
బోటు ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు..
నాగ్పుర్ :
మహారాష్ట్రాలో విషాదం చోటు చేసుకుంది. బోటు బోల్తా పడిన దుర్ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ఏడుగురు గల్లంతయ్యారు. నాగ్పుర్కు 25 కిలోమీటర్ల దూరంలో అమరావతి రోడ్డు సమీపంలోని వెనా డ్యాంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు.. ఎనిమిది యువకులు కలిసి పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడానికి బోటు షికారుకు వెనా డ్యాంకు వెళ్లారు. ముగ్గురు బోటు సిబ్బందితో కలిసి ఆదివారం సాయంత్రం బోటు షికారుకు వెళ్లారు. డ్యాం మధ్యలోకి చేరుకోగానే ప్రమాదవశాత్తు బోటు బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతిచెందగా, ఏడుగురి ఆచూకీ గల్లంతయ్యింది. ముగ్గురురిని రెస్క్యూ సిబ్బంది కాపాడగలిగింది. ఏడుగురి కోసం రెస్యూసిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తోందని నాగ్పుర్ రూరల్ అడిషనల్ ఎస్పీ సురేష్ బోయట్ తెలిపారు.
కాగా, బోటు ప్రమాదానికి గురికావడానికి కొద్దిక్షణాల ముందు యువకులు కేరింతలు కొడుతూ సరదాగా గడుపిన ఓ వీడియోను పోలీసులు వెల్లడించారు. బోటులో ఉన్న ఓ యువకుడు తన ఫేస్ బుక్ అకౌంట్ నుంచి ఫోన్ సహాయంతో లైవ్ టెలీకాస్ట్ చేశాడు. మిత్రులందరూ కలిసి బోటులో ఆనందంగా గడుపిన కొద్దిసేపటికే ఈ దుర్ఘటన చోటుచేసుంకుంది.