
భిండ్/న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన అపాచీ ఎటాక్ హెలికాప్టర్ సోమవారం మధ్యప్రదేశ్‌లోని భిండ్ సమీపంలో అర్ధంతరంగా ల్యాండయింది. రోజువారీ శిక్షణ సమయంలో హెలికాప్టర్‌లో కొన్ని అవాంతరాలు తలెత్తడంతో పైలట్ ముందు జాగ్రత్తగా ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
నిపుణుల బృందం హెలికాప్టర్‌ను పరిశీలిస్తోందని ఐఏఎఫ్ ట్వీట్ చేసింది. ఉదయం 8.45 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనతో ఎవరికీ ఏవిధమైన హాని కలగలేదని, అందులోని సిబ్బంది క్షేమంగా ఉన్నారని పేర్కొంది. కాగా, హెలికాప్టర్ ల్యాండయిన ప్రాంతంలో జనం గుమికూడిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.