మిగ్-29
పణాజి : భారత నావికాదళానికి చెందిన మిగ్-29 యుద్ధవిమానం గోవాలో ఆదివారం ఉదయం కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. రొటీన్ ట్రైనింగ్‌లో భాగంగా టేకాఫ్ అయిన విమానం అరేబియా సముద్రంలో కుప్పకూలింది. ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంపై భారత ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గోవాలోని వాస్కో వద్దగల ఐఎన్‌ఎస్ హంస బేస్ నుంచి ఈ విమానం ఎగిరింది. రెండు ఇంజన్లు, సింగిల్ సీటర్ గల ఈ విమానం.. సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదానికి గురైనట్టు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. కాగా, 2019 నవంబర్, 2018 జనవరి నెలల్లో కూడా రెండు మిగ్-29 విమానాలు కుప్పకూలాయి. ఆ ప్రమాదాల్లోంచి పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment