శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన స్త్రీ2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే, ఈ సినిమాకు సీక్వెల్‌గా పార్ట్ 3 రానుంది. ఈమేరకు శ్రద్ధా కపూర్ పలు విషయాలను పంచుకుంది. ఆగష్టు 15న విడుదలైన స్త్రీ2 కేవలం రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కితే.. సుమారు రూ. 700 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.
స్త్రీ2 విజయం పట్ల శ్రద్ధా కపూర్ ఇలా చెప్పుకొచ్చారు. స్త్రీ సినిమా చూసిన ప్రతిసారి ఇలాంటి సినిమా ఇప్పటి వరకు చూడలేదనే ఫీల్ ఉంటుంది. అలాంటి సమయంలో దానికి సీక్వెల్ చేయాలని నన్ను కోరినప్పుడు చాలా సంతోషించాను. పార్ట్1 మించిన విజయాన్ని స్త్రీ2 చిత్రం ద్వారా ప్రేక్షకులు అందించారు. ఈ ప్రాజెక్ట్‌ను ఇంత అద్భుతంగా తెరకెక్కించిన దర్శక నిర్మాతలను అభినందించాలి. ఈ చిత్రం ప్రాంచైజీలో భాగంగా మూడో పార్ట్ కూడా రానుంది. అయితే, అందులో మొదటి రెండు భాగాలకు మించిన ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. ఇప్పటికే మేకర్స్ ఆ పనులను ప్రారంభించారు.' అని ఆమె చెప్పారు.
2018లో స్త్రీ సినిమా విడుదలైంది. ఆ చిత్రం భారీ విజయం అందుకోవడంతో ఈ ఏడాది రెండో పార్ట్ తెరకెక్కించారు. ఇందులో భాగంగానే మూడో పార్ట్‌ను కూడా నిర్మించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. హారర్ కామెడీగా వచ్చిన ఈ రెండు సినిమాలు అభిమానులను మెప్పించాయి.
Comments
Please login to add a commentAdd a comment