భువనేశ్వర్: దేశంలో ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో అక్కడక్కడా వర్షం కురుస్తూ బీభత్సం సృష్టిస్తోంది. సోమవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో గాలివాన తీవ్రతరమైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఒడిశా ముఖ్యమంత్రి 'నవీన్ పట్నాయక్' హెలికాప్టర్ భువనేశ్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ కాలేదు.
ఎన్నికల ప్రచారం ముగించుకుని ఖరియార్ నుంచి తిరిగి వస్తుండగా.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, సీనియర్ బీజేడీ నాయకుడు కార్తిక్ పాండియన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ చేయడానికి సాధ్యపడలేదు. దీంతో హెలికాప్టర్ 30 నిమిషాల పాటు భువనేశ్వర్ విమానాశ్రయంపై తిరుగుతూ ఝర్సుగూడకు బయలుదేరింది.
జరిగిన సంఘటన పార్టీ నేతలను ఒక్కసారిగా భయానికి గురిచేసింది. ఝర్సుగూడలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. నవీన్ పట్నాయక్, బీజేడీ సీనియర్ నేత కార్తిక్ పాండియన్ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
#WATCH | Odisha: While returning from Khariar, the helicopter carrying CM Naveen Patnaik and 5T Chairman and BJD leader VK Pandian couldn't land at Bhubaneswar airport due to wind and rain. After hovering over the airport for nearly 30 minutes, the helicopter headed to… pic.twitter.com/B0lyEMQYN4
— ANI (@ANI) May 6, 2024
Comments
Please login to add a commentAdd a comment