సోనియాని ఏకిపారేసిన యష్మి.. నామినేషన్‌లో ఎవరున్నారంటే? | Bigg Boss Telugu 8 Promo: Yashmi Gowda Targets Naga Manikanta | Sakshi
Sakshi News home page

నిఖిల్‌, పృథ్వీపై ఉన్న ఇంట్రస్ట్‌ గేమ్‌పై లేదు.. సోనియాకు చుక్కలు చూపించిన యష్మి

Published Mon, Sep 16 2024 5:58 PM | Last Updated on Mon, Sep 16 2024 6:19 PM

Bigg Boss Telugu 8 Promo: Yashmi Gowda Targets Naga Manikanta

బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌లో పద్నాలుగు మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టారు. అప్పుడే అందులో ఇద్దర్ని బయటకు పంపించేశారు. ఒకరేమో చిచ్చుబుడ్డిలా ఫైర్‌ అయ్యే బేబక్క అయితే మరొకరు నవ్వులు పంచే ఎంటర్‌టైనర్‌ బాషా. ఈ ఇద్దరూ వెళ్లిపోవడంతో హౌస్‌లో 12 మంది మిగిలారు.

త్వరలో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు
ఆటలో తప్ప మాటలో మాత్రమే పౌరుషం చూపించే కంటెస్టెంట్లు హౌస్‌లో చాలామందే ఉన్నారు. ఇలాగైతే షోను నెట్టుకురావడం కష్టమేనని భావించిన బిగ్‌బాస్‌ టీమ్‌ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు ప్లాన్‌ చేస్తోంది. మరోవైపు హౌస్‌లో యథాతథంగా నామినేషన్స్‌ జరిగాయి. ఇందుకు సంబంధించిన రెండో ప్రోమో తాజాగా విడుదలైంది.

గాలి తీసేసిన నైనిక
ఇందులో పృథ్వీ, సోనియా.. నైనికపై చెత్త వేసి నామినేట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నైనిక.. నాకు మీరిప్పుడు కాంపిటీషనే అనిపించట్లేదని సోనియా గాలి తీసేసింది. అటు యష్మి కూడా.. నిఖిల్‌, అభయ్‌, పథ్వీ మీద చూపించిన ఇంట్రస్ట్‌ క్లాన్‌లో చూపించలేదు అని సోనియాను ఏకిపారేసింది.

ఫుల్‌ టార్గెట్‌ నువ్వే
తనకైతే మణికంఠ డేంజర్‌గా అనిపిస్తున్నాడని, హౌస్‌లో ఉన్నన్ని రోజులు అతడినే నామినేట్‌ చేస్తానంది యష్మి. విష్ణుప్రియ, ప్రేరణ మధ్య కూడా బాగానే ఫైట్‌ నడిచినట్లుంది. ఒకరిపై మరొకరు చెత్త గుమ్మరించి నామినేట్‌ చేసుకుంటూ బ్రెయిన్‌లెస్‌ పీపుల్‌, యూజ్‌లెస్‌ పీపుల్‌ అని తిట్టుకున్నారు.

నామినేషన్‌లో ఎవరున్నారంటే?
చివర్లో నబీల్‌.. అరుస్తే గెలుస్తామంటే నేను అందరికంటే ఎక్కువ అరవగలను అని ప్రేరణకు కౌంటర్‌ ఇచ్చాడు. మొత్తానికి ఈ వారం యష్మి, ప్రేరణ, విష్ణుప్రియ, సీత, పృథ్వీ, నైనిక, నాగమణికంఠతో పాటు చీఫ్‌ అభయ్‌ నామినేషన్‌లో ఉన్నారు. మరి ఎవరు ఎవర్ని నామినేట్‌ చేశారనేది తెలియాలంటే ఎపిసోడ్‌ వచ్చేంతవరకు ఆగాల్సిందే!

 

బిగ్‌బాస్‌ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement