Gurugram Teen Stabbed To Death By Ex-Fiance, Video Viral - Sakshi
Sakshi News home page

వీడియో: ప్రేమ పెళ్లితో ఒక్కటవుదామనుకున్నారు.. ఆమె నో చెప్పడంతో..

Published Mon, Jul 10 2023 6:58 PM | Last Updated on Mon, Jul 10 2023 7:35 PM

Gurugram Teen Stabbed To Death By Ex-Fiance Video Viral - Sakshi

గురుగ్రామ్‌: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. ఈ విషయం పెద్దలకు చెప్పడంతో వారి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించి ముహుర్తం ఫిక్స్‌ చేశారు. ఈ క్రమంలో నిశ్చితార్థం కూడా చేసి ఘనంగా పెళ్లికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో.. అతడితో పెళ్లికి ఆమె నో చెప్పింది. దీంతో, ఆవేశానికి గురైన లవర్‌.. యువతిని దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వివరాల ప్రకారం.. యూపీలోని బదౌన్‌కు చెందిన రాజ్‌కుమార్‌(23), నేహా(19) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం పెద్దలకు చెప్పడంతో వారి పెళ్లికి అంగీకరించారు. ఈ క్రమంలో పెళ్లికి ముహుర్తం ఫిక్స్‌ చేసి ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిపించారు. అయితే, సడెన్‌గా ఏమైందో తెలియదు కానీ.. నేహా.. రాజ్‌తో పెళ్లికి నో చెప్పింది. దీంతో, నేహాను రాజ్‌ వేధించడం మొదలుపెట్టాడు. తనను పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానంటూ పలుమార్లు బెదిరించాడు. కానీ ఆమె ఇవేమీ పట్టించుకోలేదు.

దీంతో, ఆమెపై రగిలిపోయిన రాజ్‌కుమార్‌ తనను చంపేందుకు ప్లాన్‌ చేశాడు. ఈ క్రమంలో సోమవారం నేహా తన తల్లితో కలిసి బయటకు వచ్చింది. ఈ సందర్భంగా వారిని అడ్డగించిన రాజ్‌.. ఆమెతో మాట్లాడాలంటూ దగ్గరి వచ్చాడు. ఏదో మాట్లాడుతున్నట్టు నటించి.. తన వద్ద ఉన్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆమె కడుపులో, మెడపై కత్తితో ఇష్టమొచ్చినట్లు దాడి చేశాడు. దీంతో నేహా అక్కడికక్కడే మృతి చెందింది. 

ఇక, నేహాపై రాజ్‌ దాడి చేస్తున్న సమయంలో ఆమె తల్లి పక్కనే ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయింది. ఆ సమయంలో అక్కడ చాలా మందే ఉన్నారు. అయితే అతడి చేతిలో కత్తిని చూసి వారంతా భయంతో పరుగులు పెట్టారు. అనంతరం.. నేహా తల్లి రాజ్‌ను చెప్పులతో కొడుతూ ఆవేదనకు లోనైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా తనతో పెళ్లికి నిరాకరించినందుకే ఆమెను చంపేసినట్ల నిందితుడు రాజ్ కుమార్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. 

ఇది కూడా చదవండి: బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి మిస్సింగ్‌ కలకలం

షాకింగ్‌ వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement