tonsured
-
రాజీకి పిలిచి ఘోర అవమానం.. గుండు గీయించి చెప్పులదండతో..
భోపాల్: మధ్యప్రదేశ్ భిండ్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. శక్యా కమ్యూనిటికీ(ఎస్సీ) చెందిన ఇద్దరు యువకులకు గుండు గీయించారు గ్రామ పంచయితీ పెద్దలు. అనంతరం వారి మెడలో చెప్పుల దండలు వేసి ఊరేగించారు. దబోహా గ్రామంలో సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఏం జరిగిందంటే..? రామ్‌వీర్ శక్య, సంతోష్ శక్య, ధర్మేంద్ర శక్య అనే ముగ్గురు దబోహ గ్రామంలో నివసిస్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం వీరు గ్రామంలో దిలీప్ శర్మతో గొడవపడ్డారు. ఘర్షణలో అతని తలకు తీవ్ర గాయాలయ్యయి. ఈ ఘటన అనంతరం ముగ్గురూ గ్రామం నుంచి పరారయ్యారు. నెలన్నర తర్వాత శక్యా కమ్యూనిటీకి చెందిన హరిరామ్ ఈ ముగ్గురి తరఫున దిలీప్‌తో రాజీ కుదిర్చేందుకు వెళ్లాడు. ఈ వ్యవహారంపై పంచాయితీ పెద్దలు చర్చించారు. ముగ్గురు కలిసి రూ.1.5 లక్షలు దిలీప్ వైద్య ఖర్చుల నిమిత్తం చెల్లించాలని సర్పంచ్ మురళీలాల్ ఆదేశించారు. అంతేకాదు ముగ్గురికీ గుండు గీసి, చెప్పులదండతో ఊరేగించాలని తీర్మానించారు. అనంతరం దీన్ని అమలు చేశారు. విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే రంగంలోకి దిగారు. దిలీప్ శర్మ, అతని తండ్రిని అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇద్దరు బాధిత యువకులను ఆస్పత్రికి తరలించారు. వారి ఇళ్ల వద్ద పోలీసు రక్షణ కల్పించారు. చదవండి: ఆ రెండు గంటలే వాళ్ల టార్గెట్.. తలుపు తీసి ఉందో.. ఇక అంతే..! -
నూతన్ నాయుడు అరెస్ట్
-
నూతన్ నాయుడు అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం : శిరోముండనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరాన్నజీవి దర్శకుడు నూతన్ కుమార్ నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వెలుగుచూసినప్పటి నుంచి పరారీలో ఉన్న అతన్ని కర్ణాటకలోని ఉడిపిలో శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడని విశాఖ సీపీ మనీష్‌కుమార్ సిన్హా వెల్లడించారు. శిరోముండనం కేసులో నూతన్ నాయుడు పాత్ర ఉందని తేలిన తరువాతనే అతన్ని అరెస్ట్ చేశామన్నారు. దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్ కుమార్ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మధుప్రియ సూచన మేరకే ఈ శిరోముండనం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇదివరకే ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితులకు న్యాయస్థానం రెండు వారాలు రిమాండ్ విధించింది (శిరోముండనం కేసు: దాడి దృశ్యాలు ఎవరికి పంపారు?) తన మధుప్రియను భార్యను కేసు నుంచి తప్పించడానికి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవి రమేష్ పేరిట నూతన్ నాయుడు పలువురు అధికారులకు ఫోన్‌చేసి మోసగించినట్టు పోలీసులు గుర్తించారు. శిరోమండనము ఘటనకు ముందు వెనుక నూతన్ నాయుడు భార్యతో వీడియో కాల్లో మాట్లాడినట్లు తేలింది. కేసు వివరాల ప్రకారం.. నూతన్‌నాయుడు ఇంట్లో పనిచేసి మానివేసిన దళిత యువకుడు వర్రి శ్రీకాంత్‌ను సెల్‌ఫోన్ పోయిందనే నెపంతో ఇంటికి పిలిపించి శిరోముండనం చేయడంతో పాటు దారుణంగా హింసించిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన 24 గంటల వ్యవధిలోనే నూతన్ భార్యతో సహా ఏడుగురిని అరెస్టు చేశారు. శ్రీకాంత్‌పై చేసిన అకృత్యాలను సెల్ఫీలు తీసి పైశాచిక ఆనందం పొందిన నిందితులు అక్కడితో ఆగకుండా వీడియోలు తీశారు. అయితే శిరోముండనం, దాడి దృశ్యాలను ఎవరికైనా పంపించారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. (శిరోముండనం కేసులో నిందితులకు రిమాండ్) -
శిరోముండనం కేసు: దాడి దృశ్యాలు ఎవరికి పంపారు?
సాక్షి, విశాఖపట్నం: పవన్ కల్యాణ్ వీరాభిమాని అలియాస్ బిగ్‌బాస్ ఫేం అలియాస్ సినీ దర్శక నిర్మాత.. వీటన్నింటికీ మించి వివాదాస్పద వ్యక్తిగా ఉన్న నూతన్ నాయుడు ఇంట్లో జరిగిన దురాగతం కేసులో సెల్‌ఫోన్ వీడియో కాల్ కీలకం కానుంది. నూతన్‌నాయుడు ఇంట్లో పనిచేసి మానివేసిన దళిత యువకుడు వర్రి శ్రీకాంత్‌ను సెల్‌ఫోన్ పోయిందనే నెపంతో ఇంటికి పిలిపించి శిరోముండనం చేయడంతో పాటు దారుణంగా హింసించిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన 24 గంటల వ్యవధిలోనే నూతన్ భార్యతో సహా ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు ఇప్పుడు కేసు విచారణను వేగవంతం చేశారు. శ్రీకాంత్‌పై చేసిన అకృత్యాలను సెల్ఫీలు తీసి పైశాచిక ఆనందం పొందిన నిందితులు అక్కడితో ఆగకుండా వీడియోలు తీసి ఎవరికైనా పంపించారా? అన్న అనుమానాలను పోలీసు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. (శిరోముండనం కేసులో నిందితులకు రిమాండ్) ఆ ఘటన సమయంలో ఎవరికైనా వీడియో కాల్ చేశారా.. శిరోముండనం, దాడి దృశ్యాలను ఎవరికైనా పంపించారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో దాడి దృశ్యాలను చిత్రీకరించిన సెల్‌ఫోన్ ఇప్పుడు కీలకం కానుంది. అయితే వీడియో షూట్ చేసిన తర్వాత నిందితురాలు బ్యూటీషియన్ ఇందిరారాణి సెల్ ఫోన్లోని దృశ్యాలను వెంటనే తొలగించేశారు. ఈ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తిరిగి సమాచారాన్ని పొందేందుకు పోలీసులు సదరు సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వస్తే నిందితులు ఆ ఘటన సమయంలో వీడియో కాల్ ఎవరికైనా చేశారా.. దాడి దృశ్యాలను ఎవరికైనా ఫార్వార్డ్ చేశారా... అన్న విషయాల్లో స్పష్టత వస్తుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. (శిరోముండనం : దోషులకు కఠిన శిక్ష తప్పదు) అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది? ప్రస్తుతం నూతన్ నాయుడు చేస్తున్న వ్యాపారాలు ఏమిటి... అసలు ఇంట్లో అంత మంది పని వాళ్లను పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎంతమంది పని వాళ్లనైనా పెట్టుకోవడమనేది... ఎవరి వ్యక్తిగత హోదా, ఆర్థిక స్థాయిని బట్టి ఉంటుంది కానీ.. ఏకంగా బ్యుటీషియన్, సూపర్ వైజర్లు సహా ఐదుగురు పనివాళ్లను పెట్టుకున్న వ్యవహారంపై పోలీసులు కాపీ లాగుతున్నారు.(శిరోముండనం కేసులో నిందితులకు 2 వారాల రిమాండ్) -
అనారోగ్యం నాటకమాడిన మధుప్రియ
సాక్షి, విశాఖపట్నం: శిరోముండనం కేసులో నిందితులకు న్యాయస్థానం రెండు వారాలు రిమాండ్ విధించింది. దీంతో నూతన్ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిని పోలీసులు సెంట్రల్ జైలుకు తరలించారు. నిందితులను విచారించేందుకు కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. మరోవైపు శిరోముండనం వ్యవహారంలో నూతన్ నాయుడు ప్రమేయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక జ్యుడీషియల్ రిమాండ్ నుంచి తప్పించుకునేందుకు మధుప్రియ అనారోగ్యం అంటూ నాటకం ఆడారు. అయితే కేజీహెచ్ వైద్య పరీక్షల్లో ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా తమ ఇంట్లో పని మానేశాడన్న నెపంతో నూతన్ నాయుడు భార్య మధుప్రియ.. కర్రి శ్రీకాంత్ అనే యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన శుక్రవారం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. (చదవండి: దళిత యువకుడికి శిరోముండనం) చదవండి: (కర్రలు విరిగేటట్లు కొట్టి.. వీడియో తీశారు) -
దళితుడిపై దాడి
-
శిరోముండనం కేసులో నిందితులకు 2 వారాల రిమాండ్
-
శిరోముండనం కేసు: ఏడుగురు అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: దళిత యువకుడు శిరోముండనం కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు విశాఖ సిటీ పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. ఘటన జరిగిన నూతన్ నాయుడు ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన వారిలో నూతన్ నాయుడు భార్య మధు ప్రియను ఏ-1గా గుర్తించారు. మధు ప్రియ ఇంట్లో పని చేసే వరహాలు, ఇందిర, ఝాన్సీ, సౌజన్య, బాలు, రవిపై కేసులు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. అరెస్ట్ చేసిన ఏడుగురు నిందితులను జ్యుడిషియల్ కస్టడీకి పంపినట్లు పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా యువకుడు శ్రీకాంత్‌పై దాడి జరిగిన తీరును పోలీసులు గుర్తించారు. ఇందులో నూతన్ నాయుడు భార్య మధు ప్రియ చూస్తుండగా ఇంట్లో సహాయకులు ఇందిర తదితరులు అత్యంత క్రూరంగా శ్రీకాంత్‌కు శిరోముండనం(గుండు గీయించారు)చేశారు. ఐఫోన్ చోరీ నెపంతో దళిత యువకుడిని పిలిచి శిరోముండనం చేశారని సీపీ మనీష్ కుమార్ సిన్హా పేర్కొన్నారు. శ్రీకాంత్‌పై దాడి, గుండు చేస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయని చెప్పారు. శిరోముండనం కేసులో మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఫోన్ విషయంతో పాటు ఇతర కారణాలపై కూడా లోతుగా విచారణ సాగిస్తామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో నూతన్ నాయుడు ప్రమేయం పైన ఆరా తీస్తున్నామని తెలిపారు. బాధితుడిని కర్రలు, రాడ్లతో కొట్టినట్లు వీడియోలో ఉందని సీపీ మనీష్ కుమార్ సిన్హా వెల్లడించారు. చదవండి: సీసీ టీవీ ఫుటేజ్‌లో గుండు చేసిన దృశ్యాలు చదవండి: నూతన్ నాయుడు భార్యపై కేసు నమోదు చదవండి: దళిత యువకుడికి శిరోముండనం -
నూతన్ నాయుడు భార్యపై కేసు నమోదు
-
నూతన్ నాయుడు భార్యపై కేసు నమోదు
సాక్షి, విశాఖ : దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్ కుమార్ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. మధుప్రియ సూచన మేరకే ఈ శిరోముండనం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నూతన్ నాయుడు భార్యతో పాటు మిగతావారిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ విభాగం ఏసీపీ త్రినాథ్ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు ఈ కేసును దర్యాప్తు చేపట్టాయి. (నూతన్ నాయుడు ఇంట్లో నిర్వాకం) కాగా విశాఖ నగర శివారులో బిగ్‌బాస్ కంటెస్టెంట్, జనసేన నాయకుడు నూతన్ నాయుడు ఇంట్లో ఈ సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చెప్పకుండా పని మానేశాడన్న కోపంతో కర్రి శ్రీకాంత్ అనే యువకుడిపై ఈ దారుణానికి పాల్పడ్డారు. నిన్నమధ్యాహ్నం (శుక్రవారం) రెండు గంటల సమయంలో ఇంట్లో మొబైల్ ఫోన్ పోయిందని శ్రీకాంత్‌ను పిలిపించి నూతన్ నాయుడు కుటుంబ సభ్యులతో పాటు పలువురు దాడిచేసి కొట్టడమే కాకుండా జుట్టు తొలగించేశారు. దీంతో అతను తనకు జరిగిన అన్యాయంపై పెందుర్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసులో A1గా ఉన్న నూతన్ నాయుడు భార్య మధుప్రియతో పాటు ఇంట్లో సహాయకులుగా ఉన్న వరహాలు, ఇందిర, ఝూన్సీ, సౌజన్య, బాలు, రవిపై సెక్షన్ 307...342..324..323..506 r/w34ipc 3(1) b ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. -
నూతన్ కుమార్ నాయుడు ఇంట్లో నిర్వాకం
-
నూతన్ నాయుడు ఇంట్లో నిర్వాకం
పెందుర్తి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీరాభిమాని, పరాన్నజీవి దర్శకుడు నూతన్ కుమార్ నాయుడు ఇంట్లో ఓ దళిత యువకుడికి ఘోర అవమానం జరిగింది. తమ ఇంట్లో పని మానేశాడన్న నెపంతో నూతన్‌కుమార్ నాయుడు భార్య మధుప్రియ.. కర్రి శ్రీకాంత్ అనే యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. తనకు జరిగిన అవమానంపై బాధితుడు పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ► విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలో గిరిప్రసాద్‌నగర్‌లోని నూతన్‌కుమార్ నాయుడు ఇంట్లో కర్రి శ్రీకాంత్ అనే యువకుడు నాలుగు నెలల క్రితం పనికి చేరాడు. వ్యక్తిగత కారణాలతో ఆగస్టులో పని మానేశాడు. అయితే శుక్రవారం శ్రీకాంత్‌కు నూతన్‌కుమార్ భార్య మధుప్రియ ఫోన్ చేసి ‘నువ్ సెల్‌ఫోన్ తీశావు.. ఇంటికిరా మాట్లాడాలి’ అని పిలిచింది. ► అక్కడకు వెళ్లిన శ్రీకాంత్‌ను నిర్బంధించి అతడిపై తప్పుడు ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న సెలూన్ నిర్వాహకుడు రవిని పిలిపించి మధుప్రియ సమక్షంలో శ్రీకాంత్‌కు శిరోముండనం చేయించారు. ► తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీకాంత్ పెందుర్తి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వెస్ట్ ఏసీపీ శ్రావణ్‌కుమార్, ఎస్సీ, ఎస్టీ విభాగం ఏసీపీ త్రినా«థ్ పెందుర్తి పీఎస్‌కు చేరుకుని బాధితుడితో మాట్లాడారు. అతడి వాంగ్మూలం మేరకు నిందితురాలు మధుప్రియ సహా నలుగురిని జరిగిన ఘటనపై విచారిస్తున్నారు. ► ఈ ఘటనలో నూతన్‌కుమార్‌నాయుడు పాత్రపై లోతుగా విచారణ చేస్తున్నారు. కాగా నూతన్ కుమార్ నాయుడు జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున పెందుర్తి ఎమ్మెల్యేగా 2014లో పోటీ చేశారు. గతేడాది ఓ చానల్లో ప్రసారమైన బిగ్‌బాస్ షోలో పాత్రధారి. ఇటీవల విడుదలైన పరాన్నజీవి చిత్రానికి దర్శకుడు. విశాఖ నగర మాజీ మేయర్, ప్రస్తుత టీడీపీ నేతకు వ్యాపార భాగస్వామి అని సమాచారం. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు సన్నిహితుడు, వీరాభిమాని. ► ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు సాగుతోందని విశాఖ సీపీ మనీష్‌కుమార్ సిన్హా తెలిపారు. ఘటనను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లామని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ చెప్పారు. తననేమైనా చేస్తారని భయంగా ఉందని, ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని బాధితుడు కర్రి శ్రీకాంత్‌కోరాడు. -
ఆ సంగతి తెలియగానే గుండు చేయించుకున్నా..
అహ్మదాబాద్ : ‘క్యాన్సర్’ పేరు వింటేనే సగం చచ్చిపోతాము. ఆ మహమ్మారితో పోరాడాలంటే ఎంతో ధైర్యం కావాలి. ఎందుకంటే క్యాన్సర్ చికిత్సలో భాగంగా చేసే కీమోథెరపి చాలా కష్టమైన ప్రక్రియ. మనిషి చాలా బలహీనమవుతాడు. జుట్టు కూడా రాలిపోతుంది. చాలామంది వీటన్నింటిని తట్టుకుని నిలబడలేరు. కానీ అహ్మదాబాద్‌కు చెందిన ఉర్వి సబ్నిస్ను మాత్రం ఈ భయాలు ఏమి చేయలేకపోయాయి. ఆమె కాన్యర్పై తన పోరాటాన్ని కొనసాగించి, గెలిచింది. ఆమె తనకు క్యాన్సర్ అని తెలియగానే ముందుగా చేసిన పని గుండు చేయించుకుంది. గుండు చేయించుకున్న తర్వాత ఆమె తన తలను స్కార్ఫ్ లేదా విగ్గుతో దాయలనుకోలేదు. ఆమె గుండు చేయించుకున్నానని సిగ్గు పడలేదు. అంతేకాకుండా ఆమె కీమోథెరపి చేయించుకోవడానికి వెళ్లిన ప్రతిసారి చాలా చక్కగా అలంకరించుకుని వెళ్లేది. ఆమె ఇంత ధైర్యంగా క్యాన్సర్‌తో పోరాడింది కాబట్టే ‘సెల్ఫ్ వీ సర్వైవర్’ పోటీలో రెండో స్థానంలో నిలిచింది. ఈ ‘సెల్ఫ్ వీ’ పోటీలో క్యాన్సర్‌పై పోరాడి గెలిచిన వారిని.. వారు క్యాన్సర్‌ను ఎలా ఎదుర్కొన్నారో 90 సెకన్లకు మించకుండా వారి మాటలల్లోనే ఒక వీడియో తీసి పంపిచమన్నారు. సబ్నిస్ తీసిన ఆ వీడియోలో ‘2015లో నాకు రొమ్ము క్యాన్సర్ అని తెలిసింది. అది విన్న వెంటనే ఒక్కసారిగా నా గుండె పగిలిపోయినట్లయ్యింది, కానీ నేను వెంటనే తేరుకొన్నాను. నాకే ఎందుకు ఇలా జరిగింది, నాకేమన్నా జరిగితే నా కుటుంబం పరిస్థితి ఏంటి అని బాధపడుతూ నా సమయాన్ని, శక్తిని వృథా చేయదల్చుకోలేదు. కేవలం నేను చేయించుకోబోయే వైద్యం గురించి, తర్వాత కోలుకోవడం గురించే ఆలోచించాను. క్యాన్సర్ బారిన పడిన వారు ముఖ్యంగా భయపడేది చావుతో జుట్టు ఊడిపోవడం గురించి. కీమోథెరపీ చేయించుకుంటే జుట్టు రాలిపోవడం అనివార్యమని నాకు తెలుసు. అందుకే నాకు క్యాన్సర్ అని తెలియగానే ముందు గుండు చేయించుకున్నాను. నేను కీమోథెరపీ కోసం వెళ్లిన ప్రతిసారి మంచి బట్టలు ధరించి, చక్కగా అలంకరించుకుని వెళ్లేదాన్ని. నేను దురదృష్టాన్ని కూడా నవ్వుతూ ఆహ్వానించాలనుకున్నాను. అలాగే చేశాను. మా అమ్మ నన్ను చూడడానికి వచ్చినప్పుడు నా కోసం విగ్గు తీసుకువచ్చింది. కానీ నేను దాన్ని పెట్టుకోవాలని అనుకోలేదు’ అని తెలిపింది. ప్రస్తుతం సబ్నీస్ హెచ్‌సీజీ ఆస్పత్రికి వచ్చే క్యాన్సర్ రోగులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ, వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. నా మీద జాలీ చూపించేవారంటే నాకు ఇష్టం ఉండదు. అలాంటివారికి దూరంగా ఉండాలనుకుంటాను. నేను చికిత్స పొందే సమయంలో నా మంచం దగ్గర ఒక నోట్‌ను పెట్టుకున్నాను. దానిలో నేను ‘జాలిని ఆశించను, జాలిని చూపించను’ అని ఉంటుంది. ఒకరు నా మీద జాలీ పడటం నాకు ఇష్టం ఉండదు. జాలీ పడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని పేర్కొంది. -
తల్లీ, కూతురికి గుండు కొట్టించి..
రాంచీ : మంత్రాలు చేస్తున్నారనే నెపంతో ఓ తల్లీ కూతురికి గ్రామస్తులు గుండు కొట్టారు. ఈ సంఘటన జార్ఖండ్ రాష్ర్టంలోని రాంచీ శివార్లలో గురువారం జరిగింది. ఆలస్యంగా బాధితులు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని ఓ మహిళ వీళ్లు చేసే మంత్రాల కారణంగా చనిపోయిందని భావించి గ్రామస్తులు వీరి మీద దాడికి దిగారు. గ్రామ సమీపంలో ఉన్న నది వద్దకు తీసుకుపోయి తల్లి(65), ఆమె కూతురి(35)కీ గుండు కొట్టారు. అనంతరం బలవంతంగా ఇద్దరికీ తెల్లచీరలు కట్టించారు. అంతా అయిన తర్వాత సెప్టిక్ ట్యాంక్‌లోని నీటిని వాళ్లచేత తాగించారు. జరిగిన విషయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గతంలోని చనిపోయిన మహిళ అనారోగ్యంతోనే చనిపోయిందని తెలుస్తోంది. మంత్రాలు చేస్తున్నారనే నెపంతో 15 ఏళ్లుగా 700 మంది మంత్రగాళ్లను జార్ఖండ్‌లో చంపినట్లుగా నివేదికలు తెలుపుతున్నాయి. -
ప్రియురాలు కోరిక తీర్చలేదని..
చెన్నై: ప్రియురాలిపై కోపంతో ఆమె కుమారుడిని ఎత్తుకెళ్లి గుండు కొట్టించాడు ఓ వ్యక్తి. చెన్నైలో జరిగిన ఈ ఘటన వివరాలివీ.. కొరుక్కుపేట కామరాజర్ నగర్‌కు చెందిన మునియప్పన్ (30) భార్య సరస్వతి(26)తో విభేదాలు రావటంతో మూడేళ్ల క్రితం భార్య, ఇద్దరు పిల్లలను వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. కొంతకాలం తర్వాత సరస్వతికి అదే ప్రాంతానికి చెందిన ఆనందరాజ్(25)తో సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈనెల 15వ తేదీ మద్యం మత్తులో వచ్చిన ఆనంద్‌రాజ్ సరస్వతిని కోరిక తీర్చమని అడిగాడు. ఆమె నిరాకరించడంతో కుమార్తెను పంపమని బలవంతపెట్టాడు. దీంతో భయపడిపోయిన సరస్వతి కుమార్తెను తీసుకుని బంధువుల ఇంట్లో ఉంచి తిరిగి ఇంటికి వచ్చింది. తిరిగొచ్చేసరికి ఇంట్లో కుమారుడు కనిపించకపోవడంతో ఆర్కే నగర్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా.. సరస్వతి కుమారుడిని ఆనంద్‌రాజ్ కిడ్నాప్ చేసి గుండు కొట్టించి దాచి పెట్టినట్టు గుర్తించారు. దీంతో పోలీసులు అతడి ఇంటి నుంచి చిన్నారిని రక్షించారు. ఆనంద్‌రాజ్‌ను అరెస్టు చేసి జార్జ్‌టౌన్ న్యాయస్థానంలో హాజరుపరిచి పుళల్ జైలుకు తరలించారు. -
రెండు సన్నివేశాల కోసం..
సాక్షి, తమిళ సినిమా: పాత్రల కోసం బరువు తగ్గడం, పెరగడం కోసం తారలు శ్రమిస్తుంటారు. అదీ చాలా తక్కువ మందే. అలాంటిది తమ జుత్తు త్యాగం చేయడానికి ముఖ్యంగా నటీమణులు ససేమిరా అంగీకరించరు. అలాంటిది నటి పూర్ణ కొడివీరన్ చిత్రం కోసం, అదీ హీరోయిన్ పాత్ర కోసం కూడా కాదు, ఒక ముఖ్య పాత్ర కోసం గుండు గీయించుకుని నటించింది. కథానాయకి పాత్రలే కావాలని పట్టుపట్టకుండా కొత్తదనం ఉంటే ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ అంటున్న నటి పూర్ణ.. కొడివీరన్ చిత్రంలో ఒక వైవిధ్యభరిత పాత్రలో కనిపించనుంది. శశికుమార్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కొడివీరన్. మహిమానంబీయార్ కథానాయకిగా నటించిన ఇందులో శశికుమార్‌కు చెల్లెలుగా నటి సనూజ నటించింది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అవుతున్న ఈ చిత్రం గురించి శశికుమార్ తెలుపుతూ అన్నాచెల్లెలి అనుబంధంతో కూడిన కథా చిత్రంలో నటించాలన్నది తన చిరకాల కోరిక అని చెప్పారు. ఇదే విషయాన్ని కుట్టిపులి చిత్ర షూటింగ్ సమయంలో దర్శకుడు ముత్తయ్యకు చెప్పానన్నారు. అలాంటి కథా చిత్రమే ఈ కొడివీరన్ అని చెప్పారు. ఇందులో నటి పూర్ణది కథానాయకి పాత్ర కాకపోయినా చాలా కీలక పాత్ర అని చెప్పారు. రెండు సన్నివేశాల కోసం ఆమె గుండు కొట్టించుకుని జుత్తును త్యాగం చేసిందని చెప్పారు. ఈ చిత్రంలో ప్రతినాయకుడంటూ ఎవరూ ఉండరనీ, పరిస్థితులు, కొన్ని పాత్రల తప్పుడు నిర్ణయాలే విలన్ అవుతాయన్నారు. శివాజీగణేశన్ నటించిన పాశమలర్ చిత్రం మాదిరిగా కొడివీరన్ చిత్రం అన్నాచెల్లెలి అనుబంధాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందని ఆయన తెలిపారు. -
సాధువుకు గుండు గీయించిన నక్సల్స్
న్యూడెమోక్రసీ అజ్ఞాత దళం చర్యపై సాధువు ఆవేదన బయ్యారం: నూతన ప్రజాస్వామిక విప్లవ పంథాలో పయనిస్తున్న కామ్రేడ్లు గిరిజన సాధువుపై కన్నెర్ర చేశారు. సాధువు మూలంగా తమ పార్టీ వైపు ప్రజలు వచ్చేందుకు భయపడుతున్నారనే ఆగ్రహంతో ఏకంగా 30 సంవత్సరాల పాటు పెంచుకున్న సాధువు జుట్టును కత్తిరించి గుండు చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని కిష్టాపురం గ్రామానికి చెందిన బాధితుడు గుగులోత్ సోమ్లా తెలిపిన వివరాలు ప్రకారం... సోమ్లా తన వంశపారపర్యంగా వస్తున్న ఆచారం ప్రకారం సాధువుగా మారి జుట్టును పెంచుకుంటూ ఇంటి వద్ద నిర్మించిన గుడిలో సేవాలాల్ మహరాజ్, వెంకటేశ్వరస్వామిలకు పూజలు నిర్వహిస్తుంటాడు. న్యూడెమోక్రసీలో చీలికరాక ముందు సోమ్లా ఆ పార్టీ సానుభూతిపరునిగా కొనసాగాడు. పార్టీలో చీలిక అనంతరం రాయలవర్గంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం చంద్రన్న వర్గానికి చెందిన అజ్ఞాత నాయకుడు అశోకన్న పిలుస్తున్నారని ఓ వ్యక్తి వచ్చి సోమ్లాను గ్రామ సమీపంలో ఉన్న అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న ఆ పార్టీ బయ్యారం ఏరియా దళ కమాండర్ కుమార్ సోమ్లాను రాయల వర్గానికి ఆర్గనైజర్‌గా పనిచేస్తున్నావా అని ప్రశ్నించగా తాను ఆర్గనైజర్‌ను కాదని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాని తెలిపాడు. ఆ తరువాత జుట్టు ఎందుకు పెంచుకుంటున్నావని నీ జుట్టుకు భయపడి మా పార్టీలోకి ఎవరూ రావటం లేదని ఆగ్రహంతో సోమ్లా చేతులను వెనుకకు విరిచి కట్టివేశాడు. ఆ తరువాత జుట్టు, గడ్డంను బ్లేడుతో గీశారని సోమ్లా చెప్పాడు. సంవత్సరాల తరబడి దేవునిపై నమ్మకంతో పెంచుకున్న జుట్టు వెంట్రుకలను తనకు ఇస్తే దేవునికి సమర్పిస్తానని బతిమిలాడినప్పటికీ కనికరించలేదని సోమ్లా కన్నీటి పర్యంతమయ్యాడు. -
గుండు కొట్టించి, గాడిదపై ఊరేగించారు
లక్నో: బలవంతంగా మతమార్పిడికి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఓ వ్యక్తిని దారుణంగా అవమానించిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఒరాయ్ జిల్లాలో ప్రకంపనలు రేపింది. జలౌన్ జిల్లాకు చెందిన ఆద్వేష్ అనే వ్యక్తికి గుండు గీసి, చెప్పుల దండ మెడలో వేసి పట్టపగలు, నడి వీధుల్లో ఊరేగించారు. వివరాల్లోకి వెళితే ముగ్గురు హిందువులను క్రైస్తవ మతం లోకి మార్చి, వారితో బీఫ్ తినిపించారనే ఆరోపణలతో భజరంగ్ దళ్ కార్యకర్తలు రెచ్చిపోయారు. క్రిస్టియన్ మతంలోకి కన్వర్ట్ చేసి వారిని సత్సంగ్ కు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశాడంటూ వీరంగం సృష్టించారు. దాదాపు 200 మంది కార్యకర్తలు జలౌన్ జిల్లాలోని ఆద్వేష్ సవిత ఇంటిపై దాడి చేశారు. అతడిని బలవంతంగా బయటికి లాక్కొచ్చి, గుండు కొట్టించారు. కనుబొమ్మలు, మీసాన్ని సైతం తీసివేయించారు. అనంతరం గాడిదపై ఊరేగిస్తూ ఒరాయ్ జిల్లాకు తీసుకొచ్చారు. మరోవైపు బాధితుల ఫిర్యాదు మేరకు ఈ సంఘటపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. అయితే ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని సమాచారం. -
స్కూలుకు రాలేదని.. గుండు గీశారు..
బెంగళూరు: స్కూలుకు రాలేదని.. 12 మంది విద్యార్ధులకు గుండు గీసిన సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. నగరంలోని విటల్ మాలియా రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్లో ఈ ఘటన జరిగింది. స్కూల్లోని 9,10వ తరగతి విద్యార్థులను వార్డెన్ ఇలా శిక్షించినట్టు సమాచారం. హాస్టల్ వార్డెన్ కిరణ్ పిల్లలకు తలలో చుండ్రు ఉందనే గుండు గీయించిట్టు చెబుతున్నారు. విద్యార్థులందరితో పాటు వార్డెన్‌ను కూడా విచారించామని, చట్టబద్ధంగా ముందుకెళ్లామని కబ్బన్ పార్క్ డీసీపీ సందీప్ పాటిల్ తెలిపారు. అయితే పిల్లల తల్లిదండ్రులు మాత్రం దీనిపై మండిపడుతున్నారు. 'మా అబ్బాయి తరగతులకు హాజరు కాలేదని ఒకరోజంతా గ్రౌండ్లో నిలబెట్టి ఉంచారు. ఒక రోజు తరగతికి హాజరు కాకపోతేనే శిక్షించారు. మరుసటి రోజు స్కూలుకు వెళ్లి చూస్తే మా అబ్బాయి తల మీద జుట్టు లేకపోవడం చూసి ఆశ్చర్యపోయాం' అని ఓ బాలుడి తండ్రి పేర్కొన్నారు. స్కూల్లో మొత్తం 12 మంది విద్యార్థులకు గుండు గీయించారు. విద్యార్థులు గత వారంలో తరగతులకు హాజరు కాలేదని.. దీనికి సంబంధించి ఆ వారంలోనే అధికారులు దండనలు విధించారని పోలీసులు తెలిపారు. -
తాళ్లతో బంధించి ప్రియురాలికి శిరోముండనం
కొయ్యూరు : సహజీవనం చేస్తున్న ప్రియుడే అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. డబ్బు తెమ్మని వేధిస్తూ... అంగీకరించని ప్రియురాలిని బంధించి శిరోముండనం చేశాడు. ఎస్ఐ తెలిపిన కథనం ప్రకారం... బంగారంపేట పంచాయతీ గుజ్జువానిపాలేనికి చెందిన కూడా లోవ దుర్గ, శరభన్నపాలేనికి చెందిన సంపర బాలకుమార్ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ శరభన్నపాలెంలో సహజీవనం చేస్తున్నారు. కొన్ని నెలలుగా బాలకుమార్ తరచు డబ్బులు తెమ్మని దుర్గను వేధించేవాడు. దీంతో ఆమె సర్పంచ్ దృష్టికి సమస్యను తీసుకెళ్లింది. ఇది మంచి పద్దతి కాదని సర్పంచ్ సహా పెద్దలు కుమార్‌కు హితవు పలికారు. దీన్ని మనసులో పెట్టుకున్న కుమార్ ఆమెను మరింత వేధించటం మొదలుపెట్టాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగటంతో ఆగ్రహించిన కుమార్....దుర్గ కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి బ్లేడుతో శిరోముండనం చేశాడు. దీనిపై బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.