవడానికి.. మరోసారి దీని గురించి ఆలోచించడానికి నేను ఎక్కువ సమయం తీసుకోలేదు. మూడేళ్ల కాల వ్యవధి గల ఎస్‌సీటీటీ(సర్వైవబిలిటీ అండ్ కంపాటిబిలిటీ టెస్టింగ్ ట్రయల్స్)ట్రైనింగ్‌ని విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత నేను, మిస్ నయాబ్ రంధవా ఓ నిర్ణయానికి వచ్చాం. ఇక మిగిలిన జీవితం అంతా ఒకరినొకరం చంపుకోకుండా కలిసి బతకాలని నిర్ణయించుకున్నాం. మా నిర్ణయాన్ని ఇరు కుటుంబాల పెద్దలు ఆమోదించారు. కరోనా సమయం కావడంతో జూమ్ వీడియో కాల్ ద్వారా ఆశీర్వదించారు. నా జీవితంలోని ప్రశాంతతని కోల్పోవడమే కాక, డ్యూటీకి సంబంధం లేని మరి ముఖ్యంగా చెప్పాలంటే .. నా జీవితాన్ని త్యాగం చేయాలని భావిస్తూ స్వయంగా నా చేతులారా నేను తీసుకున్న ఈ నిర్ణయానికి మీ అనుమతి కావాలి’ అంటూ నిశాంత్ తన లెటర్లో అధికారులను కోరాడు. (చదవండి: పైలట్ కోసం సిక్కుల ఔదార్యం) కొనసాగిస్తూ.. ‘ఇక ఈ అయోమయ పరిస్థితి నుంచి బయటపడటానికి నా పఠనాసక్తి కూడా సాయం చేయలేకపోయింది. కావాలనే చేస్తోన్న ఈ తప్పును మీరు మనసులో పెట్టుకోకుండా నన్ను క్షమిస్తారని భావిస్తున్నాను. ఇక ఇలాంటి తప్పును నేను గాలిలో ఉండగా కూడా చేయను. అలానే నా ట్రైనీలకు ఇలాంటి తప్పులు చేయడం నేర్పను’ అంటూ ఉత్తరాన్ని ముగించాడు. ఇక చివర్లో మీ విధేయుడు అని రాసే చోట.. ‘సాధారణంగా మీ విధేయుడు అనే రాయాలి.. కానీ ఇక మీదట నేను తనకు విధేయుడిని’ అంటూ తన పేరు రాసి ముగించాడు. ఇంత సృజనాత్మంగా లెటర్ రాస్తే.. ఎవరు మాత్రం నో చెప్పగలరు. అందుకే అధికారులు కూడా అతని వివాహానికి అనమతించారు. నేవీ సాంప్రదాయం ప్రకారం, యువ అధికారులు వివాహం చేసుకోవడానికి వారి సీఐల అనుమతి తీసుకోవాలి. ఇక సుశాంత్ తెలివిగా లెటర్ హెడ్డింగ్‌ని "బుల్లెట్‌ని కొరకడానికి అనుమతించండి" అని పెట్టడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. -
దేనికైనా సిద్ధం!
-
ఎల్ఏసీలో సంసిద్ధంగా వైమానిక దళం
న్యూఢిల్లీ: తూర్పులద్దాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంట చైనా సైనిక సంపత్తిని తరలించడంతో భారత్ దీటుగా చర్యలు తీసుకుంటోంది. అమెరికా, రష్యా తయారీ యుద్ధ, రవాణా విమానాలను ఈ ప్రాంతంలో వాడుతోంది. కీలకప్రాంతాల్లో నిఘా విధులతోపాటు ఫార్వర్డ్ పోస్టులకు జవాన్లను, ఇతర ముఖ్యమైన పరికరాలు, సామగ్రిని ఇవి తరలిస్తున్నాయి. రష్యా తయారీ అత్యాధునిక సుఖోయ్–30 ఎంకేఐలు, ఎంఐజీ–29 యుద్ధ విమానాలు ఇప్పటికే గగనతలంలో పహారాకాస్తున్నాయి. సరిహద్దులకు సమీపంలోని ఈ వైమానిక కేంద్రంలో అమెరికా తయారీ రవాణా వాహనాలు సీ–17, సీ–130జేతోపాటు రష్యా తయారీ ఇల్యుషిన్–76, ఆంటొనొవ్–32లు కూడా ఇక్కడ మోహరించారు. తూర్పు లద్దాఖ్ సెక్టార్లో యుద్ధ విధుల కోసమే ప్రత్యేకించిన అపాచీ యుద్ధ విమానాలను వినియోగించుకుంటున్నారు. ఆర్మీ, ఐటీబీపీ బలగాలను సరిహద్దుల సమీపంలోకి తరలించేందుకు చినూక్, ఎంఐ–17వీఐ హెలికాప్టర్లను రంగంలోకి దించారు. మొత్తమ్మీద ఈ ఎయిర్ బేస్ విమానాల రాకపోకలతో సందడిగా మారింది. ‘ఈ ప్రాంతంలో ఈ ఎయిర్ బేస్ చాలా కీలకమైంది. యుద్ధ విధులతోపాటు, ఇతర అవసరాలకు కూడా ఇక్కడి నుంచే సరఫరాలు అందుతుంటాయి. ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంది’ ఓ అధికారి అన్నారు. -
అమ్ములపొదిలో మరిన్ని అస్త్రాలు
న్యూఢిల్లీ: భారత్–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ దళాల సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా రూ.38,900 కోట్లతో 33 యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థలు, ఇతర ఆయుధాల కొనుగోలుకు రక్షణ శాఖ గురువారం అనుమతి ఇచ్చింది. రష్యా నుంచి 21 మిగ్–29 ఫైటర్ జెట్లు కొనుగోలు చేయనున్నారు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) నుంచి 12 సుఖోయ్–30 ఎంకేఐ ఎయిర్‌క్రాఫ్ట్‌లు సమకూర్చుకోనున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న 59 మిగ్–29 ఎయిర్‌క్రాఫ్ట్‌లను అప్‌గ్రేడ్ చేసేందుకు రక్షణ శాఖ అంగీకరించింది. 248 అస్త్రా ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్స్ సైతం కొనుగోలు చేయనున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. 21 మిగ్–29 ఫైటర్ జెట్ల కొనుగోలుకు, 59 మిగ్–29 ఎయిర్‌క్రాఫ్ట్‌ల అప్‌గ్రెడేషన్‌కు రూ.7,418 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. హెచ్ఏఎల్ నుంచి 12 సూ–30 ఎంకేఐ ఎయిర్‌క్రాఫ్ట్‌లు సమకూర్చుకోవడానికి రూ.10,730 కోట్లు అవసరమని అధికారులు తెలిపారు. అంతేకాకుండా నావికా దళం, వైమానిక దళానికి అవసరమైన లాంగ్రేంజ్ క్రూయిజ్ మిస్సైల్ సిస్టమ్స్, అస్త్రా క్షిపణుల కొనుగోలుకు రూ.20,400 కోట్లకు పైగానే ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. మిగ్–29 ప్రత్యేకతలు గాల్లో నుంచి శత్రువులపై నిప్పుల వర్షం కురిపించే మిగ్–29 జెట్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను 1970వ దశకంలో అప్పటి సోవియట్ యూనియన్‌లో మికోయాన్ డిజైన్ బ్యూరో అనే కంపెనీ తయారు చేసింది. ఇందులో రెండు ఇంజిన్లు ఉంటాయి. ఇవి 1982లో తొలిసారిగా సోవియట్ ఎయిర్‌ఫోర్సులో చేరాయి. అమెరికాకు చెందిన ఈగల్, ఫాల్కన్ ఫైటర్ జెట్లకు పోటీగా వీటిని తీసుకొచ్చారు. ప్రపంచంలో 30కిపైగా దేశాలు మిగ్–29 జెట్లను కలిగి ఉన్నాయి. ఇవి వివిధ విధులు నిర్వర్తించే మల్టీరోల్ ఫైటర్లుగా పేరుగాంచాయి. ప్రధానంగా నింగి నుంచి నేలపై ఉన్న శత్రువులను దెబ్బతీయడానికి ఈ జెట్లను ఉపయోగిస్తారు. సుఖోయ్.. లాంగ్ రేంజ్ రష్యాకు చెందిన సుఖోయ్ కార్పొరేషన్ సూ–30 ఎంకేఐ ఎయిర్‌క్రాఫ్ట్‌లను అభివృద్ధి చేసింది. ఇవి మల్టీరోల్ ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్లుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. 2002లో భారత వైమానిక దళం ఇలాంటి కొన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌లను రష్యా నుంచి కొనుగోలు చేసింది. భారత వైమానిక దళం వద్ద 2020 జనవరి నాటికి దాదాపు 260 సూ–30 ఎంకేఐ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి. లాంగ్ రేంజ్.. అంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం ఇవి సులువుగా ఛేదించగలవు. యాప్‌లపై నిషేధం.. డిజిటల్ స్ట్రైక్ చైనాకు చెందిన 59 యాప్‌లను భారత్‌లో నిషేధించడాన్ని కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ‘డిజిటల్ స్ట్రైక్’గా అభివర్ణించారు. దేశ ప్రజల డేటాను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. భారత్ శాంతినే కోరుకుంటుందని, అయితే, ఎవరైనా దుర్బుద్ధితో భారత భూభాగంపై కన్నువేస్తే తగిన గుణపాఠం చెబుతుందని వ్యాఖ్యానించారు. గల్వాన్ లోయ ఘర్షణల్లో భారత సైనికులు 20 మంది చనిపోతే.. అంతకు రెట్టింపు సంఖ్యలో చైనా సైనికులను అంతమొందించామని చెప్పారు. పశ్చిమబెంగాల్ బీజేపీ కార్యకర్తలనుద్దేశించి గురువారం వర్చువల్ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ప్రధానమంత్రి మోదీ దేశ రక్షణ విషయంలో రాజీ పడబోరన్నారు. -
పైలట్ కోసం సిక్కుల ఔదార్యం
చంఢీఘడ్ : మత విశ్వాసాన్ని పక్కన పెట్టి మానవత్వాన్ని చాటారు పంజాబ్‌లోని హోషియాపుర్ గ్రామవాసులు. సిక్కులు సంప్రదాయంగా ధరించే తలపాగా(టర్బన్) తీసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన ఎంఐజీ–29 యుద్ధ విమానం శుక్రవారం పంజాబ్‌లో కూలిపోయింది.(పంజాబ్‌లో కూలిన యుద్ధ విమానం)విమానం కూలిపోక ముందే పైలట్ పారాచూట్ ద్వారా బయటకు దూకేశారు. అయితే అప్పటికే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతోపాటూ, గాయాలతో పైలట్ తీవ్ర ఒత్తిడికి గురి అయ్యారు. దీంతో అక్కడే ఉన్న కొందరు సిక్కులు తమ తలపాగాలు తీసి ఎండకు రక్షణగా గొడుగులా పైలట్‌కు పట్టారు. మిగతా సిక్కులు వాటిని ఊపుతూ గాలి వచ్చేలా చేశారు. అనంతరం వైమానిక దళానికి చెందిన హెలీకాప్టర్ అక్కడికి చేరుకోవడంతో, దాంట్లో పైలట్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పైలట్ క్షేమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. కష్టాల్లో ఉన్న యుద్ధ విమాన పైలట్ కోసం సిక్కులు చూపించిన తెగువను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. -
పంజాబ్‌లో కూలిన యుద్ధ విమానం
చంఢీఘడ్ : భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన ఎంఐజీ–29 యుద్ధ విమానం శుక్రవారం పంజాబ్‌లో కూలిపోయింది. షహీద్ భగత్ సింగ్ నగర్‌లోని చువార్పూర్ గ్రామంలోని పొలాల్లో ఎంఐజీ–29 యుద్ధ విమానం కూలిపోయిందని ఎస్బీఎస్ నగర్ ఎస్పీ వజీర్ సింగ్ ఖైరా తెలిపారు. విమానం కూలిపోయినట్టు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తమకు సమాచారం అందిందని ఎస్బీఎస్ నగర్ సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అల్కా మీనా చెప్పారు. విమానం కూలిపోక ముందే పైలట్ పారాచూట్ ద్వారా బయటకు దూకినట్టు గ్రామస్తుల ద్వారా సమాచారం అందిందన్నారు. పెను ప్రమాదం నుంచి పైలట్ తప్పించుకున్నారని, అతడి జాడను గుర్తించి హెలీకాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్టు ఓ సీనియర్ అధికారి చెప్పారు. -
టేకాఫ్ అయిన కొద్ది సేపటికే..
పణాజి : భారత నావికాదళానికి చెందిన మిగ్-29 యుద్ధవిమానం గోవాలో ఆదివారం ఉదయం కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. రొటీన్ ట్రైనింగ్‌లో భాగంగా టేకాఫ్ అయిన విమానం అరేబియా సముద్రంలో కుప్పకూలింది. ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంపై భారత ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గోవాలోని వాస్కో వద్దగల ఐఎన్ఎస్ హంస బేస్ నుంచి ఈ విమానం ఎగిరింది. రెండు ఇంజన్లు, సింగిల్ సీటర్ గల ఈ విమానం.. సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదానికి గురైనట్టు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. కాగా, 2019 నవంబర్, 2018 జనవరి నెలల్లో కూడా రెండు మిగ్-29 విమానాలు కుప్పకూలాయి. ఆ ప్రమాదాల్లోంచి పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. -
గోవాలో కూలిన మిగ్ 29k
-
పదునెక్కిన మిగ్–29
అదంపూర్ (జలంధర్): భారత వాయుసేన (ఐఏఎఫ్) అమ్ములపొదిలో ఉన్న పాత ఎంఐజీ–29 యుద్ధ విమానం ఆధునిక యుద్ధా లకు తగ్గట్టుగా పదునెక్కింది. ఈ ప్రతిష్టాత్మక యుద్ధ విమనాలకు నూతన సాంకేతికత జోడించి పలు ప్రత్యేకతలతో అభివృద్ధి చేసినట్లు ఎయిర్‌ఫోర్స్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ కొత్త ఎంఐజీ–29 యుద్ధ విమానాల శక్తి సామర్థ్యాలను గతవారమే అదం పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో విజయ వంతంగా పరీక్షించినట్లు అదంపూర్ ఫ్లైట్ లెఫ్టినెంట్ కరన్ కోహ్లి పేర్కొన్నారు. సోమ వారం వైమానిక దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఐఏఎఫ్‌కు ఇది తీపీ కబురే. కొత్త ఎంఐజీ–29 ప్రత్యేకతలివీ... ► గాల్లోనే ఇంధనం నింపుకోవచ్చు. ► అత్యంత వేగంతో నిట్టనిలువుగా టేకాఫ్ తీసుకుని 5 నిమిషాల్లోనే క్షిపణులతో విరుచుకుపడి శత్రు విమానాన్ని ధ్వంసం చేయగలదు. ► పాత దానితో పోల్చితే ఎక్కువ దూరంలో ఉన్న శత్రువును కూడా గుర్తించి సమర్థవంతంగా నాశనం చేయగలదు. ► దీనిలో ఉన్న మల్టీ ఫంక్షనల్ డిస్ప్లేలో ఏ వైపు నుంచి శత్రు విమానం వస్తుందో పైలట్ స్పష్టంగా కనబడుతుంది. దీంతో కావాల్సిన దిశలో పైలట్ క్షిపణులను ప్రయోగించగలడు. ► ఏ వైపు నుంచైనా క్షిపణులను ప్రయోగించగల సౌకర్యం దీనిలో ఉంది ఎప్పుడొచ్చింది ఈ మిగ్–29.. ఈ ఎంఐజీ–29 యుద్ధవిమానాల్ని రష్యా తయారు చేస్తుంది. యుద్ధాలను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవాలనే వ్యూహంతో 1980ల్లోనే యుద్ధప్రాతి పదికన పాత ఎంఐజీ–29 యుద్ధ విమానా లను భారత్ కొనుగోలు చేసిందని, ఇవి అత్యవసర సమయాల్లో దేశాన్ని రక్షించ డంలో ముఖ్య భూమిక పోషించాయని ఓ అధికారి చెప్పారు. ఈ విమానాలే 1999 కార్గిల్ యుద్ధంలో కీలక పాత్ర పోషించా యన్నారు. ప్రభుత్వం 42 ఐఏఎఫ్ దళాలకు యుద్ధవిమానాలు మంజూరు చేసినా 31 దళాలకే విమానాలున్నాయి.