Bhind district
-
అర్ధంతరంగా అపాచీ ల్యాండింగ్
భిండ్/న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన అపాచీ ఎటాక్ హెలికాప్టర్ సోమవారం మధ్యప్రదేశ్‌లోని భిండ్ సమీపంలో అర్ధంతరంగా ల్యాండయింది. రోజువారీ శిక్షణ సమయంలో హెలికాప్టర్లో కొన్ని అవాంతరాలు తలెత్తడంతో పైలట్ ముందు జాగ్రత్తగా ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. నిపుణుల బృందం హెలికాప్టర్‌ను పరిశీలిస్తోందని ఐఏఎఫ్ ట్వీట్ చేసింది. ఉదయం 8.45 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనతో ఎవరికీ ఏవిధమైన హాని కలగలేదని, అందులోని సిబ్బంది క్షేమంగా ఉన్నారని పేర్కొంది. కాగా, హెలికాప్టర్ ల్యాండయిన ప్రాంతంలో జనం గుమికూడిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. -
షాకింగ్..12 ఏళ్లకే గుండెపోటు..స్కూల్ బస్సులోనే కుప్పకూలిన విద్యార్థి..
భోపాల్: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు అందరికీ వస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ భిండ్‌లో 12 ఏళ్ల బాలుడు గుండెపోటుతో(కార్డియాక్ అరెస్ట్) ప్రాణాలు కోల్పోయాడు. ఇంత చిన్న వయసులో ఈ కారణంగా చనిపోయిన ఘటన రాష్ట్రంలో ఇదే తొలిసారి అని వైద్యులు వెల్లడించారు. ఓ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న ఈ బాలుడి పేరు మనీష్ జాతవ్. గురువారం మధ్యాహ్నం సోదరుడితో కలిసి పాఠశాలలోనే భోజనం చేశాడు. అనంతరం 2:00 గంటలకు స్కూల్ బస్ ఎక్కాడు. క్షణాల్లోనే ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోయాడు. విద్యార్థిని గమనించిన బస్ డ్రైవర్ స్కూల్ యాజమాన్యాన్ని వెంటనే అప్రమత్తం చేశాడు.స్పృహకోల్పోయిన అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాణాలు కాపాడేందుకు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. బాలుడు అప్పటికే చనిపోయాడని వాళ్లు ప్రకటించారు. ఇంత చిన్న వయసులో గుండెపోటు రావడం చాలా అరుదు అని వైద్యులు తెలిపారు. కానీ కోవిడ్ తర్వాత ఇలాంటి ఘటనలు పెరిగాయని చెప్పారు. తమ బిడ్డకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు నిరాకరించారు. చదవండి: షాకింగ్.. నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు.. ఫొటో వైరల్.. -
రాజీకి పిలిచి ఘోర అవమానం.. గుండు గీయించి చెప్పులదండతో..
భోపాల్: మధ్యప్రదేశ్ భిండ్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. శక్యా కమ్యూనిటికీ(ఎస్సీ) చెందిన ఇద్దరు యువకులకు గుండు గీయించారు గ్రామ పంచయితీ పెద్దలు. అనంతరం వారి మెడలో చెప్పుల దండలు వేసి ఊరేగించారు. దబోహా గ్రామంలో సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఏం జరిగిందంటే..? రామ్‌వీర్ శక్య, సంతోష్ శక్య, ధర్మేంద్ర శక్య అనే ముగ్గురు దబోహ గ్రామంలో నివసిస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం వీరు గ్రామంలో దిలీప్ శర్మతో గొడవపడ్డారు. ఘర్షణలో అతని తలకు తీవ్ర గాయాలయ్యయి. ఈ ఘటన అనంతరం ముగ్గురూ గ్రామం నుంచి పరారయ్యారు. నెలన్నర తర్వాత శక్యా కమ్యూనిటీకి చెందిన హరిరామ్ ఈ ముగ్గురి తరఫున దిలీప్‌తో రాజీ కుదిర్చేందుకు వెళ్లాడు. ఈ వ్యవహారంపై పంచాయితీ పెద్దలు చర్చించారు. ముగ్గురు కలిసి రూ.1.5 లక్షలు దిలీప్ వైద్య ఖర్చుల నిమిత్తం చెల్లించాలని సర్పంచ్ మురళీలాల్ ఆదేశించారు. అంతేకాదు ముగ్గురికీ గుండు గీసి, చెప్పులదండతో ఊరేగించాలని తీర్మానించారు. అనంతరం దీన్ని అమలు చేశారు. విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే రంగంలోకి దిగారు. దిలీప్ శర్మ, అతని తండ్రిని అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇద్దరు బాధిత యువకులను ఆస్పత్రికి తరలించారు. వారి ఇళ్ల వద్ద పోలీసు రక్షణ కల్పించారు. చదవండి: ఆ రెండు గంటలే వాళ్ల టార్గెట్.. తలుపు తీసి ఉందో.. ఇక అంతే..! -
కోచింగ్ సెంటర్ వద్ద వికృత చేష్టలు
-
కోచింగ్ సెంటర్ వద్ద వికృత చేష్టలు
భోపాల్: అమ్మాయిల కోచింగ్ సెంటర్ వద్ద వికృత చేష్టలకు పాల్పడ్డ కామాంధుడికి యువతులంతా తగిన బుద్ధిచెప్పారు. చిత్తుగా బాది పోలీస్ స్టేషన్లో అప్పగించారు. మధ్యప్రదేశ్‌లోని భిండ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న అమ్మాయిల కోచింగ్ సెంటర్ వద్దకు ముసుగు ధరించిన ఓ యువకుడు బైక్ మీద వచ్చాడు. ఫోన్లో మాట్లాడుతున్నట్లు నటిస్తూ అమ్మాయిల ఎదుట ప్యాంట్ విప్పి అసభ్య చేష్టలకు పాల్పడ్డాడు. మరుసటి రోజు అక్కడికొచ్చి అదే పని చేసేందుకు యత్నించాడు. చిర్రెత్తుకొచ్చిన అమ్మాయిలు అతన్ని దొరకబుచ్చున్నారు. స్థానికుల సాయంతో చితకబాది పోలీసులకు అప్పగించారు. అక్కడి సీసీఫుటేజీలో ఆ ఘటనంతా రికార్డయ్యింది. గతంలో బెంగళూరు సంగలి రాయన్న పార్క్ వద్ద ఇలాంటి తరహా ఘటనే ఒకటి చోటు చేసుకోగా.. మహిళలు తన్ని అతన్ని పోలీసులకు అప్పగించారు. -
ఒకే గదిలో స్త్రీ, పురుష అభ్యర్థులకు వైద్య పరీక్షలు
భింద్, మధ్యప్రదేశ్: ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసు శాఖ మధ్యప్రదేశ్ పోలీసు నియామక ప్రక్రియలో వ్యవహరించిన తీరు విమర్శల పాలవుతోంది. సరిపడా సిబ్బంది లేకపోవడంతో అభాసు పాలైంది. పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మెడికల్ పరీక్ష నిర్వహించడం తప్పనిసరి. అయితే భింద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం స్త్రీ, పురుషు అభ్యర్థులకు ఒకే గదిలో వైద్య పరీక్షలు నిర్వహించి పోలీసు శాఖ వార్తల్లో కెక్కింది. పరీక్ష నిమిత్తం కొందరు యువకులు తమ దుస్తులు విప్పదీస్తున్న వీడియో బయట పడడంతో ఈ విషయం వెలుగుచూసింది. ఇంకో విస్మయ పరిచే విషయమేంటంటే.. మహిళా అభ్యర్థుల మెడికల్ పరీక్ష కూడా అదే గదిలో అదే సమయంలో నిర్వహిస్తుండడం. వారి సహాయార్థం అక్కడ ఒక్క మహిళా డాక్టరు గానీ, నర్సు గానీ అందుబాటులో లేకపోవడంతో పోలీసు శాఖ నిర్వాకం బట్టబయలైంది. ‘ఈ ఘటన మా దృష్టికి వచ్చింది. సదరు ఎగ్జామినేషన్ కమిటీ సభ్యులకు నోటీసులు జారీ చేశాం. బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని భింద్ జిల్లా ఆస్పత్రి సివిల్ సర్జన్ అజిత్ మిశ్రా తెలిపారు. పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన మొత్తం 217 మందిలో మంగళవారం 18 మంది యువతులు, 21 మంది యువకులకు వైద్య పరీక్ష నిర్వహించే సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది. -
ఓ మై గాడ్!
రోడ్డును ఆక్రమించారంటూ నోటీసులు భింద్ : మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో రోడ్డును ఆక్రమించారంటూ ఆంజనేయస్వామికి నోటీసులు జారీ చేశారు మున్సిపల్ అధికారులు. బజారియాలో రోడ్డు పక్కనే హనుమంతుడి గుడి ఉంది. రోడ్డు స్థలం కొంచెం ఆలయ ప్రాంగణంలో ఉండడంతో నోటీసులిచ్చారు. అయితే గుడి పూజారికో లేదా ఆలయ ట్రస్టీకో బదులు ఏకంగా దేవుడి పేరుతోనే నోటీసులు జారీ చేశారు. ‘హనుమాన్ దేవుడా? మీరు చట్టవిరుద్ధంగా రోడ్డును ఆక్రమించారు. ప్రమాదాలకు ఆస్కారమిస్తోంది. ఆక్రమించిన స్థలం నుంచి వెనక్కి వెళ్లాలని గ్వాలియర్ హైకోర్టు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు. మీపై కోర్టు ధిక్కరణ కేసు కూడా పెట్టాం’ అని నోటీసులో పేర్కొన్నారు. స్థానికులు మండిపడ్డంతో అధికారులు నాలిక్కరుచుకున్నారు. పొరపాటున దేవుడి పేరుతో ఇచ్చామని, నోటీసులను వెనక్కి తీసుకుంటామన్నారు. -
పెళ్లి బస్సుపై తెగిపడిన హైటెన్షన్ వైర్లు
మధ్యప్రదేశ్ బిండి జిల్లాలో పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సుపై విద్యుతు హై టెన్షన్ వైర్లు పడ్డాయి. ఆ ఘటనలో ఐదుగురు మరణించగా, మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో 60 మంది బస్సులో ఉన్నారని ఐజీ డి.సి. సాగర్ వెల్లడించారు.