అంతిమయాత్రకు తరలివచ్చిన నేతలు, అభిమానులు
మంచిర్యాల టౌన్/ శ్రీరాంపూర్ : మంచిర్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ కృష్ణారావు (63) శనివారం అర్ధరాత్రి సిద్దిపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. సోమవారం ఆయన స్వగ్రామం నస్పూర్‌లో అంత్యక్రియలు జరిగాయి.ఆయన నివాస గృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమై మూడు కిలోమీటర్లలో దూరంలోని గోదావరి తీరంవరకు కొనసాగింది. కృష్ణారావు కుమారుడు సత్యనారాయణ తండ్రి చితికి నిప్పంటించాడు.
కడసారి చూసేందుకు...
కృష్ణారావు అభిమానులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, మంచిర్యాల, సీసీసీ, నస్సూర్ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఆయన స్వగృహానికి వచ్చి పార్థీవదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. పార్లమెంటరీ కార్యదర్శి, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, ఎమ్మెల్సీ వెంకట్రావ్, మాజీ మంత్రి జి.వినోద్, కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు పురాణం సతీశ్‌కుమార్, డీసీసీ మాజీ అధ్యక్షుడు రాంచందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు బేర సత్యనారాయణ, రాజేశ్, రాజేంద్రపాణి, కిష్టయ్య, శంకర్, తిరుపతి, సరోజ, శ్యాంసుందర్‌రావు, మల్లారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మామిడిశెట్టి వసుంధర, వైస్ చైర్మన్ నల్ల శంకర్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది రాజకీయ, వ్యాపార, వాణిజ్య రంగాల ప్రముఖులు, న్యాయవాదులు, వైద్యులు, విద్యా సంస్థల యజమానులు పాల్గొన్నారు.
కృష్ణారావు సతీమణికి పరామర్శ..
కృష్ణారావు భార్య 18వ వార్డు కౌన్సిలర్ మంజు ల కూడా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయప డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికి త్స పొంది ఆదివారం వేకువ జామున నస్పూర్‌కు వచ్చారు. అప్పటివరకు ఆస్పత్రిలోనే ఉన్న మంజుల భర్త మరణం తెలియడంతో కుప్పకూలింది. బంధువులు, శ్రేయోభిలాషులు, అభిమానులు మంజులను ఓదార్చారు. కృష్ణారావు దంపతులకు కుమారుడు సత్యనారాయణరావు, కుమార్తె హిమబిందు ఉన్నారు.
కృష్ణారావుకు కన్నీటి వీడ్కోలు
Published Tue, Feb 10 2015 4:49 AM | Last Updated on Tue, Oct 16 2018 6:44 PM
Advertisement
Advertisement