lover attacked
-
అన్నమయ్య జిల్లా: వాలెంటైన్స్ డే రోజున ప్రేమోన్మాది యాసిడ్ దాడి
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమికుల దినోత్సవం రోజున అమానుష ఘటన వెలుగుచూసింది. ప్రేమ పేరుతో వేధించి యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు ప్రేమోన్మాది. దీంతో, వెంటనే బాధితురాలిని మదనపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లెకు చెందిన గౌతమి(23)పై ప్రేమోన్మాది గణేష్ యాసిడ్ దాడి చేశాడు. ఆమె తలపై కత్తితో పొడిచి ముఖంపై యాసిడ్ పోశాడు. దీంతో, బాధితురాలు విలవిల్లాడిపోయింది. ఈ క్రమంలో వెంటనే ఆమెను మదనపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇటీవలే గౌతమికి పెళ్లి నిశ్చయం అయ్యింది. రాబోయే ఏప్రిల్ 29న ఆమెకు పీలేరు జగన్ కాలనీకి చెందిన శ్రీకాంత్‌తో పెళ్లివివాహం జరగనుంది. ఈ నేపథ్యంలోనే గౌతమి పెళ్లిపై గణేష్ రగిలిపోయాడు. అనంతరం, ఈరోజు దాడికి పాల్పడ్డారు.గౌతమి మదనపల్లెలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి మదనపల్లె పట్టణం కదిరి రోడ్డులో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. ఇక, నిందితుడిని మదనపల్లె అమ్మచెరువుమిట్టకు చెందినట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గౌతమి వద్దకు జడ్జీ వెళ్లి బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
వరంగల్ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం
వరంగల్ జిల్లాలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించిన అమ్మాయి కుటుంబంపై విచక్షణా రహితంగా తల్వార్‌తో దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లా చంద్రరావు పేట మండలం 16 చింతల తండా జరిగింది. ఈ దాడిలో యువతి తల్లి, తండ్రులు మృతి చెందారు. యువతి, ఆమె తమ్ముడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.పోలీసుల కథనం ప్రకారం.. గూడూరు మండలం గుండెంగకి చెందిన మేకల నాగరాజు అలియాస్ బన్నీ 16 చింతల తండా దీపిక ప్రేమించుకున్నారు. అమ్మాయి కుటుంబ సభ్యులకు చెప్పా పెట్టకుండా ఇంట్లోనుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన రెండు నెలలకే దీపిక, నాగరాజుల మధ్య మనస్పర్దలు తలెత్తడంతో పోలీసులు, పెద్దల సమక్షంలో విడిపోయారు. ఈ క్రమంలో నిందితుడు ముందస్తు కుట్రలో భాగంగా బుధవారం అర్ధరాత్రి 1:35 నిమిషాల సమయంలో తల్వార్‌తో దీపిక ఇంటికి వచ్చాడు. ఇంటి బయట గాడ నిద్రలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులపై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో అమ్మాయి తల్లి బానోతు సుగుణ అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి బానోతు శ్రీనివాస్ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.నిందితుడు దాడితో తీవ్రగాయాల పాలైన దీపిక, ఆమె తమ్ముడు మదన్‌లు నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడి అనంతరం నిందితుడు పరారాయ్యాడు.నిందితుడి దాడితో స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు నాగరాజు కోసం బృందాలుగా విడిపోయి పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. -
ప్రేమ పెళ్లితో ఒక్కటవుదామనుకున్నారు.. ఆమె నో చెప్పడంతో..
గురుగ్రామ్: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. ఈ విషయం పెద్దలకు చెప్పడంతో వారి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించి ముహుర్తం ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో నిశ్చితార్థం కూడా చేసి ఘనంగా పెళ్లికి ప్లాన్ చేస్తున్నారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో.. అతడితో పెళ్లికి ఆమె నో చెప్పింది. దీంతో, ఆవేశానికి గురైన లవర్.. యువతిని దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. యూపీలోని బదౌన్‌కు చెందిన రాజ్‌కుమార్(23), నేహా(19) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం పెద్దలకు చెప్పడంతో వారి పెళ్లికి అంగీకరించారు. ఈ క్రమంలో పెళ్లికి ముహుర్తం ఫిక్స్ చేసి ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిపించారు. అయితే, సడెన్‌గా ఏమైందో తెలియదు కానీ.. నేహా.. రాజ్‌తో పెళ్లికి నో చెప్పింది. దీంతో, నేహాను రాజ్ వేధించడం మొదలుపెట్టాడు. తనను పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానంటూ పలుమార్లు బెదిరించాడు. కానీ ఆమె ఇవేమీ పట్టించుకోలేదు. దీంతో, ఆమెపై రగిలిపోయిన రాజ్‌కుమార్ తనను చంపేందుకు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో సోమవారం నేహా తన తల్లితో కలిసి బయటకు వచ్చింది. ఈ సందర్భంగా వారిని అడ్డగించిన రాజ్.. ఆమెతో మాట్లాడాలంటూ దగ్గరి వచ్చాడు. ఏదో మాట్లాడుతున్నట్టు నటించి.. తన వద్ద ఉన్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆమె కడుపులో, మెడపై కత్తితో ఇష్టమొచ్చినట్లు దాడి చేశాడు. దీంతో నేహా అక్కడికక్కడే మృతి చెందింది. ఇక, నేహాపై రాజ్ దాడి చేస్తున్న సమయంలో ఆమె తల్లి పక్కనే ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయింది. ఆ సమయంలో అక్కడ చాలా మందే ఉన్నారు. అయితే అతడి చేతిలో కత్తిని చూసి వారంతా భయంతో పరుగులు పెట్టారు. అనంతరం.. నేహా తల్లి రాజ్‌ను చెప్పులతో కొడుతూ ఆవేదనకు లోనైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా తనతో పెళ్లికి నిరాకరించినందుకే ఆమెను చంపేసినట్ల నిందితుడు రాజ్ కుమార్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ఇది కూడా చదవండి: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి మిస్సింగ్ కలకలం షాకింగ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమికుడు
సాక్షి ప్రతినిధి, విజయనగరం/అమరావతి: ప్రేమించిన యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమికుడి ఉదంతమిది. ఏపీలోని విజయనగరం జిల్లా చౌడు వాడలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో గాలి రాములమ్మ అనే యువతి గాయపడింది. మంటల కారణంగా రాములమ్మ సోదరి సంతోషి, ఆమె ఆరేళ్ల కుమారుడు అరవింద్ సైతం గాయపడ్డారు. ఘటనపై సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. పెళ్లి చేసుకోమని అడిగిందని.. రాములమ్మ, శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారువకు చెందిన వ్యాన్‌డ్రైవర్ ఆళ్ల రాంబాబు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ముందు ఇరు కుటుంబాలు అంగీకరించినా తర్వాత నిరాకరించారు. తనను పెళ్లి చేసుకోవాలంటూ రాములమ్మ అడుగుతుండటంతో కక్ష పెంచుకున్న రాంబాబు గురువారం రాములమ్మ ఇంటికి వెళ్లి ఆమెపై పెట్రో ల్‌పోశాడు. అది సంతోషి, అరవింద్‌పైనా పడింది. రాంబాబు నిప్పు పెట్టడంతో ముగ్గురూ మంటల్లో చిక్కుకున్నారు. రాములమ్మ కుటుంబ సభ్యులు దిశ ద్వారా పోలీసులకు సమాచారమిచ్చారు. అప్రమత్తమైన కానిస్టేబుల్ దామోదర్, హోం గార్డు సత్యనారాయణ ముగ్గురినీ విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఎం ఆదేశాలతో మెరుగైన చికి త్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మనస్విని ఆరోగ్య పరిస్ధితి విషయం
-
‘మూర్ఖుడు.. ఏ శిక్ష వేసినా తప్పులేదు’
సాక్షి, హైదరాబాద్: తన కొడుకు మూర్ఖంగా ప్రవర్తించాడని, అతడికి ఎటువంటి శిక్ష వేసినా అభ్యంతరం లేదని కార్తీక్ తల్లి ఊర్మిళ అన్నారు. శుక్రవారం ఆమె ఓ వార్తా చానల్‌తో మాట్లాడుతూ... తన కొడుకు చేసిన తప్పు మరొకరు చేయొద్దని వేడుకున్నారు. సంధ్యతో కార్తీక్‌కు చాలా రోజులుగా పరిచయం ఉందని తెలిపారు. సంధ్య అప్పుడప్పుడు తమ ఇంటికి వచ్చేదని వెల్లడించారు. కార్తీక్ తన సంపాదన మొత్తం సంధ్యకే ఇచ్చేవాడని, కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య దూరంగా పెరిగిందన్నారు. వారం క్రితం ఆత్మహత్యాయత్నం చేశాడని వెల్లడించారు. సంధ్య వెంటపడొద్దని కొడుక్కి నచ్చజెప్పినట్టు తెలిపారు. సమస్యలుంటే పెద్దవారితో మాట్లాడుకుకోవాలని, ఇలాంటి దారుణాలకు దిగొద్దని కోరారు. ఓ అమ్మాయి ప్రాణం తీశాడు.. తల్లి బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునని చెప్పారు. కార్తీక్‌ను తానే తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పానని తెలిపారు. గురువారం సాయంత్రం లాలాపేట్ విద్యామందిర్ సమీపంలో సంధ్యారాణిపై కార్తీక్ కిరోసిన్ పోసి నిప్పంటించాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం ప్రాణాలు విడిచింది. నిందితుడు కార్తీక్‌పై 307, 354డీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. -
ప్లాన్ ప్రకారమే కార్తీక్ దాడి : డీసీపీ సుమతి
సాక్షి, హైదరాబాద్ : సంధ్యారాణి హత్యకేసులో నిందితుడు కార్తీక్‌ను పోలీసులు శుక్రవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. నార్త్ జోన్ డీసీపీ సుమతి కేసు వివరాలను మీడియా సమావేశంలో వివరించారు. ఈ ఘటన దురదృష్టకరమని ...పథకం ప్రకారమే కార్తీక్...సంధ్యారాణిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించినట్లు ఆమె తెలిపారు. ఈ కేసులో అన్ని వివరాలు సేకరించామని, కార్తీక్‌కు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ‘ఏడాది కాలంగా కార్తీక్...సంధ్యారాణిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. సంధ్యారాణి అందంగా ఉండటమే కాకుండా, చక్కగా చదువుకుంది. అయితే కార్తీక్ మాత్రం ఏడో తరగతి ఫెయిల్ కావడమే కాకుండా ఆవారాగా తిరుగుతున్నాడు. దీంతో ఆమె అతడిని కాదనుకుంది. అంతేకాకుండా కార్తీక్ వేధింపుల విషయాన్ని సంధ్యారాణి తాను పని చేస్తున్న లక్కీ ట్రేడర్స్ యజమాని దృష్టికి తీసుకు వెళ్లింది. యజమాని కూడా అతడిని మందలించాడు. కార్తీక్...సంధ్యకు ఉద్యోగం చూపించినా, ఆమె స్వశక్తితోనే అక్కడ రాణిస్తోంది. అయితే సంధ్యారాణి తనను దూరం పెట్టడాన్ని సహించలేని కార్తీక్ ఈ వికృత చర్యకు పాల్పడ్డాడు. 64 శాతం కాలిన గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సంధ్యారాణి ఈ రోజు ఉదయం మృతి చెందింది. నిందితుడు కార్తీక్‌పై 307, 354డీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశాం.’ అని తెలిపారు. మరోవైపు సంధ్యారాణి మృతదేహానికి వైద్యులు పోస్ట్‌మార్టం పూర్తి చేసి కుటుంబసభ్యులకు అందచేశారు. ఆమె మృతదేహాన్ని లాలాపేటకు తరలించారు. -
పథకం ప్రకారమే కార్తీక్...సంధ్యారాణిపై దాడి
-
నా కూతురు చావుకు కారణమైన కార్తీక్‌ను శిక్షించాలి
-
కార్తీక్ గురించి ఎప్పుడూ చెప్పలేదు..
సాక్షి, హైదరాబాద్ : తన కుమార్తె చావుకు కారణం అయిన కార్తీక్‌ను చంపేయాలంటూ మృతురాలు సంధ్యారాణి తల్లి సావిత్రి అన్నారు. ప్రేమించలేదనే అక్కసుతో కార్తీక్ అనే యువకుడు సంధ్యపై కిరోసిన్ పోసి నిప్పు అంటించడంతో...తీవ్ర గాయాలతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. సంధ్యారాణి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అందచేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి తల్లి మాట్లాడుతూ.. ‘నా కూతురు చావుకు కారణమైన కార్తీక్ ను కూడా చంపాలి. అప్పుడే నా కూతురుకు న్యాయం జరిగినట్టు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి వెంటనే కార్తీక్‌ను శిక్షించాలి. సంధ్య ఎప్పుడు కార్తీక్ గురించి నాకు చెప్పలేదు. కార్తీక్ ఎవరో మాకు తెలియదు.’ అని అన్నారు. సంధ్య కుటుంబాన్ని ఆదుకోవాలి మరోవైపు కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ...ఈ రోజు ఉదయం మృతురాలు సంధ్యారాణి కుటుంబసభ్యులను పరామర్శించారు. నేరానికి పాల్పడ్డ కార్తీక్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి...సంధ్యారాణి కుటుంబాన్ని ఆదుకోవాలని బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఆమె కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలన్నారు. 24 గంటలు వైద్య సేవలు అందించాల్సిన వైద్యులు ఈ కేసులో నిర్లక్ష్యం వహించారన్నారు. ఇలాంటి ఘటనలు వారానికి ఆరు కేసులు గాంధీ ఆస్పత్రికి వస్తున్నాయన్నారు. నగరంలో రోజురోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా సంధ్యారాణిని ప్రేమించా... సంధ్యారాణిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించిన కార్తీక్‌ను లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై హత్యకేసు నమోదు చేశారు. పోలీసుల విచారణలో సందర్భంగా కార్తీక్ పలు విషయాలు వెల్లడించాడు. ‘ అయిదేళ్లుగా సంధ్యారాణిని ప్రేమిస్తున్నా. ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కొద్దిరోజులుగా సంధ్యారాణి ప్రవర్తనలో మార్పు వచ్చింది. నిన్న కూడా ఆమెను బతిమిలాడాను. నన్ను ప్రేమించి, పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. నన్ను నిరాకరించడంతోనే కిరోసిన్ పోసి నిప్పు అంటించాను. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాను.’ అని తెలిపాడు. -
ప్రేమోన్మాదం.. సంధ్యను చంపేశాడు..
సాక్షి, హైదరాబాద్: ఉన్మాది దాడిలో గాయపడ్డ సంధ్యారాణి శుక్రవారం ఉదయం కన్నుమూసింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంధ్యారాణి.. మృత్యువుతో పోరాడి అసువులు బాసింది. ప్రేమించలేదనే అక్కసుతో కార్తీక్ అనే యువకుడు సంధ్యారాణిపై కిరోసిన్ పోసి తగులబెట్టిన విషయం తెలిసిందే. ఆమె మృతి చెందినట్లు గాంధీ ఆసుపత్రి డాక్టర్లు కుటుంబసభ్యులకు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణ మధ్య రైల్వేలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తున్న కార్తీక్ కొన్ని నెలల క్రితం సంధ్యారాణి ఎదుట ప్రేమ ప్రతిపాదన చేశాడు. కుటుంబ భారం తనపై ఉండటంతో అతని ప్రతిపాదనను ఆమె సున్నితంగా తిరస్కరించింది. అయినా తన పంథా మార్చుకోని కార్తీక్ నేరుగా, ఫోన్ ద్వారా వేధింపులు మొదలెట్టాడు. దీంతో కొన్నాళ్లుగా సంధ్యారాణి అతడిని దూరం పెట్టింది. గురువారం సం«ధ్యారాణి, కార్తీక్ మధ్య ఫోన్లో వాగ్వాదం జరిగింది. తనను ప్రేమించకపోతే అంతు చూస్తానంటూ కార్తీక్ బెదిరించగా.. సంధ్యారాణి అతడిని మందలించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న కార్తీక్ అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. సంధ్యారాణి రోజూ విధులు ముగించుకున్న తర్వాత లాలాపేట్ విద్యామందిర్ మీదుగా ఇంటికి నడిచి వెళ్తుంటుంది. గురువారం సాయంత్రం కార్తీక్ కిరోసిన్ డబ్బాతో ఆ ప్రాంతానికి చేరుకుని కాపు కాశాడు. సంధ్యారాణి 6 గంటల ప్రాంతంలో అటుగా రావడం గమనించి.. మరోసారి వేధింపులకు దిగాడు. అతడి ప్రతిపాదనను ఆమె తిరస్కరించడంతో విచక్షణ కోల్పోయి.. వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఆమెపై పోశాడు. షాక్‌కు గురైన సంధ్యారాణి వెంటనే తేరుకుని పారిపోవడానికి ప్రయత్నించింది. ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో జనం ఉండే ప్రాంతానికి పరిగెత్తింది. ఈ లోపే ఆమె వెంట పరిగెత్తిన కార్తీక్ నిప్పుపెట్టాడు. శరీరం కాలుతున్న బాధతో ఆమె హాహాకారాలు చేస్తుంటే కార్తీక్ అక్కడ నుంచి పారిపోయాడు. కాలుతున్న శరీరంతోనే దాదాపు 200 మీటర్లు పరిగెత్తిన సంధ్యారాణి అక్కడ కుప్పకూలిపోయింది. ఇది గమనించిన స్థానికులు ఆమె వద్దకు చేరుకుని నీళ్లుపోసి మంటలార్పి.. పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. గాంధీ ఆసుపత్రిలో కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న సంధ్యారాణి ఈరోజు ఉదయం ప్రాణాలు విడిచింది. సంధ్య మృతితో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
తాళ్లతో బంధించి ప్రియురాలికి శిరోముండనం
కొయ్యూరు : సహజీవనం చేస్తున్న ప్రియుడే అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. డబ్బు తెమ్మని వేధిస్తూ... అంగీకరించని ప్రియురాలిని బంధించి శిరోముండనం చేశాడు. ఎస్ఐ తెలిపిన కథనం ప్రకారం... బంగారంపేట పంచాయతీ గుజ్జువానిపాలేనికి చెందిన కూడా లోవ దుర్గ, శరభన్నపాలేనికి చెందిన సంపర బాలకుమార్ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ శరభన్నపాలెంలో సహజీవనం చేస్తున్నారు. కొన్ని నెలలుగా బాలకుమార్ తరచు డబ్బులు తెమ్మని దుర్గను వేధించేవాడు. దీంతో ఆమె సర్పంచ్ దృష్టికి సమస్యను తీసుకెళ్లింది. ఇది మంచి పద్దతి కాదని సర్పంచ్ సహా పెద్దలు కుమార్‌కు హితవు పలికారు. దీన్ని మనసులో పెట్టుకున్న కుమార్ ఆమెను మరింత వేధించటం మొదలుపెట్టాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగటంతో ఆగ్రహించిన కుమార్....దుర్గ కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి బ్లేడుతో శిరోముండనం చేశాడు. దీనిపై బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.