రెండు సన్నివేశాల కోసం.. | actress poorna sacrifice her hair for kodi veeran movie | Sakshi
Sakshi News home page

రెండు సన్నివేశాల కోసం..

Published Tue, Oct 17 2017 7:40 PM | Last Updated on Tue, Oct 17 2017 7:58 PM

poorna

సాక్షి, తమిళ సినిమా: పాత్రల కోసం బరువు తగ్గడం, పెరగడం కోసం తారలు శ్రమిస్తుంటారు. అదీ చాలా తక్కువ మందే. అలాంటిది తమ జుత్తు త్యాగం చేయడానికి ముఖ్యంగా నటీమణులు ససేమిరా అంగీకరించరు. అలాంటిది నటి పూర్ణ కొడివీరన్‌ చిత్రం కోసం, అదీ హీరోయిన్‌ పాత్ర కోసం కూడా కాదు, ఒక ముఖ్య పాత్ర కోసం గుండు గీయించుకుని నటించింది. కథానాయకి పాత్రలే కావాలని పట్టుపట్టకుండా కొత్తదనం ఉంటే ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ అంటున్న నటి పూర్ణ.. కొడివీరన్‌ చిత్రంలో ఒక వైవిధ్యభరిత పాత్రలో కనిపించనుంది. శశికుమార్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కొడివీరన్‌. మహిమానంబీయార్‌ కథానాయకిగా నటించిన ఇందులో శశికుమార్‌కు చెల్లెలుగా నటి సనూజ నటించింది.

నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అవుతున్న ఈ చిత్రం గురించి శశికుమార్‌ తెలుపుతూ అన్నాచెల్లెలి అనుబంధంతో కూడిన కథా చిత్రంలో నటించాలన్నది తన చిరకాల కోరిక అని చెప్పారు. ఇదే విషయాన్ని కుట్టిపులి చిత్ర షూటింగ్‌ సమయంలో దర్శకుడు ముత్తయ్యకు చెప్పానన్నారు. అలాంటి కథా చిత్రమే ఈ కొడివీరన్‌ అని చెప్పారు. ఇందులో నటి పూర్ణది కథానాయకి పాత్ర కాకపోయినా చాలా కీలక పాత్ర అని చెప్పారు. రెండు సన్నివేశాల కోసం ఆమె గుండు కొట్టించుకుని జుత్తును త్యాగం చేసిందని చెప్పారు. ఈ చిత్రంలో ప్రతినాయకుడంటూ ఎవరూ ఉండరనీ, పరిస్థితులు, కొన్ని పాత్రల తప్పుడు నిర్ణయాలే విలన్‌ అవుతాయన్నారు. శివాజీగణేశన్‌ నటించిన పాశమలర్‌ చిత్రం మాదిరిగా కొడివీరన్‌ చిత్రం అన్నాచెల్లెలి అనుబంధాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందని ఆయన తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement