ఓ మై గాడ్!
రోడ్డును ఆక్రమించారంటూ నోటీసులు
భింద్ : మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో రోడ్డును ఆక్రమించారంటూ ఆంజనేయస్వామికి నోటీసులు జారీ చేశారు మున్సిపల్ అధికారులు. బజారియాలో రోడ్డు పక్కనే హనుమంతుడి గుడి ఉంది. రోడ్డు స్థలం కొంచెం ఆలయ ప్రాంగణంలో ఉండడంతో నోటీసులిచ్చారు. అయితే గుడి పూజారికో లేదా ఆలయ ట్రస్టీకో బదులు ఏకంగా దేవుడి పేరుతోనే నోటీసులు జారీ చేశారు. ‘హనుమాన్ దేవుడా? మీరు చట్టవిరుద్ధంగా రోడ్డును ఆక్రమించారు.
ప్రమాదాలకు ఆస్కారమిస్తోంది. ఆక్రమించిన స్థలం నుంచి వెనక్కి వెళ్లాలని గ్వాలియర్ హైకోర్టు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు. మీపై కోర్టు ధిక్కరణ కేసు కూడా పెట్టాం’ అని నోటీసులో పేర్కొన్నారు. స్థానికులు మండిపడ్డంతో అధికారులు నాలిక్కరుచుకున్నారు. పొరపాటున దేవుడి పేరుతో ఇచ్చామని, నోటీసులను వెనక్కి తీసుకుంటామన్నారు.