మహానంది (కర్నూలు) : కనుమరుగైందనుకుంటున్న మెదడు వాపు వ్యాధి మరోసారి వెలుగు చూసింది. కర్నూలు జిల్లాలో ఆరేళ్ల బాలిక మెదడువాపు వ్యాధితో మంగళవారం మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన దీపికాబాయి (6) గత శనివారం నుంచి జ్వరంతో బాధపడుతోంది.
తల్లిదండ్రులు మొదట ఇద్దరు వైద్యులకు చూపించినా తగ్గకపోవడంతో నంద్యాలలోని ఓ చిన్న పిల్లల వైద్య నిపుణుడికి చూపించారు. మెదడువాపుగా నిర్ధారించిన డాక్టర్ మందులు సూచించడంతో అవి తీసుకుని వాడుతున్నామని, పరిస్థితి విషమించి మంగళవారం మధ్యాహ్నం దీపికాబాయి మృతి చెందినట్టు ఆమె తండ్రి కాశీరాంసింగ్ తెలిపారు.