తాళ్లతో బంధించి ప్రియురాలికి శిరోముండనం | youth tonsured girl friend at koyyuru | Sakshi
Sakshi News home page

తాళ్లతో బంధించి ప్రియురాలికి శిరోముండనం

Published Fri, Dec 20 2013 9:39 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM

youth tonsured girl friend at koyyuru

కొయ్యూరు : సహజీవనం చేస్తున్న ప్రియుడే అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. డబ్బు తెమ్మని వేధిస్తూ... అంగీకరించని ప్రియురాలిని బంధించి శిరోముండనం చేశాడు. ఎస్ఐ తెలిపిన కథనం ప్రకారం... బంగారంపేట పంచాయతీ గుజ్జువానిపాలేనికి చెందిన కూడా లోవ దుర్గ, శరభన్నపాలేనికి చెందిన సంపర బాలకుమార్ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ శరభన్నపాలెంలో సహజీవనం చేస్తున్నారు.

కొన్ని నెలలుగా బాలకుమార్ తరచు డబ్బులు తెమ్మని దుర్గను వేధించేవాడు. దీంతో ఆమె సర్పంచ్ దృష్టికి సమస్యను తీసుకెళ్లింది. ఇది మంచి పద్దతి కాదని సర్పంచ్ సహా పెద్దలు కుమార్కు హితవు పలికారు. దీన్ని మనసులో పెట్టుకున్న కుమార్ ఆమెను మరింత వేధించటం మొదలుపెట్టాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగటంతో ఆగ్రహించిన కుమార్....దుర్గ కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి బ్లేడుతో శిరోముండనం చేశాడు. దీనిపై బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement