భువనేశ్వర్: బీజేడీ నేత వీకే పాండియన్ వ్యవహారం ఒడిశా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒడిశా సీఎంను పాండియన్ నియంత్రిస్తున్నారని బీజేపీ విమర్శలు గుప్పిస్తుంది. మరోవైపు సీఎం నవీన్ పట్నాయక్‌కు పాండియన్ రాజకీయ వారసుడంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేడీ చీఫ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ గురువారం స్పందించారు.
ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా నవీన్ పట్నాయక్.. ‘‘ నా వారసుడి విషయంలో ఇదివరకే చాలా క్లారిటీగా చెప్పాను. నా వారసుడిని ఒడిశా రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. ఇలాంటివి చాలా సహజంగా ప్రజల ద్వారానే జరిగిపోయే విషయాలు. ప్రజస్వామ్యంలో పార్టీల్లో నేతలు వివిధ పదువుల్లో ఉంటారు. మంత్రులుగా ప్రజల ప్రతినిధులు ఉంటారు. అదేవిధంగా అధికారాలను కలిగి ఉంటారు. పాండియన్ ప్రభుత్వ పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు.
#WATCH | On being asked about "putting VK Pandian above other BJD leaders", Odisha CM Naveen Patnaik says "I find all of this quite nonsensical..."
On VK Pandian, he further says "Party members have a great say, they have high positions, they are ministers, they are the people's… pic.twitter.com/XigUlX4wS1— ANI (@ANI) May 30, 2024
ఇక.. వీకే పాండియన్ నన్ను కంట్రోల్ చేస్తున్నారన్న ఆరోపణలు చాలా హాసాస్పదం.. వాటికి అసలు ఎటువంటి ప్రాధాన్యతా లేదు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. రాష్ట్రంలో తిరిగి బీజేడీ ప్రభుత్వ ఏర్పడుతుంది. లోక్‌సభ ఎన్నికల్లో సైతం 21 స్థానాల్లో గెలుస్తాం. ఒడిశా ప్రజలకు సంక్షేమం అందించడమే నా తొలి ప్రాధాన్యం’’ అని అన్నారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం నవీన్ పట్నాయక్ మాట్లాడుతుండగా వణుకుతున్న ఆయన చేతులను పాండియన్ సరిచేసిన విషయం తెలిసిందే. దీనిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ సీఎం పట్నాయక్‌పై విమర్శలు గుప్పించారు. వీకే పాండియన్ మాత్రమే నవీన్ పట్నాయక్‌తో ఎందుకు ఉంటారో సమాధానం చెప్పాలి. పట్నాయక్‌తో పాటు పాండియన్ మైక్ పట్టుకొని, వణుకుతున్న చేతులను కంట్రోల్ చేస్తున్నారు అని వ్యాఖ్యలు చేశారు.
ఎవరీ వీకే పాండియన్..?
తమిళనాడుకు చెందిన వీకే పాండియన్ 2000 సంవత్సరంలో ఒడిశా ప్రభుత్వంలో బ్యూరోక్రాట్‌గా చేరారు. మొదట్లో ధరమ్‌ఘర్, కలహండి సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. ఒడిశాలోని అతిపెద్ద జిల్లా మయూర్‌భంజ్‌లో కలెక్టర్‌గా మారుమూల గ్రామాలను అభివృద్ధి చేశారు. హెచ్‌ఐవీ సోకిన వ్యక్తులకు పునరావాసం కల్పించిన కృషికి వీకే పాండియన్‌కు జాతీయ అవార్డు అందుకున్నారు. 5T కార్యక్రమాల వల్ల దాదాపు తొంభై శాతానికి పైగా ప్రజల ఫిర్యాదులు పరిష్కరించడంలో పాండియన్ కీలకమైన బ్యూరోక్రాట్‌గా పేరు సంపాధించారు.
2011 సంవత్సరంలో వీకే పాండియన్ ప్రతిభను గమనించి సీఎం నవీన్ అతన్ని సీఎం కార్యాలయానికి తీసుకున్నారు. సీఎంకు ప్రైవేట్ సెక్రటరీగా కూడా పని చేశారు. ఇక.. 2023లో వీకే పాండియన్ తన బ్యూరోక్రాట్ పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. అనంతరం 2023, నవంబర్ 27న సీఎం నవీన్ పట్నయక్ సమక్షంలో బిజు జనతా దళ్‌లో చేరి సీఎంకు సన్నిహితంగా ఉంటూ పార్టీ నేతగా కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment