
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమికుల దినోత్సవం రోజున అమానుష ఘటన వెలుగుచూసింది. ప్రేమ పేరుతో వేధించి యువతిపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు ప్రేమోన్మాది. దీంతో, వెంటనే బాధితురాలిని మదనపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చికిత్స అందిస్తున్నారు.
వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లెకు చెందిన గౌతమి(23)పై ప్రేమోన్మాది గణేష్ యాసిడ్ దాడి చేశాడు. ఆమె తలపై కత్తితో పొడిచి ముఖంపై యాసిడ్ పోశాడు. దీంతో, బాధితురాలు విలవిల్లాడిపోయింది. ఈ క్రమంలో వెంటనే ఆమెను మదనపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇటీవలే గౌతమికి పెళ్లి నిశ్చయం అయ్యింది. రాబోయే ఏప్రిల్ 29న ఆమెకు పీలేరు జగన్ కాలనీకి చెందిన శ్రీకాంత్‌తో పెళ్లివివాహం జరగనుంది. ఈ నేపథ్యంలోనే గౌతమి పెళ్లిపై గణేష్ రగిలిపోయాడు. అనంతరం, ఈరోజు దాడికి పాల్పడ్డారు.
గౌతమి మదనపల్లెలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి మదనపల్లె పట్టణం కదిరి రోడ్డులో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. ఇక, నిందితుడిని మదనపల్లె అమ్మచెరువుమిట్టకు చెందినట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గౌతమి వద్దకు జడ్జీ వెళ్లి బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment