లద్దాఖ్‌లో ఐఏఎఫ్‌ అపాచీ హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌ | IAF helicopter Apache helicopter makes emergency landing in Ladakh | Sakshi
Sakshi News home page

లద్దాఖ్‌లో ఐఏఎఫ్‌ అపాచీ హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌

Published Thu, Apr 4 2024 4:52 PM | Last Updated on Thu, Apr 4 2024 5:56 PM

IAF helicopter Apache helicopter makes emergency landing in Ladakh - Sakshi

భారత వైమానిక దళానికి  చెందిన అపాచీ హెలికాప్టర్‌ అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. దీంతో హెలికాప్టర్ దెబ్బతింది. లాద్దాఖ్‌లో కొండచరియలు, ఎత్తైన ప్రదేశాల కారణంగా చాపర్ దెబ్బతినడంతో ముందు జాగ్రత్తగా ల్యాండింగ్ చేసినట్లు ఐఏఎఫ్‌ తెలిపింది. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.

లడఖ్ ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ (AOR)లో ఎత్తైన ప్రదేశాల వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి శిక్షణ ఇచ్చే సమయంలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. హెలికాప్టర్‌ను సమీపంలోని వాయుసేన స్థావరానికి చేర్చారు. ఈ ఘటనపై  భారత వైమానిక దళం కోర్టు విచారణకు ఆదేశించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement