భువనేశ్వర్: ఎన్నికల వేళ ఒడిషాలో ఎన్నికల కమిషన్(ఈసీ)కొరడా ఝుళిపించింది. ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా ఉన్న సుజాత ఆర్.కార్తికేయన్‌ను ఈసీ బదిలీ చేసింది. ప్రభుత్వ బాధ్యతలను దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ చేసిన ఫిర్యాదుతో గంట్లోపే ఈసీ చర్య తీసుకుంది.
ఎన్నికల వ్యవహారాలకు సంబంధం లేని విభాగానికి సుజాతను బదిలీ చేసింది. ఒడిశా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ సన్నిహితుడికి వీకే పాండియన్ సతీమణి సుజాత. దీంతో సుజాత బదిలీ రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. సుజాత మిషన్ శక్తి విభాగంలో సెక్రటరీగా నిధులు నిర్వర్తించారు.
ఈమె భర్త వీకేపాండియన్ ఐఏఎస్ అధికారిగా గత ఏడాది వీఆర్‌ఎస్ తీసుకున్నారు. పాండియన్ ప్రభుత్వంలో పనిచేసినపుడు సీఎం నవీన్ పట్నాయక్‌కు నమ్మకమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. తెరవెనుక పాలనను మొత్తం నడిపేవారని పాండియన్‌కు పేరుంది. పదవీవిరమణ తర్వాత బీజేడీలో చేరారు. ప్రతిపక్షాలు పాండియన్‌ను సూపర్‌సీఎంగా పిలుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment