జెనీవా: ఇంటాబయటా పెరిగిపోతున్న వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 6 లక్షల మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఆరోగ్యం–వాయు కాలుష్యం ప్రభావం’పై త్వరలో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సు నేపథ్యంలో రూపొందించిన ఈ నివేదికను డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టీఏ ఘెబ్రెయ్‌సస్ వెల్లడించారు. ఆ వివరాలు. నిత్యం 15 ఏళ్లలోపు పిల్లలలో 93 శాతం మంది 180 కోట్ల మంది, వీరిలో 63 కోట్ల మంది ఐదేళ్లలోపు బాలలు కలుషిత గాలిని పీలుస్తున్నారు. ఫలితంగా శ్వాసకోశ వ్యాధులకు గురై 2016లో దాదాపు 6 లక్షల మంది చిన్నారులు చనిపోయారు. ప్రతి పది మందిలో 9 మంది కలుషిత గాలినే పీలుస్తున్నారు. దీని కారణంగా ఏటా 70 లక్షల గర్భస్థ శిశు మరణాలు సంభవిస్తున్నాయి. ఐదేళ్లలోపు చనిపోయే ప్రతి పది మంది శిశువుల్లో ఒకరు వాయు కాలుష్యం కారణంగానే చనిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment