భువనేశ్వర్: ఒడిశాను అన్ని రంగాల్లో అగ్రగామికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి 'నవీన్ పట్నాయక్' పక్కా ప్రణాళికతో ఉన్నారని, రాష్ట్రం నుంచి వలసలు పూర్తిగా ఆగిపోవాల్సిన అవసరం ఉందని ఆయన సన్నిహితుడు వీకే పాండియన్ అన్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో బిజూ జనతాదళ్ రాష్ట్రాన్ని క్లీన్ స్వీప్ చేస్తుందని అన్నారు.
ప్రజలు నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని గతంలో ముఖ్యమంత్రి ప్రైవేట్ కార్యదర్శిగా పనిచేసిన పాండియన్ అన్నారు. పట్నాయక్ కేవలం అధికారం కోసం మాత్రమే కాకుండా.. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాలు చేస్తారు. దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటారని ఆయన అన్నారు.
ఐదు పర్యాయాలు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించి నవీన్ పట్నాయక్.. ఆరో సారి ఏమైనా విశ్రాంతి తీసుకుంటారా? వారిలో ఏమైనా అలసట కనిపించిందా? అనే ప్రశ్నకు పాండియన్ సమాధానమిస్తూ.. మంచిపని చేస్తే అలసట ఎలా వస్తుంది, ప్రతి ఎన్నికల్లోనూ అయన గొప్ప విజయం సాధిస్తారని అన్నారు.
ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్‌సభ స్థానాలకు, 147 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీకి కలిసి ఎన్నికలు జరగనున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీ 12 సీట్లు గెలుచుకోగా, బీజేపీకి ఎనిమిది, కాంగ్రెస్‌కు ఒక్క సీటు మాత్రమే లభించింది. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ సంఖ్య 117 నుంచి 112కి పడిపోయింది. ఆ సమయంలో బీజేపీ 19 నుంచి 23 స్థానాలకు ఎగబాకింది. కాంగ్రెస్‌కు తొమ్మిది స్థానాలు మాత్రమే రాగా, ఇతరులు రెండు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించారు.
పంచాయితీ, మునిసిపాలిటీ, అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల ఏవీ నవీన్ పట్నాయక్ విజయాన్ని అడ్డుకోలేవు. ఆయనకు ప్రజల్లో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ కారణంగానే ఆయన ఎన్నికల గురించి పెద్దగా పట్టించుకోరని పాండియన్ అన్నారు. ఇప్పటికే క్రీడలు, విపత్తు నిర్వహణ, పేదరిక నిర్మూలన లేదా ఆహారోత్పత్తి వంటి రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నాము. అయితే ఒడిశా అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో ఉండాలని నవీన్ పట్నాయక్ కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment