Madhya Pradesh Two Men Tonsured And Garlanded With Shoes In Bhind, Details Inside - Sakshi
Sakshi News home page

షాకింగ్ ఘటన: రాజీకి పిలిచి ఘోర అవమానం.. 1.5 లక్షల జరిమానా.. గుండు గీయించి చెప్పులదండతో ఊరేగింపు

Published Wed, Oct 19 2022 5:17 PM | Last Updated on Wed, Oct 19 2022 6:58 PM

Madhya Pradesh Bhind Two Men Tonsured Garlanded With Shoes - Sakshi

భోపాల్: మధ్యప్రదేశ్ భిండ్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. శక్యా కమ్యూనిటికీ(ఎస్సీ) చెందిన ఇ‍ద్దరు యువకులకు గుండు గీయించారు గ్రామ పంచయితీ పెద్దలు. అనంతరం వారి మెడలో చెప్పుల దండలు వేసి ఊరేగించారు. దబోహా గ్రామంలో సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

ఏం జరిగిందంటే..?
రామ్‌వీర్ శక్య, సంతోష్ శక్య, ధర్మేంద్ర శక్య అనే ముగ్గురు దబోహ గ్రామంలో నివసిస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం వీరు గ్రామంలో దిలీప్ శర్మతో గొడవపడ్డారు. ఘర్షణలో అతని తలకు తీవ్ర గాయాలయ్యయి. ఈ ఘటన అనంతరం ముగ్గురూ గ్రామం నుంచి పరారయ్యారు. నెలన్నర తర్వాత శక్యా కమ్యూనిటీకి చెందిన హరిరామ్ ఈ ముగ్గురి తరఫున దిలీప్‌తో రాజీ కుదిర్చేందుకు వెళ్లాడు.

ఈ వ్యవహారంపై పంచాయితీ పెద్దలు చర్చించారు. ముగ్గురు కలిసి రూ.1.5 లక్షలు దిలీప్ వైద్య ఖర్చుల నిమిత్తం చెల్లించాలని సర్పంచ్ మురళీలాల్ ఆదేశించారు. అంతేకాదు ముగ్గురికీ గుండు గీసి, చెప్పులదండతో ఊరేగించాలని తీర్మానించారు. అనంతరం దీన్ని అమలు చేశారు.

విషయం  పోలీసులకు తెలియడంతో వెంటనే రంగంలోకి దిగారు. దిలీప్ శర్మ, అతని తండ్రిని అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇద్దరు బాధిత యువకులను ఆస్పత్రికి తరలించారు. వారి ఇళ్ల వద్ద పోలీసు రక్షణ కల్పించారు.
చదవండి: ఆ రెండు గంటలే వాళ్ల టార్గెట్.. తలుపు తీసి ఉందో.. ఇక అంతే..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement