
నవాజుద్దీన్ సిద్ధిఖి బాలీవుడ్‌లో బడా నటుడు. రెండున్నర దశాబ్దాలుగా తన నటనతో హిందీ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈ మధ్యే సైంధవ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకూ పరిచయమయ్యాడు. ప్రస్తుతం అతడు యాక్ట్ చేసిన 'సైయాన్ కీ బందూక్' సాంగ్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో నవాజుద్దీన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.
దీపిక సినిమాలు చూడలేదు
బాలీవుడ్ సెలబ్రిటీల గురించి ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. అలా హీరోయిన్ దీపికా పదుకొణె గురించి అడగ్గా ఆమె గురించి నాకు పెద్దగా తెలియదు, తన సినిమాలేవీ చూడలేదు అని బదులిచ్చాడు. అలాగే సెన్సేషనల్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గురించి కూడా తనకు తెలియదన్నాడు.

టికు వెడ్స్ షెరు మూవీలో అవనీత్ కౌర్‌తో నవాజుద్దీన్ సిద్ధిఖి
త్వరలో చూస్తా
పోనీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల విధ్వంసం సృష్టించిన స్త్రీ 2 సినిమా గురించి తెలుసా? అని యాంకర్ ప్రశ్నించాడు. ఇప్పటివరకు సినిమా చూడలేదని, కానీ తప్పకుండా చూస్తానని నవాజుద్దీన్ చెప్పాడు. టికు వెడ్స్ షెరు మూవీలో తనతో కలిసి నటించిన యంగ్ హీరోయిన్ అవనీత్ కౌర్ గురించి మాట్లాడుతూ.. ఆమె సొంతకాళ్లపై నిలబడే వ్యక్తి. అద్భుతమైన నటి కూడా అని ప్రశంసించాడు.
ఓటీటీ..
కాగా నవాజుద్దీన్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ మూవీ అద్భుత్ ఆదివారం (సెప్టెంబర్ 15న) ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్‌లో రిలీజైంది. ఈ మూవీలో డయానా పెంటీ, శ్రేయ ధన్వంతరి, రోహన్ మెహ్రా కీలక పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment