
చెన్నై: ప్రియురాలిపై కోపంతో ఆమె కుమారుడిని ఎత్తుకెళ్లి గుండు కొట్టించాడు ఓ వ్యక్తి. చెన్నైలో జరిగిన ఈ ఘటన వివరాలివీ.. కొరుక్కుపేట కామరాజర్ నగర్‌కు చెందిన మునియప్పన్ (30) భార్య సరస్వతి(26)తో విభేదాలు రావటంతో మూడేళ్ల క్రితం భార్య, ఇద్దరు పిల్లలను వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. కొంతకాలం తర్వాత సరస్వతికి అదే ప్రాంతానికి చెందిన ఆనందరాజ్(25)తో సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈనెల 15వ తేదీ మద్యం మత్తులో వచ్చిన ఆనంద్‌రాజ్ సరస్వతిని కోరిక తీర్చమని అడిగాడు. ఆమె నిరాకరించడంతో కుమార్తెను పంపమని బలవంతపెట్టాడు.
దీంతో భయపడిపోయిన సరస్వతి కుమార్తెను తీసుకుని బంధువుల ఇంట్లో ఉంచి తిరిగి ఇంటికి వచ్చింది. తిరిగొచ్చేసరికి ఇంట్లో కుమారుడు కనిపించకపోవడంతో ఆర్‌కే నగర్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా.. సరస్వతి కుమారుడిని ఆనంద్‌రాజ్ కిడ్నాప్ చేసి గుండు కొట్టించి దాచి పెట్టినట్టు గుర్తించారు. దీంతో పోలీసులు అతడి ఇంటి నుంచి చిన్నారిని రక్షించారు. ఆనంద్‌రాజ్‌ను అరెస్టు చేసి జార్జ్‌టౌన్ న్యాయస్థానంలో హాజరుపరిచి పుళల్ జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment