encephalitis
-
ఆదుకుంటేనే ఆయువు
ప్రకాశం: నేరుగా ఆహారం, శ్వాస తీసుకోలేదు. ముక్కులో పైపుల సహాయంతో ద్రవాహారం, శ్వాస తీసుకునేందుకు గొంతులో పైపులు వేశారు. ఏడాదిగా మంచానికే పరిమితమై వైద్యం చేయించుకునే స్థోమతలేక దాతల సాయం కోసం ఎదురుచూస్తోందా బాలిక. మర్రిపూడి మండలం జువ్విగుంట గ్రామ ఎస్సీకాలనీకి చెందిన పల్లెపోగు దావీదు, సునీతలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నలుగురు సంతానంలో మూడో కుమార్తె అయిన పల్లెపోగు మనీషా మండలంలోని తంగెళ్ల హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. మంచి మెరిట్ కలిగిన విద్యార్థి అయిన మనీషాకు ఓ రోజు జ్వరం వచ్చింది. బంధువులు వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు అనంతరం వైద్యులు ఆమెకు మెదడువాపు ఉన్నట్లుగా గుర్తించారు. ఆపరేషన్ చేస్తేనే అమ్మాయి బతికేది. లేకపోతే చనిపోతుందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లారు. రోజువారి కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చిపడింది. ఏం చేయాలో తోచని పరిస్థితిలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తిరుపతిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో మనీషాకు చికిత్స చేయించారు. మెదడులో వాపు తగ్గితే తప్ప ఆపరేషన్ చేయలేమని చెప్పడంతో మూడు నెలల పాటు ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స చేశారు. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఇచ్చిన రూ.5 లక్షలతో పాటు వారి సొంత డబ్బులు మరో రూ.5 లక్షలు ఖర్చుచేసినా పూర్తిగా కోలుకోలేదు. అప్పటికే ఆరోగ్యశ్రీ పరిధి దాటిపోవడంతో గత్యంతరం లేక ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఏడాది నుంచి మందులు వాడుకుంటూ నెట్టుకొస్తున్నారు. మనీషా ముక్కులో పైపుల సహాయంతో ఆహారాన్ని ద్రవ రూపంలో అందజేస్తున్నారు. శ్వాస తీసుకునేందుకు గొంతులో పైపులు వేశారు. కుమార్తెకు నెలకు వైద్యానికి రూ.15 వేలు ఖర్చవుతున్నాయని తల్లి సునీత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచం పట్టిన మనీషాకు ఆర్థిక సహాయం చేయాలని తల్లిదండ్రులు దాతలను కోరుతున్నారు. ఏడాది నుంచి మంచంలో ఉన్న మనీషాను ఎడమ కన్నులోపించి పాక్షికంగా అంధురాలైన అక్క అనూషా అన్ని తానై సపర్యలు చేస్తూ దగ్గరుండి మరీ చూసుకుంటోంది. అప్పుచేసి ఇప్పటి వరకు దాదాపు రూ.3 లక్షలు వరకు ఖర్చు చేశామని, అయినా తన బిడ్డ కోలుకోలేదని తల్లి సునీత కంటనీరు పెట్టింది. చిన్న కుమార్తె కోసం పెద్ద కూతురు అనూషా డిగ్రీ మధ్యలోనే ఆపివేసిందని తెలిపింది. మంచం పట్టిన మనీషాకు ఆర్థిక సహాయం చేసి, పాక్షికంగా అంధురాలైన నా పెద్ద కుమార్తె అనూషాకు వికలాంగ సర్టిఫికెట్ అందజేసి పింఛన్ మంజూరు చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఆర్థిక సహాయం చేయదలచిన దాతలు సెల్‌నంబర్ 6302575798 ను సంప్రదించగలరని వారు కోరారు. -
తెలియకుండానే ప్రాణాంతకమయ్యే మెదడు వ్యాధులు.. డాక్టర్ల సూచనలివే!
లబ్బీపేట (విజయవాడ తూర్పు): శరీరంలో అతి ముఖ్యమైనది మెదడు. దాని పనితీరు బాగుంటేనే ఎవరైనా చురుగ్గా పనిచేయగలుగుతారు. ఇటీవలి కాలంలో మెదడుకు సోకుతున్న వ్యాధులు పెరిగాయి. ముఖ్యంగా పలు రకాల ఎన్‌సెఫలైటీస్‌లతో రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. అలా వస్తున్న వారిలో ఆటో ఇమ్యూన్ ఎన్సెఫలైటీస్, హెర్పిస్ ఎన్సెఫలైటీస్, జపనీస్ ఎన్‌సెఫలైటీస్‌లతో పాటు, రెసిస్టెన్స్ ఎపిలెప్సీ, అటాక్సియా వంటి సమస్యలతో వస్తున్న వారు ఎక్కువగా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాతే ఆస్పత్రులకు వస్తున్నట్లు వైద్యులు చెపుతున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రికి నెలకు 20 నుంచి 30 మంది మెదడు సంబంధిత సమస్యలతో వస్తుండగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో సైతం ఇటీవల ఈ కేసులు ఎక్కువ వస్తున్నట్లు వైద్యులు చెపుతున్నారు. ప్రస్తుతం మంచి మందులు అందుబాటులో ఉన్నాయని, సకాలంలో ఆస్పత్రిలో చేరితే ప్రాణాపాయం లేకుండా బయట పడవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల సోకుతున్న ఎన్సెఫలైటీస్లు, వాటి లక్షణాలు, చికిత్సలు ఇలా.. ఆటోఇమ్యూన్ ఎన్సెఫలైటీస్ శరీరంలోని యాంటీబాడీస్ ఒక్కోసారి కండరాలతో పాటు మెదడుపై ప్రభావం చూపుతాయి. దీంతో ఫిట్స్ రావడం, స్పృహ కోల్పోవడం జరుగుతుంది. ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్స్ సోకిన వారు, కొన్ని రకాల క్యాన్సర్లు ఉన్న వారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పలు రకాల కీళ్లవాతం సమస్యలు, ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఈ వ్యాధి రావచ్చు. ఇది సోకిన వారికి మొదటి స్టెరాయిడ్స్, ఇమ్యునోగ్లోబ్యులిన్ ఇంజక్షన్స్‌తో పాటు, అవసరమైతే డయాలసిస్ చేసి యాంటీబాడీస్‌ను అదుపుచేస్తారు. ప్రస్తుతం ఈ వ్యాధికి మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. హెర్పిస్ ఎన్సెఫలైటీస్ ఇది హెర్పిస్ వైరస్ కారణంగా సోకే తీవ్రమైన మెదడు వాపు జబ్బు. పిల్లలు, పెద్దలు ఎవరికైనా రావచ్చు. తీవ్రమైన జ్వరంతో ప్రారంభమై, ఫిట్స్ రావడం, 24 గంటల్లోనే స్పృహ కోల్పోవడం జరుగుతుంది. దీనిని వెంటనే గుర్తిస్తే నయం చేసేందుకు మంచి మందులు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. వ్యాధి సోకితే కోలుకోవడానికి వారం నుంచి పదిరోజులు పడుతుంది. తొలిదశలో గుర్తించకపోతే ఒక్కోసారి ప్రాణాపాయం కూడా ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. అటాక్సియా ఇది సోకిన వారు నడిచేటప్పుడు, నిల్చున్నప్పుడు బ్యాలెన్స్ తప్పుతుంటారు. నడవడం కష్టంగా మారుతుంది. పిల్లలు, పెద్దవారిలో ఎవరికైనా రావచ్చు. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, జన్యు లోపం, క్రోమోజోముల్లో తేడాలతో ఈ వ్యాధి సోకుతుంది. కొందరిలో పుట్టుకతోనే ఈ రకమైన జన్యుపరమైన లోపం ఉంటుంది. దీనిని గుర్తించి చికిత్స పొందితే నయం చేయవచ్చు. రెసిస్టెన్స్ ఎపిలప్సీ సరిగా మందులు వాడని ఫిట్స్ రోగులకు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ఈ వ్యాధి సోకిన వారికి మెదడు మొద్దుబారిపోవడంతో మందులు సరిగా పనిచేయక ఫిట్స్ వెంట వెంటనే వచ్చేస్తుంటాయి. మందులు వేసినప్పటికీ పనిచేయవు. స్పృహ కూడా కోల్పోవచ్చు. ఇలాంటి వారికి ఎక్కువ సమయం పనిచేసే మందులు ఇస్తారు. బ్రెయిన్ స్కాన్ చేసి, మెదడు ఎంత వరకు డ్యామేజీ అయిందో నిర్ధారిస్తారు. అవసరమైతే శస్త్ర చికిత్స కూడా చేస్తారు. అందువలన ఫిట్స్ ఉన్న వారు క్రమం తప్పకుండా మందులు వాడటం మంచిది. చికిత్సతో నయం చేయొచ్చు ఇటీవల ఎన్సెఫలైటీస్ రోగులు తరచూ వస్తున్నారు. ప్రభుత్వాస్పత్రి ఓపీకి నెలలో 20 మందికి పైగా ఇలాంటి రోగులు వస్తున్నారు. తీవ్రమైన జ్వరంలో ఫిట్స్ రావడం, మాట కోల్పోవడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలతో వస్తున్నారు. వారు ఏ రకమైన ఎన్సెఫలైటీస్తో బాధపడుతున్నారో ముందుగా నిర్ధారించి చికిత్స చేస్తున్నాం. మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్‌కు తొలుత స్టెరాయిడ్స్ ఇచ్చి, తగ్గకుంటే ఇమ్యునోగ్లోబ్యులిన్ ఇంజక్షన్స్ ఇస్తాం –డాక్టర్ దారా వెంకటరమణ, న్యూరాలజీ విభాగాధిపతి, విజయవాడ ప్రభుత్వాస్పత్రి -
అయ్యో పాపం.. నిద్ర లేచేసరికి గతం మర్చిపోయింది!
జలుబు చేయడంతో ఓ మహిళ రాత్రి త్వరగా నిద్రలోకి జారుకుంది. ఉదయం ఆలస్యంగా నిద్ర లేచింది. అందులో ఏముంది అనుకుంటున్నారా? పడుకొని లేచేసరికి ఆమె తన గతం మర్చిపోయింది. ఇంగ్లండ్‌కు చెందిన క్లైర్ మఫ్ఫెట్ రీస్ అనే మహిళ 2021లో ఓ రోజు తీవ్రంగా జలుబు చేయడంతో త్వరగా నిద్రలోకి జారుకుంది. అయితే పొద్దునలేచేసరికి ఆమె కోమాలోకి వెళ్లింది. సుమారు16 రోజులు కోమాలోనే ఉండిపోయింది. కోమా నుంచి బయపడిన ఆమె దాదాపు 20 ఏళ్ల జ్ఞాపకాలను మర్చిపోయింది. ఇద్దరు పిల్లలు ఉన్న క్లైర్ మఫ్ఫెట్కు మెదడువాపు వ్యాధి సోకడంతో తన గతం మర్చిపోయినట్లు ఆమె భర్త స్కాట్ చెప్పాడు. ఫిబ్రవరి 22న ప్రపంచ మెదడు వ్యాపు వ్యాధి దినోత్సవం రోజున క్లైర్ మఫ్ఫెట్ తనకు జరిగిన ఈ ఘటనను వెల్లడించింది. Tomorrow marks World Encephalitis Day, so catch me and @Chipfatinasock on @PackedLunchC4 to raise awareness of encephalitis and how serious it is#worldencephalitisday #red4wed #theencephalitissociety #encephalitis #abi #acquiredbraininjury #stephspackedlunch #channel4 pic.twitter.com/33VXkBiF5y — Claire Muffett-Reece (@MrsMuffettReece) February 21, 2022 రెండు వారాల నుంచి ఆమెకు జలుబు ఉంది. తర్వాత ఆమె ఆరోగ్యం కూడా క్షిణించినట్లు స్కాట్ గుర్తించాడు. జలుబుతో పడుకున్న క్లైర్ మఫ్ఫెట్ పొద్దున నిద్రలేవలేదని.. అస్వస్థతకు గురైనట్లు కనిపించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. కోమాలోకి వెళ్లిన ఆమెకు వెంటిలేటర్ అమర్చి వైద్యులు చికిత్స అందించారు. అయితే వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఆమెకు మెదడువాపు వ్యాధి సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. "I woke up and had forgotten the past 20 years - I couldn't remember my kids' birthdays" Great article from Claire - a member of @encephalitis - who shares her story in @TheSun Read now 👉 https://t.co/DnHrINxWMa pic.twitter.com/OUlZ5veovX — Encephalitis Society (@encephalitis) January 24, 2022 క్లైర్ మఫ్ఫెట్ మాట్లాడుతూ.. ‘నేను దాదాపు 20 ఏళ్ల జ్ఞాపకాలను మర్చిపోయాను. అయితే అదృష్టవశాత్తు నాకు పిల్లలు ఉన్నారన్న విషయం గుర్తుంది. కానీ, వారికి నేను జన్మనిచ్చినట్టు, వారి పుట్టినరోజులు, అభిరుచులు, మొదటిసారిగా వారిని స్కూల్‌కు తీసుకెళ్లిన విషయాలు మర్చిపోయాను’ అని తెలిపింది. అయితే మరో అదృష్టకరమైన విషయం ఏమిటంటే.. తాను తన భర్తను మర్చిపోలేదని తెలిపారు. అలా జరిగి ఉంటే ఎలా ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. కొన్ని జ్ఞాపకాలు మర్చిపోయినా తను ప్రస్తుతం సంతోషంగా ఉన్నానని తెలిపింది. -
ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం: ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: 2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా అవతరించడమే కేంద్రం లక్ష్యమని ప్రధాని నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. ఇది ఒక్కరి శ్రమతో నిజమయ్యే కల కాదని, నిర్మాణాత్మక సలహాలు సూచనలు అందించాలని రాజకీయపక్షాలకు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయాన్ని ఓ బాధ్యతగా స్వీకరించినట్టు మోదీ తెలిపారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్ మంత్రానికి దేశప్రజలు సబ్ కా విశ్వాస్ను చేర్చారని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హామీఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలూ కీలకమేనన్న మోదీ.. విపక్షాలు వ్యతిరేకించాలే కాని అడ్డుకోకూడదని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే అంశంలో కేంద్రం పట్టుదలతో కనిపిస్తోంది. ఒక దేశం ఒకే ఎన్నిక కోసం మరోసారి ప్రధాని మోదీ తన గళం వినిపించారు. దీనిపై కూలంకషంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు రాజ్యసభలో సమాధానమిచ్చిన మోదీ.. ఎన్నికల్లో సంస్కరణలు కొనసాగాల్సిందేనని స్పష్టంచేశారు. జమిలిఎన్నికల కారణంగా ప్రాంతీయపార్టీలు నష్టపోతాయన్న వాదనను ప్రధాని తప్పుపట్టారు. ఈవీఎంలపై విపక్షాలు చేస్తున్న రాద్ధాంతాన్ని రాజ్యసభలో ప్రస్తావించారు ప్రధాని మోదీ. పార్టీని గెలిపించుకునే సత్తా, సామర్థం లేక ఓటింగ్ యంత్రాలపై నెపం మోపుతున్నారని చురకలు అంటించారు. ఇద్దరు సభ్యులతో లోక్‌సభకు వచ్చినప్పుడు కూడా బీజేపీ ఇలాంటి ఆరోపణలు చేయలేదన్నారు. ఈవీఎంలతో దేశంలో ఇప్పటివరకు 4 సాధారణ, పలు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని మోదీ గుర్తుచేశారు. ఇంకా చాలా ఎన్నికలున్నాయని, దమ్ముంటే ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంకావాలని విపక్షాలకు సవాల్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన కాంగ్రెస్‌ని ప్రధాని మోదీ కడిగిపారేశారు. ఎన్నికల్లో పరాజయాన్నిఆ పార్టీ అంగీకరించలేకపోతోందని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచినా దేశం ఓడిపోయిందన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశం ఓడిపోతే వయనాడ్, రాయ్‌బరేలీల్లో ఎవరు గెలిచారని నిగ్గదీశారు. అహంకారానికి కూడా ఓ హద్దుంటుందని కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు మోదీ. జార్ఖండ్‌లో మైనార్టీ యువకుడిపై మూకదాడి ఘటనను ప్రధాని మోదీ ఖండించారు. ఈ సంఘటన తనను ఎంతో బాధించిందన్నారు. అయితే జార్ఖండ్ మూకదాడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్న విపక్షాల విమర్శలను ఆయన తప్పుబట్టారు. ఒక ఘటన కోసం యావత్ రాష్ట్రాన్ని నిందించడం సరికాదని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా నెలకొన్న కరవు పరిస్థితులపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. 226 జిల్లాలు నీటి సంక్షోభం ఎదుర్కొంటున్నాయని... దీనిని పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నీటి కొరత భవిష్యత్ తరాలకు ఇబ్బందకరంగా మారకుండా చూసేందుకు ఎంపీలంతా కేంద్రానికి సహకారం అందించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తిచేశారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మెదడువాపు వ్యాధి కారణంగా పెద్ద ఎత్తున చిన్నారులు మృతిచెందిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలిసారి మౌనాన్ని వీడారు. బిహార్‌లో జరిగిన ఈ ఘటనను తనను ఎంతగానో బాధించిందని, ఆందోళనకు గురిచేసిందని పేర్కొన్నారు. అయితే, ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు బిహార్‌కు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు. పేదలకు వైద్యచికిత్స అందించేందుకు ఉద్దేశించి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మరింత బలోపేతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని, నిరుపేదలకు ఉత్తమమైన, మెరుగైన వైద్య చికిత్స అందజేయాలని తమ ప్రభుత్వం కోరుకుంటున్నదని తెలిపారు. -
చిన్నారుల మృత్యువాతపై సుప్రీం దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మెదడు వాపు వ్యాధి కారణంగా 150కి పైగా చిన్నారులు మృత్యువాత పడటంపై సుప్రీంకోర్టు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు, పోషకాహారం, పారిశుద్ధ్యం, పరిశుభ్రత పరిస్థితులు ఎలా ఉన్నాయో చెబుతూ వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని బిహార్ ప్రభుత్వంతోపాటు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. బిహార్‌లో మెదడువాపు వ్యాధి కారణంగా పెద్ద సంఖ్యలో చిన్నారులు మృత్యువాత పడటంపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రాష్ట్రంలో వైద్య సదుపాయాలు, పోషకాహారం, పారిశుద్ధ్యం వంటి వాటిపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. తక్షణమే ఈ సదుపాయాలను ఏర్పాటు చేయాల్సిందిగా పిటిషన్లో పేర్కొన్నారు. ఈ వ్యాధిని అరికట్టేందుకు బిహార్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవట్లేదంటూ ఇద్దరు న్యాయవాదులు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. వాదనల సందర్భంగా.. గతంలోనూ ఇలాంటి మరణాలే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్నాయని పిటిషనర్లలో ఒకరైన న్యాయవాది మనోహర్ తెలపగా.. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఈ మరణాలకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, ఇలాంటి మరణాలు ప్రతి ఏటా సంభవిస్తున్నా.. పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. బిహార్‌లో మరణించిన చిన్నారులకు రూ.10 లక్షలు పరిహారం అందజేయాలని కోరారు. చిన్నారులు మరణించిన ముజఫర్‌పూర్ సహా ఇతర ప్రాంతాలకు వైద్య నిపుణులతో కూడిన ప్యానల్‌ను కేంద్రం ఏర్పాటు చేయాలని తెలిపారు. వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న ప్రాంతాలకు 100 మొబైల్ ఐసీయూ యూనిట్లను పంపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై వారంలోగా సమాధానమివ్వాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను 10 రోజులపాటు వాయిదా వేసింది. -
చిన్నారుల మరణం; వైద్యుడిపై వేటు
పాట్నా: బిహార్‌లోని ముజఫర్‌పూర్ శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో (ఎస్‌కెఎంసిహెచ్) చేరిన 109 మంది పిల్లలు మరణించిన సంగతి తెలిసిందే. మెదడువాపు వ్యాధితో ఆస్పత్రిలో చేరిన వీరికి సరైన చికిత్స అందించకుండా పిల్లల మరణాలకు కారణమైన సీనియర్ రెసిడెంట్ డాక్టర్ భీమ్సేన్ కుమార్‌ను సస్పెండ్ చేశారు. తాజాగా అక్కడి పరిస్థితుల మీద అధ్యయనం చేయడానికి వైద్యారోగ్య శాఖ జూన్ 19న పట్నా మెడికల్ కాలేజీకి చెందిన పిల్లల వైద్యుడిని నియమించింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మెదడువాపు వ్యాధి వల్ల 145 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోవడంపై నితీశ్‌కుమార్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ముంబైకి చెందిన వాలంటీర్ డాక్టర్ రవికాంత్ సింగ్ మాట్లాడుతూ.. 'బిహార్‌లో ఉన్న పేదరికం కారణంగా ఎంతో మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. పోషకాహారలేమి, సరైన వైద్య సదుపాయం, పరిశుభ్రత లేకపోవడం వల్ల డాక్టర్లు వ్యాధులను నయం చేయలేకపోతున్నారు' అని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో మార్పు, వ్యాధులపై అవగాహన రానిదే తామేమీ చేయలేమని కేజ్రీవాల్ ఆసుపత్రి ట్రస్ట్ నిర్వాహక కార్యదర్శి రాజ్‌కుమార్ గోయెంకా పేర్కొన్నారు. అయితే కేజ్రీవాల్ ఆసుపత్రిలోనూ మరో 20 మంది పిల్లలు ఇదే వ్యాధితో మరణించినట్లు తెలిసింది. అధికారికంగా 145 మంది పిల్లలు మరణించినట్లుగా లెక్కలు చూపిస్తున్నా.. అనధికారికంగా 180మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు పలు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
ముజఫర్‌పూర్ మృత్యుఘోష
-
పిల్లలు మరణిస్తుంటే పట్టని ప్రభువులు
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మెదడు వాపు వ్యాధిగా వ్యవహరిస్తున్న ‘ఎన్సిఫలిటీస్ సిండ్రోమ్’కు పిల్లలు పిట్టల్లా రాలిపోతుంటే ‘వికాస్ పురుష్’గా తనను తాను అభివర్ణించుకునే బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ముజఫరాపూర్‌కు రావడానికి రెండు వారాలు పట్టింది. ఆయన ఉంటున్న పట్నా నగరానికి ముజఫరాపూర్ కేవలం రెండు గంటల దూరంలో ఉంది. ఆయన బుధవారం ముజఫరాపూర్‌లోని కష్ణా మెడికల్ కాలేజ్ ఆస్పత్రిని సందర్శించారు. అప్పటికీ 114 మంది (నేటికి 115) పిల్లలు మరణించారు. ముఖ్యమంత్రి నితీష్‌ను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిల్లల తల్లిదండ్రులు అడ్డుకొని ధర్నా చేశారు. అధికార యంత్రాంగం సకాలంలో స్పందించి ఉంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదని వారు వాపోయారు. మెదడు వాపు వ్యాధితో దాదాపు 400 మంది పిల్లలు ఆస్పత్రిలో చేరారు. బిహార్ ఆరోగ్య మంత్రి మంగల్ పాండే వ్యవహారం మరీ విడ్డూరంగా ఉంది. ఎన్సిఫలిటీస్ను ఎలా ఎదుర్కొనాలనే అంశంపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్విణి కుమార్ చౌబేతో కలిసి ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు మధ్యలో భారత్–పాక్ క్రికెట్ స్కోర్ వివరాలు మంగల్ పాండే వాకబ్ చేయడం వినిపించింది. ఇది ఆ కార్యక్రమం వీడియోలో కూడా రికార్డయింది. పిల్లల ఆరోగ్యం పట్టని ఆయనకు స్కోర్ వివరాలు ముఖ్యమయ్యాయి. మెదడువాపు వ్యాధిని ఎలాఎదుర్కోవాలో బీహార్ డాక్టర్లకు అనుభవ పూర్వకంగా తెలుసు. 2012 నుంచి 2014 వరకు ఈ వ్యాధి బీహార్ ప్రజలను వణికించింది. బీహార్‌లో విరివిగా పండించే లిచీ పండ్లను తిని, రాత్రి పూట పౌష్టికాహారం తినకపోవడం వల్ల నాడు మెదడువాపు వ్యాధికి ఎక్కువ మంది పిల్లలు మరణించారని వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ విరోలోజిస్ట్ టీ జాకబ్ జాన్ తేల్చారు. వాస్తవానికి దాన్ని ఎన్సిఫలటీస్ అనకూడదని, ఎన్సిఫోలోపతి అనాలని కూడా ఆయన చెప్పారు. ఈసారి ఆస్పత్రి పాలైన 400 మంది పిల్లలు కూడా మురికి వాడల్లో నివసిస్తున్న పేదల పిల్లలే. వారికి సమీపంలో కూడా లిచీ పండ్ల తోటలు ఉన్నాయి. వారు వాటిని తినడం వల్లనే వారు జబ్బుపడ్డారని అంటున్నారు. పౌష్టికాహార లోపంతో ఉన్న పిల్లలకు ఈ పండ్లు మంచివని తినిపిస్తారు. ఇవి తిని, రాత్రిపూట ఆహారం తీసుకోకపోతే అవి ప్రాణాంతకం అవుతాయట. వాంతులు చేసుకోవడం, మగతలో ఉండడం, కాస్త పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం మెదడువాపు లక్షణాలు. ముఖ్యంగా ఉదయం 4 నుంచి 7 గంటల మధ్య పిల్లల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని రోజుల్లోనే వారు మరణించే ప్రమాదం ఉంటుంది. సకాలంలో వైద్యం అందించడం అవసరం. వైద్యానికి స్పందించి పిల్లలు బతకాలంటే కూడా పిల్లల్లో పౌష్టికాహార లోపం ఉండకూడదట. బిహార్‌లో మొన్నటి వరకు వీచిన వడగాడ్పులకు 70 మంది మత్యువాత పడ్డారనే విషయాన్ని జీర్ణించుకునేలోపే ఇలా పిల్లలు రాలిపోవడం వారి తల్లిదండ్రలకు కడుపుకోతే కాకుండా ప్రభుత్వం బాధ్యతరాహిత్యానికి మాయని మచ్చ. -
సీఎం నితీశ్‌కు నిరసన సెగ
ముజఫర్‌పూర్/పట్నా: మెదడువాపు వ్యాధితో తమ పిల్లలను కోల్పోయిన బాధలో ఉన్న తల్లిదండ్రులు ఆస్పత్రిని సందర్శించిన బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముజఫర్‌పూర్ జిల్లాలో ఇప్పటి వరకూ 100 మందికి పైగా పిల్లలు మెదడువాపు వ్యాధితో మరణించడం తెల్సిందే. వ్యాధి వ్యాప్తిపై పట్నాలో అధికారులతో భేటీ తర్వాత నితీశ్ ముజఫర్‌పూర్‌లోని ఆస్పత్రి ఐసీయూలోకి వెళ్లారు. దీంతో అక్కడ కొందరు ‘నితీశ్ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. నితీశ్ ఐసీయూలోకి రాగానే పిల్లల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మా బిడ్డలను కాపాడండి సారూ అంటూ భోరున విలపించారు. నితీశ్ వారిని పరామర్శించి బిడ్డల పరిస్థితిని గురించి డాక్టర్ల వద్ద వాకబు చేశారు. త్వరలోనే కృష్ణా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ను 600 పడకల స్థాయి నుంచి 2,500 పడకల స్థాయికి చేరుస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపక్ కుమార్ చెప్పారు. -
చిన్నారుల ప్రాణాలు పోతుంటే.. స్కోర్ కావాలా?
పట్నా: బిహార్‌లో మెదడువాపు వ్యాధి ముక్కుపచ్చలారని చిన్నారులను బలి తీసుకుంటోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారినపడి 103 మంది చిన్నారులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్, బిహార్ ఆరోగ్యశాఖ మంత్రి మంగళ్ పాండేతో కలిసి ఆదివారం మీడియాతో ముచ్చటించారు. మెదడువాపు వ్యాది ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలను వివరించారు. అయితే ఈ సందర్భంగా మంగల్ పాండే మీడియా మిత్రులను భారత్-పాక్ మ్యాచ్ స్కోర్ ఎంత? ఇప్పటి వరకు ఎన్ని వికెట్లు పడ్డాయని అడగడం వివాదస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో ఏఎన్ఐ ట్వీట్ చేయగా నెటిజన్లు మండిపడుతున్నారు. ఒకవైపు చిన్నారులు పిట్టల్లా రాలుతుంటే నీకు స్కోర్ కావాల్సి వచ్చిందా? అని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇక సోమవారం ఈ వ్యాధితో ముజఫర్‌పూర్‌లో ఆరుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. శ్రీకృష్ణ వైద్య కళాశాల, ఆస్పత్రి (ఎస్‌కేఎంసీహెచ్)లో సౌకర్యాలే లేవని రోగుల తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బిహార్‌లో సైతం సోమవారం డాక్టర్లు సమ్మె చేయడంతో వైద్య సేవలు స్తంభించాయి. మరణాలపై సీఎం నితీశ్‌కుమార్ స్పందించారు. బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బిహార్‌లో చిన్నారుల మరణాలపై వివరణ కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖకు, బిహార్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపింది. #WATCH Bihar Health Minister Mangal Pandey asks for latest cricket score during State Health Department meeting over Muzaffarpur Acute Encephalitis Syndrome (AES) deaths. (16.6.19) pic.twitter.com/EVenx5CB6G — ANI (@ANI) June 17, 2019 -
బిహార్‌లో హాహాకారాలు
ముజఫర్‌పూర్/ పట్నా / న్యూఢిల్లీ: బిహార్‌ను మెదడువాపు వ్యాధి వణికిస్తోంది. ముక్కుపచ్చలారని చిన్నారులను ఈ మహమ్మారి బలి తీసుకుంటోంది. సోమవారం ఈ వ్యాధితో ముజఫర్‌పూర్‌లో ఆరుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు ఈ వ్యాధి బారినపడి మరణించిన వారి సంఖ్య 103కు చేరినట్లు శ్రీ కృష్ణ వైద్య కళాశాల, ఆస్పత్రి (ఎస్‌కేఎంసీహెచ్) సూపరింటెండెంట్ సునీల్ కుమార్ షాహి సోమవారం తెలిపారు. ఇలావుండగా ఎస్‌కేఎంసీహెచ్ ఆస్పత్రిలో రాత్రివేళ వైద్యులు అందుబాటులో ఉండటం లేదని రోగుల తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. ఎస్‌కేఎంసీహెచ్‌లో సౌకర్యాలే లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బిహార్‌లో సైతం సోమవారం డాక్టర్లు సమ్మె చేయడంతో వైద్య సేవలు స్తంభించాయి. మరణాలపై సీఎం నితీశ్‌కుమార్ స్పందించారు. బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బిహార్‌లో చిన్నారుల మరణాలపై వివరణ కోరుతూ కేంద్ర ఆరోగ్య శాఖకు, బిహార్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు పంపింది. -
మెదడువాపు వ్యాధితో బాలిక మృతి
జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన ఓడిపెల్లి అఖిల(13) శనివారం అర్ధరాత్రి మెదడువాపు వ్యాధితో చనిపోరుుంది. ఒడ్డెపల్లి స్వామి, లక్ష్మి దంపతుల కూతురు అఖిల కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. మూడు రోజుల క్రితం రక్త పరీక్షలు చేస్తే రక్తకణాలు తక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. దీంతో ఆమెను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. తలనొప్పి ఎక్కువగా ఉందని తెలుపడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి మెదడు వాపు వ్యాధిగా నిర్ధారించారని తల్లిదండ్రులు తెలిపారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి అఖిల మృతిచెందిందని పేర్కొన్నారు. -
మెదడువాపు వ్యాధితో బాలుడి మృతి
గోరంట్ల: స్థానిక పట్టణంలోని పులేరు రోడ్డులోని బీసీ రెడ్డి కాంపౌండ్ సమీపంలో నివాసముంటున్న పురుషోత్తం(6) అనే బాలుడు మెదడు వాపు వ్యాధితో బెంగుళూరులో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. వివరాలకు గత వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బాలుడిని స్థానిక ఆస్పత్రితో పాటు హిందూపురం, బత్తలపల్లి ఆస్పత్రుల్లో వైద్యం అందించారు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో తల్లిదండ్రులు బెంగుళూరులోని ఓ ప్రైవేటు అసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మృతుడి తల్లిదండ్రులు రామకృష్ణ, లక్ష్మిలు తెలిపారు. వీరి స్వగ్రామం చిలమత్తూరు మండలంలోని బూదిలి శెట్టిపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. -
మెదడువాపు వ్యాధితో చిన్నారి మృతి
మహానంది (కర్నూలు) : కనుమరుగైందనుకుంటున్న మెదడు వాపు వ్యాధి మరోసారి వెలుగు చూసింది. కర్నూలు జిల్లాలో ఆరేళ్ల బాలిక మెదడువాపు వ్యాధితో మంగళవారం మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన దీపికాబాయి (6) గత శనివారం నుంచి జ్వరంతో బాధపడుతోంది. తల్లిదండ్రులు మొదట ఇద్దరు వైద్యులకు చూపించినా తగ్గకపోవడంతో నంద్యాలలోని ఓ చిన్న పిల్లల వైద్య నిపుణుడికి చూపించారు. మెదడువాపుగా నిర్ధారించిన డాక్టర్ మందులు సూచించడంతో అవి తీసుకుని వాడుతున్నామని, పరిస్థితి విషమించి మంగళవారం మధ్యాహ్నం దీపికాబాయి మృతి చెందినట్టు ఆమె తండ్రి కాశీరాంసింగ్ తెలిపారు. -
మాల్దాలో 11 మంది శిశువులు మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ లోని మాల్దా జిల్లాలో గత మూడు రోజుల్లో 11 మంది శిశువులు మృతి చెందారు. మాల్దా ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో మూడు రోజుల్లో 11 మంది శిశువులు ప్రాణాలు కోల్పోయారు. బరువు తక్కువగా ఉండడం, శ్వాసకోస సంబంధ సమస్యలే శిశువుల మరణానికి కారణమని ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎంఏ రషీద్ తెలిపారు. మాల్దా జిల్లాలో శిశువుల మరణాలు సాధారణంగా మారాయి. మెదడువాపుతో జూలైలో 12 మంది, జూన్ లో 9 మంది శిశువులు మరణించారు.