మతోన్మాదం.. భారత్ పరువును మంటగలుపుతోంది: రాహుల్‌ గాంధీ | Rahul Gandhi Slams BJP Over Prophet Controversy | Sakshi
Sakshi News home page

సిగ్గుపడాల్సినంత మతోన్మాదం.. భారత్ పరువును మంటగలుపుతోంది!

Published Mon, Jun 6 2022 9:04 PM | Last Updated on Mon, Jun 6 2022 9:07 PM

Rahul Gandhi Slams BJP Over Prophet Controversy - Sakshi

న్యూఢిల్లీ:  మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల వివాదం పట్ల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ఇది సిగ్గుపడాల్సినంతటి మతోన్మాదం అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

'ఉద్దేశపూర్వకంగానే విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారు... కానీ, భారతదేశం బయటి దేశాల్లో బలహీనపడుతోంది. ఇలాంటి సిగ్గుమాలిన మతోన్మాదం మనలను ఏకాకులను చేయడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారత్ పరువును కూడా మంటగలుపుతోంది' అని బీజేపీని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ విమర్శించారు.

ఈ వివాదంపై.. పలు ప్రతిపక్షాలు బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్‌, బీఎస్పీ నేత మాయావతి సహా పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement