muhammad prophet
-
ప్రవక్త వివాదం: శాంసంగ్ క్షమాపణలు
ఇస్లామాబాద్: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ చేష్టలతో పాకిస్థాన్‌పై అట్టుడికి పోయింది. నిరసలు హింసాత్మకంగా మారడంతో దెబ్బకు శాంసంగ్ కంపెనీ దిగొచ్చింది. ఇస్లాంను, మొహమ్మద్ ప్రవక్తను కించపరిచిందన్న ఆరోపణలపై ఎట్టకేలకు పాకిస్థాన్‌కు క్షమాపణలు తెలియజేసింది శాంసంగ్. బ్లాస్ఫెమీ(దైవదూషణ)కి పాల్పడడంతో శాంసంగ్ కంపెనీపై పాక్ ప్రజలు మండిపడుతున్నారు. పైగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో.. అంతర్గత దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు కొరియన్ కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు మతపరమైన భావాలపై తటస్థతను కొనసాగిస్తుందని ట్విటర్లో ఒక ప్రకటన ద్వారా పేర్కొంది. శుక్రవారం కరాచీలోని స్టార్ సిటీ మాల్లో ఇన్స్టాల్ చేసిన ఓ వైఫై డివైజ్ మూలంగా ఈ రచ్చ షురూ అయ్యింది. ఈ వార్త దావానంలా వ్యాపించడంతో.. మాల్ దగ్గరికి చేరుకుని కొందరు నిరసనలకు దిగారు. అదే సమయంలో శాంసంగ్ తీసుకొచ్చిన ఓ క్యూఆర్ కోడ్ ప్రవక్తను కించపరిచేదిగా ఉందంటూ గొడవ మరింత ముదిరింది. శాంసంగ్ వ్యతిరేక నినాదాలు చేస్తూ.. రెచ్చిపోయి మాల్ బయట విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో కొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. Protest against alleged blasphemy of a WiFi device in Karachi. Mob gathered after a WiFi device installed in Star City Mall, allegedly posted blasphemous comments. Protesters vandalised Samsung billboards accusing the company of blasphemy. Police detained 27 Samsung employees. pic.twitter.com/3R8UYbScqa — Naila Inayat (@nailainayat) July 1, 2022 Samsung Pakistan - Press Release July 1st, 2022. pic.twitter.com/IVSpAkH8Lm — Samsung Pakistan (@SamsungPakistan) July 1, 2022 విషయం తెలిసి మాల్‌కు చేరుకున్న పోలీసులు.. 27 మంది శాంసంగ్ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడింది తెహ్రీక్-ఈ-లబ్బాయిక్ పాకిస్థాన్ గ్రూప్ సభ్యులని నిర్ధారించిన పోలీసులు.. వాళ్లను అరెస్ట్ మాత్రం చేయలేదు. పాక్‌లో దైవదూషణను అక్కడి చట్టం తీవ్ర నేరంగా భావిస్తుంది. కఠిన శిక్షలతో పాటు భారీ జరిమానా.. ఒక్కోసారి మరణ శిక్ష కూడా అమలు చేస్తారు. కిందటి ఏడాది డిసెంబర్లో ఇస్లాంను కించపరిచిన నేరానికి.. శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తి సియాల్కోట్లో మూక హత్యకు గురయ్యాడు. చదవండి: నూపుర్‌శర్మ దేశానికి క్షమాపణ చెప్పాల్సిందే! -
నూపుర్ శర్మ కోసం పోలీసుల గాలింపు!
ఢిల్లీ: ప్రవక్తపై కామెంట్లతో వివాదంలో చిక్కుకున్న నూపర్ శర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత ఐదు రోజులుగా ఆమె జాడ తెలియరావడం లేదని ముంబై పోలీసులు చెప్తున్నారు. ముంబైతో పాటు ఢిల్లీ, కోల్‌కతా పోలీసులు సైతం ఆమె ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ముహమ్మద్ ప్రవక్తపై కామెంట్ల తర్వాత ఢిల్లీ వాసి అయిన నూపుర్ శర్మకు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆమెకు గట్టి భద్రత కల్పించారు పోలీసులు. అయితే అదే సమయంలో.. పలు రాష్ట్రాల్లో ఆమెపైనా డజన్ల కొద్దీ కేసులు నమోదు అయ్యాయి. రజా అకాడమీ అనే ఇస్లాం సంస్థ కార్యదర్శి ఇర్ఫాన్ షేక్ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు సైతం నూపుర్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆమెను ప్రశ్నించేందుకు ముంబై పోలీసుల టీం ఒకటి.. ఢిల్లీకి వెళ్లింది. అయితే ఆమె ఎక్కడ ఉందనే సమాచారం మాత్రం ఇప్పటిదాకా వాళ్లకు తెలియలేదు. గత ఐదు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన ముంబై పోలీసులు నూపుర్ కోసం గాలిస్తున్నారు. అదే సమయంలో మహారాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ ‘నూపుర్‌ను అరెస్ట్ చేయడానికి ముంబై పోలీసులకు తగిన ఆధారాలు ఉన్నాయి’ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉంటే.. కోల్‌కతా పోలీసులు కూడా నూపుర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. టీఎంసీ మైనార్టీ సెల్ కార్యదర్శి అబ్దుల్ సోహైల్ ఫిర్యాదు మేరకు కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. జూన్ 20వ తేదీన ఆమె స్టేట్మెంట్ను కోల్‌కతా పోలీసులు నమోదు చేయాల్సి ఉంది. మరోవైపు ఢిల్లీ పోలీసులు సైతం ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈలోపే ఆమెకు బెదిరింపులు రావడంతో.. ఆమె కుటుంబానికి భద్రత కల్పించారు. అయితే ఆమె ఎక్కడ ఉందనే సమాచారం ఇప్పుడు ఢిల్లీ పోలీసులకు సైతం తెలియదట!. ఓ టీవీ డిబేట్లో జ్ఞానవాపి మసీదు అంశంపై మాట్లాడుతున్న కమ్రంలో.. ముహమ్మద్ ప్రవక్త వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేశారామె. ఆ వ్యాఖ్యలను ముస్లిం సంఘాలతో పాటు 15 ఇస్లాం దేశాలు ఖండించాయి. గల్ఫ్ దేశాలు సైతం అక్కడున్న భారతీయ దౌత్యవేత్తలకు సమన్లు జారీ చేసి.. వివరణ, క్షమాపణలు కోరాయి. అయితే వ్యాఖ్యల దుమారం మొదలైన వెంటనే నూపుర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు ఆమె వ్యాఖ్యలను సైతం ఖండించింది బీజేపీ. ఇక తన వ్యాఖ్యలపై భేషరతు క్షమాపణలు చెప్పిన నూపుర్ శర్మ.. పదే పదే మహాదేవుడ్ని(శివుడ్ని) అవమానించడం, అగౌరవపర్చడం వల్లే అలా మాట్లాడాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు కూడా. చదవండి: భారత్‌ను ఒంటరిని చేస్తారు జాగ్రత్త! -
ఇంతకీ నూపుర్ శర్మ ఇప్పుడు ఎక్కడ?
ఓ టీవీ షో డిబేట్లో ముహమ్మద్ ప్రవక్తపై కామెంట్లు చేసి తీవ్ర దుమారం రేపారు నూపుర్ శర్మ. దేశంలోనే కాదు.. ఇస్లాం దేశాల నుంచి ఆమె వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది.. అవుతోంది కూడా. ఈ వ్యాఖ్యలతో రాజకీయంగానూ బీజేపీ కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది. వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత.. బీజేపీ ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాదు తన వ్యాఖ్యల పట్ల ఆమె క్షమాపణలు కూడా తెలియజేసింది. అయినా వివాదం చల్లారడంలేదు. నూపుర్ శర్మ పేరు ప్రతీరోజూ వార్తల్లో వినిపిస్తూనే ఉంది. ఆమెపై చర్యలు తీసుకోవాలని, అరెస్ట్ చేయాలనే డిమాండ్ వినిపిస్తూనే ఉంది. మరి.. వివాదానికి కేంద్రబిందువుగా ఉన్న ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. ప్రవక్తపై కామెంట్ల తర్వాత.. చంపేస్తామంటూ బెదిరింపులు, వేధింపులు ఆమెకు ఎదురయ్యాయి. దీంతో కుటుంబంతో సహా ఆమె పోలీసులను ఆశ్రయించారు. మరోవైపు కొన్ని ఉగ్రసంస్థలు సైతం ఆమెపై బెదిరింపు ప్రకటనలు చేశాయి. ఈ తరుణంలో.. ఢిల్లీ పోలీసులు ఆమెకు భారీ భద్రతను అందించారు. కుటుంబంతో పాటు నూపుర్ బలమైన సెక్యూరిటీ నడుమ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మే 26వ తేదీన జ్ఞానవాపి మసీద్ వ్యవహారంపై టీవీ చర్చ సందర్భంగా ఆమె.. ప్రవక్త వ్యక్తిగత జీవితంపై కామెంట్లు చేశారు. ఆ వ్యాఖ్యలపై ఇస్లాం వర్గాల అభ్యంతరాలతో దుమారం చెలరేగింది. అప్పటి నుంచి ఆమె ఇంటి నుంచి అడుగు బయటపెట్టడం లేదు. బీజేపీ అగ్రశ్రేణి నేతలకు వివరణ ఇచ్చేందుకు యత్నించినా.. సానుకూల స్పందన లభించలేదు. దీంతో ఆమె కొంతమంది నేతలతో ఫోన్ ద్వారా ఆమె మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆపై మీడియాకు సైతం అంతగా అందుబాటులోకి రాని నూపుర్.. సోషల్ మీడియా ద్వారానూ సదరు వ్యాఖ్యలపై స్పందించేందుకు ఇష్టపడడం లేదు. కానీ, సోషల్ మీడియా అకౌంట్లలో మాత్రం యాక్టివ్గానే ఉంటూ.. పోస్టులు చేస్తున్నారు. దాడులు జరిగే అవకాశం ఉన్నందునా.. ఢిల్లీ పోలీసులు ఇప్పుడు నూపుర్ కుటుంబ భద్రతను సవాల్‌గా తీసుకుంటున్నారు. నూపుర్ శర్మ(37) ఢిల్లీలోని పుట్టి, పెరిగారు. సివిల్స్ సర్వెంట్స్ నేపథ్యం ఉన్న కుటుంబం ఆమెది. బీఏ, ఎల్ఎల్బీ, లండన్ యూనివర్సిటీలో మాస్టర్ లా చేశారామె. ఏబీవీపీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న ఆమె(ప్రెసిడెంట్‌గానూ 8 ఏళ్లు పని చేశారు).. విద్యార్థి దశలోనే టీవీ డిబేట్ల ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసినా ఆశించిన ఫలితం రాలేదు. చివరకు.. బీజేపీ నేతగా ఉన్న టైంలోనే టీవీ డిబేట్ ద్వారానే ఆమె వివాదంలోనూ చిక్కుకోవడం గమనార్హం. అయితే ఈ కష్టకాలంలో బీజేపీ ఆమెకు అండగా నిలబడడం లేదంటూ.. #ShameOnBJP #IsupportNupurSharma హ్యాష్ట్యాగులూ ఈమధ్యకాలంలో ట్రెండ్ అవుతుండడం విశేషం. మరోవైపు కొన్ని ఇస్లాం సంఘాలు ఈ వివాదాన్ని ఇంతటితో ఆపేయాలంటూ పిలుపు ఇస్తున్నా.. మరికొన్ని వర్గాలు మాత్రం చల్లారడం లేదు. -
ప్రవక్తపై వ్యాఖ్యలు.. దేశమంతా నిరసనలు
న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యల తాలూకు రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. వాటిని నిరసిస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ నిరసనలు, ఆందోళనలు జరిగాయి. రాంచీ తదితర చోట్ల ఇవి హింసాత్మకంగా మారాయి. వాటిని అదుపు చేసే క్రమంలో పోలీసులు కూడా గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కశ్మీర్లో పలుచోట్ల కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. నిరసనల వ్యాప్తిని అడ్డుకునేందుకు కశ్మీర్‌తో పాటు పశ్చిమబెంగాల్లోనూ కొన్నిచోట్ల ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. పలు రాష్ట్రాల్లో వందలాది మందిని అదుపులోకి తీసుకున్నారు. రాంచీలో రాళ్ల దాడి ఢిల్లీలోని చారిత్రక జామా మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనల తర్వాత నిరసనకారులు భారీ సంఖ్యలో గుమిగూడారు. ప్రవక్తపై అభ్యంతకరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ అరెస్టుకు డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన నినాదాలతో హోరెత్తించారు. దాంతో భారీగా బలగాలను మోహరించాల్సి వచ్చింది. ప్రాంగణం బయట నిరసనలకు దిగిందెవరో తెలియదని జామా మసీదు షాహీ ఇమాం సయీద్ అహ్మద్ బుఖారీ అన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నుపుర్‌ను అరెస్టు చేయాలంటూ జామియా మిలియా వర్సిటీ విద్యార్థులు కూడా క్యాంపస్‌లో ధర్నాకు దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. జార్ఖండ్‌లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. రాంచీలో స్థానిక హనుమాన్ మందిర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారాయి. ప్రార్థనల అనంతరం భారీ నినాదాలతో రోడ్లపైకి వచ్చిన నిరసనకారులు ఒక దశలో సంయమనం కోల్పోయి రాళ్ల దాడికి పాల్పడటంతో కొందరు పోలీసులు కూడా గాయపడ్డారు. వారిని అదుపు చేసేందుకు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. అయినా లాభం లేకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఉద్రిక్తత నేపథ్యంలో రాంచీలో ఉదయం నుంచీ తీవ్ర ఉద్రిక్త త నెలకోవడంతో దుకాణాలూ తెరుచుకోలేదు. అట్టుడికిన కశ్మీర్ నుపుర్ వ్యాఖ్యలపై జమ్మూ కశ్మీర్ అట్టుడికింది. రెండు ప్రాంతాల్లోనూ భారీ ఆందోళనలతో పాటు పలుచోట్ల భద్రతా దళాలపై రాళ్లు రువ్వడం వంటి సంఘటనలు జరిగాయి. ముందుజాగ్రత్తగా శ్రీనగర్‌తో పాటు భదేర్వా, కిష్త్వార్ తదితర పట్టణాల్లో కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. ఇంటర్నెట్ సేవలు కూడా తాత్కాలికంగా నిలిపేశారు. లోయలో చాలాచోట్ల దుకాణాలు తదితరాలు తెరుచుకోలేదు. పశ్చిమబెంగాల్లో హౌరా జిల్లాలో పోలీసులతో నిరసనకారులు బాహాబాహీ తలపడ్డారు. అక్కడ పలుచోట్ల ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. నిరసనల వల్ల రాష్ట్రంలో పలుచోట్ల రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. ఇటు మహారాష్ట్రలోనూ నిరసనలు వెల్లువెత్తాయి. ముంబై శివార్లలోని పన్వేల్‌లో జరిగిన భారీ నిరసనల్లో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. థానే, ఔరంగాబాద్, సోలాపూర్, నందుర్బార్, పర్భనీ, బీడ్, లాతూర్, భండారా, చంద్రపూర్, పుణె జిల్లాల్లో చాలాచోట్ల ఆందోళనలు జరిగాయి. నుపుర్, జిందార్‌తో పాటు స్వామి యతి నర్సింగానంద్‌లను అరెస్టు చేయాలంటూ మహారాష్ట్ర, బిహార్ సహా పలు రాష్ట్రాల్లో పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. దిష్టిబొమ్మకు ఉరి యూపీలోనూ రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసనలు జరిగాయి. ప్రయాగ్‌రాజ్, సహరన్పూర్ సహా నాలుగైదు నగరాల్లో పోలీసులపై రాళ్లు రువ్వారు. ప్రయాగ్‌రాజ్‌లో మోటార్‌సైకిళ్లకు, రిక్షాలకు నిప్పంటించారు. ఓ పోలీసు వాహనాన్ని కూడా తగలబెట్టేందుకు ప్రయత్నించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. లక్నోతో పాటు బిజ్నోర్, రాంపూర్ తదితర చోట్లా అల్లర్లు చెలరేగాయి. గుజరాత్లో అహ్మదాబాద్, వదోదర తదితర నగరాల్లో నిరసనలు కొనసాగాయి. ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో బంద్ పాటించారు. కర్నాటకలోని బెల్గావీలో ఓ మసీదు వద్ద నుపుర్ దిష్టిబొమ్మను ఉరి తీశారు. ‘నుపుర్‌ను తక్షణం అరెస్టు చేయాలి’ అంటూ హైదరాబాద్‌లో కూడా భారీ నిరసనలు జరిగాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కూడా ఇదే డిమాండ్‌తో ఢాకా సహా పలు నగరాలు, పట్టణాల్లో వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. #WATCH People in large numbers protest at Delhi's Jama Masjid over inflammatory remarks by suspended BJP leader Nupur Sharma & expelled leader Naveen Jindal, earlier today No call for protest given by Masjid, says Shahi Imam of Jama Masjid. pic.twitter.com/Kysiz4SdxH — ANI (@ANI) June 10, 2022 -
అజిత్ దోవల్ పేరుతో ‘గుణపాఠం ట్వీట్’.. కాసేపటికే డిలీట్
న్యూఢిల్లీ: బీజేపీ బహిష్కృత నేతలు మహమ్మద్ ప్రవక్త పట్ల చేసిన వ్యాఖ్యలపై ఇస్లామిక్ దేశాలన్నీ గుర్రుగా ఉన్నాయి. ఈ తరుణంలో.. భారత్ తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇరాన్ విదేశాంగ మంత్రి న్యూఢిల్లీకి రావడం విశేషం. అయితే ప్రవక్త వ్యాఖ్యలను ఉద్దేశించి.. ఇరాన్ విదేశాంగ శాఖ చేసిన ఆసక్తికర ప్రకటనను కాసేపటికే ఇరాన్ డిలీట్ చేసింది. ప్రధాని మోదీతో ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహేన్ భేటీ అయ్యారు. అలాగే, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులతోనూ ఆయన చర్చలు నిర్వహించారు. కొందరు వ్యక్తులు మహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు వ్యతిరేక వాతావరణానికి దారితీసినట్టు ఆయన అజిత్ దోవల్ కు తెలియజేసినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించుకుంది. అందుకు బదులుగా భారత్ మహమ్మద్ ప్రవక్తను గౌరవిస్తుందని ఈ సందర్భంగా ఇరాన్ విదేశాంగ మంత్రికి భారత్ స్పష్టం చేసిందని, ఈ అంశంలో ఇతరులకు ఒక గుణపాఠంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని దోవల్ హామీ ఇచ్చినట్టు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి ఓ ట్వీట్ కూడా చేశారు. అంతేకాదు.. నిందితుల పట్ల భారత్ అధికారులు వ్యవహరిస్తున్న వైఖరిపై ముస్లింలు సంతోషంగా ఉన్నట్టు ఆయన చెప్పారు. అయితే ఈ ప్రకటనను కాసేపటికే భారత ప్రభుత్వం ఖండించింది. దీంతో ‘ఇతరులకు ఒక పాఠంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని దోవల్ హామీ ఇచ్చినట్టు’ లైన్‌ను తొలగించి.. మరో ట్వీట్ చేశారు. ఇక విదేశాంగ మంత్రి వద్ద గానీ అసలు ప్రవక్త వ్యాఖ్యల అంశమే రాలేదని ప్రతినిధి ఒకరు వెల్లడించారు. దీంతో మరో ట్వీట్ చేశాడు ఇరాన్ విదేశాంగ మంత్రి. Pleased to meet PM Modi, FM Jaishankar & other Indian officials to advance our bilateral strategic dialogue. Tehran & New Delhi agree on the need to respect divine religions & Islamic sanctities & to avoid divisive statements. 🇮🇷🇮🇳 determined to bring relations to new heights. — H.Amirabdollahian امیرعبداللهیان (@Amirabdolahian) June 8, 2022 -
మతోన్మాదం.. భారత్ పరువును మంటగలుపుతోంది: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల వివాదం పట్ల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ఇది సిగ్గుపడాల్సినంతటి మతోన్మాదం అని ట్విటర్లో పేర్కొన్నారు. 'ఉద్దేశపూర్వకంగానే విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారు... కానీ, భారతదేశం బయటి దేశాల్లో బలహీనపడుతోంది. ఇలాంటి సిగ్గుమాలిన మతోన్మాదం మనలను ఏకాకులను చేయడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారత్ పరువును కూడా మంటగలుపుతోంది' అని బీజేపీని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ విమర్శించారు. Divided internally, India becomes weak externally. BJP’s shameful bigotry has not only isolated us, but also damaged India’s standing globally. — Rahul Gandhi (@RahulGandhi) June 6, 2022 ఈ వివాదంపై.. పలు ప్రతిపక్షాలు బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్, బీఎస్పీ నేత మాయావతి సహా పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. PM @narendramodi Ji, Why should India as a country apologise to international community for the hate speeches of BJP bigots? It is BJP that should apologise; not India as a Nation Your party should first apologise to Indians at home for spewing & spreading hatred day in day out — KTR (@KTRTRS) June 6, 2022 1. देश में सभी धर्मों का सम्मान जरूरी। किसी भी धर्म के लिए आपत्तिजनक भाषा का इस्तेमाल उचित नहीं। इस मामले में बीजेपी को भी अपने लोगों पर सख्ती से शिकंजा कसना चाहिए। केवल उनको सस्पेंड व निकालने से काम नहीं चलेगा बल्कि उनको सख्त कानूनों के तहत् जेल भेजना चाहिए। 1/2 — Mayawati (@Mayawati) June 6, 2022 -
విమర్శలు-సమన్లు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఇస్లాం దేశాలు త్రీవస్థాయిలో మండిపడుతున్నాయి. ఓవైపు ఆయా దేశాలు తమ దేశంలోని భారత ప్రతినిధులకు సమన్లు జారీ చేస్తుండగా.. ఐవోసీ ఘాటు వ్యాఖ్యలకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. జెడ్డా వేదికగా ఉన్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో-ఆపరేషన్ (IOC) ‘‘భారతదేశంలో ఇస్లాం పట్ల ద్వేషం, విమర్శలు, ముస్లింలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న విధానాలు తేటతెల్లం అయ్యాయి’’ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ దరిమిలా భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తీవ్రంగా స్పందించారు. ఐవోసీ సెక్రటేరియెట్ వ్యాఖ్యలు అసంబద్ధమైనవి, సంకుచిత భావంతో కూడుకుని ఉన్నాయంటూ వ్యాఖ్యానించారాయన. అన్ని మతాలను భారత ప్రభుత్వం సమానంగానే చూస్తుందని పేర్కొన్నారు ఆయన. ఇదిలా ఉంటే.. ఐవోసీలో ఇస్లాం ఆధిపత్య దేశాలు సభ్య దేశాలుగా ఉంటాయన్నది తెలిసిందే. తమది ఇస్లాం ప్రపంచ సంయుక్త గొంతుక అని ప్రకటించుకుంటుంది ఆ వేదిక. భారత్ అంతర్గత వ్యవహారాల్లో ఐవోసీ జోక్యం చేసుకోవడం, ఆ జోక్యాన్ని భారత్ ఖండిస్తూ వస్తుండడం జరుగుతోంది. తాజాగా నూపుర్ శర్మ వ్యాఖ్యలపై ఐవోసీకి భారత్ గట్టి కౌంటరే ఇచ్చింది. దూషణపూరితమైన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా చేసినవని, అది భారత ప్రభుత్వానికి సంబంధించినవి కావని స్పష్టం చేశారు బాగ్చీ. వ్యాఖ్యలు చేసిన శర్మ, జిందాల్‌లపై తొలగింపు వేటు కూడా పడిందన్న విషయాన్ని బాగ్చీ గుర్తు చేస్తున్నారు. ఐవోసీ సెక్రటేరియెట్ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారాయన. ఇదిలా ఉంటే.. టీవీ డిబెట్లో బీజేపీ మాజీ ప్రతినిధులు మహమద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలను గల్ఫ్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. నూపుర్ శర్మ కామెంట్లు అవమానకరరీతిలో ఉన్నాయని, అన్ని మతాలను.. విశ్వాసాలను గౌరవించాలని అంటున్నాయి. ఈ మేరకు సౌదీ అరేబియా విదేశాగం శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అదే సమయంలో బీజేపీ తీసుకున్న చర్యలను స్వాగతించింది. మరోవైపు దోహాలోని భారత దౌత్యవేత్తకు అక్కడి విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తక్షణ ఖండన, బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది ఖతర్. ఇక కువైట్ కూడా ఖతర్లాగే భారత రాయబారికి సమన్లు జారీ చేసింది. బహిరంగ క్షమాపణలు చెప్పడంతో పాటు ఇలాంటి వ్యాఖ్యలకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇంకోవైపు ఇరాక్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించింది. దేశంలో వరుసగా జరుగుతున్న మత విద్వేష ఘర్షణలు, జ్ఞానవాపి మసీదు చర్చ సందర్భంగా ఓ టీవీ డిబేట్లో బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ.. మహమద్ ప్రవక్తను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బీజేపీ మీడియా చీఫ్ నవీన్ జిందాల్ సైతం ప్రవక్త మీద ఓ ట్వీట్ చేసి.. అది విమర్శలకు దారి తీయడంతో వెంటనే డిలీట్ చేసేశారు. ఈ పరిణామాల తర్వాత కాన్పూర్(యూపీ) శుక్రవారం ప్రార్థనల సందర్భంగా రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చెలరేగి పలువురు గాయపడ్డారు. నుపూర్, నవీన్ చేష్టల వల్లే ఇదంతా జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తగా.. బీజేపీ సొంత పార్టీ నేతలపై చర్యలు తీసుకుంది. ఇద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అప్పటికే చాలా డ్యామేజ్ జరిగిపోయింది. అధికార పార్టీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తూ.. సౌదీ అరేబియా, బహ్రైన్‌తో పాటు మరికొన్ని దేశాలు సైతం భారత ఉత్పత్తులను సూపర్మార్కెట్ల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. చదవండి: క్షమాపణలు కోరిన నూపుర్ శర్మ -
నన్ను అంతమొందించే కుట్ర
హైదరాబాద్: ‘నన్ను అంతమొం దించే కుట్ర జరుగుతోంది..ఎప్పటివరకు బతుకుతానో తెలియదు..భద్రతా సిబ్బంది ఉన్నా.. ప్రాణాలకు భరోసా లేదు..ఏక్షణమైనా ఎవరైనా మట్టుబెట్టొచ్చు’ అని మజ్లిస్‌పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్య లు చేశారు. మహ్మద్‌ప్రవక్త జన్మదినమైన మిలాద్-ఉన్-నబీ సందర్భంగా మజ్లిస్‌పార్టీ ఆధ్యర్యంలో దారుస్సలాం మైదానంలో మంగళవారం తెల్లవారుజాము వరకు జరిగిన బహిరంగసభలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. సంఘ్‌పరివార్,హిందుత్వశక్తులు తనను అంతమొందించడం జరిగితే..పాతబస్తీలో ప్రతిఇంట్లో ఒక అక్బరుద్దీన్ గా మారి ముస్లింల పక్షాన గళం విప్పాలని, పార్టీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలో ముస్లింలపై జరుగుతున్న అఘాత్యాలపై మౌనం వహించడం వల్లే ముజఫర్‌నగర్ లాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని పేర్కొన్నారు. ‘ముస్లింల పక్షాన గళం విప్పేవారిని జైళ్లలో పెడుతున్నారు. కాల్పులు జరుపుతున్నారు. మజిస్ల్ పా ర్టీని అంతమొందించే కుట్రలు చేశారు. తనను జైలులో ఉంచారు. కనీసం మంచినీళ్లు, దుప్పటి కూడా ఇవ్వలేదు. వాంతులు చేసుకున్నా కనీసం ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ఇబ్బందులకు గురిచేశారని’ ఆయన వెల్లడించారు. చట్టంపై తనకు నమ్మకం ఉందంటూ..దేశవ్యాప్తంగా ముస్లింల పక్షాన గళం విప్పి తీరుతామని అక్బర్ ప్రకటించారు. కార్యక్రమంలో మజ్లిస్‌పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు మతగురువులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.