ఓటీటీలోనూ తగ్గేదేలే.. దూసుకెళ్తోన్న హారర్ థ్రిల్లర్‌ | Shraddha Kapoor Latest Movie Stree 2 Trending Top In OTT, Check Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Stree 2 Movie OTT Response: ఓటీటీలో దూసుకెళ్తోన్న హారర్ థ్రిల్లర్.. టాప్‌లో ట్రెండింగ్

Published Sun, Oct 13 2024 8:54 PM | Last Updated on Mon, Oct 14 2024 12:01 PM

Shraddha kapoor Latest Movie Stree 2 trending Top In OTT

శ్రద్ధాకపూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన చిత్రం స్త్రీ-2. ఆగస్టు 15న  విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా  నిలిచింది. ఏకంగా రూ.870 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ హారర్ కామెడీ మూవీ బాలీవుడ్‍లో  పలు రికార్డులను బద్దలుకొట్టింది. ఇటీవలే ఓటీటీకి వచ్చిన ఈ చిత్రానికి ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఓటీటీలోనూ అదే రేంజ్‌లో దూసుకెళుతోంది.

టాప్‍లో ట్రెండింగ్

ఈ చిత్రం అక్టోబర్ 10వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. హిందీలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలో ఈ  సినిమాకు క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఏకంగా ప్రైమ్ వీడియో నేషనల్ వైడ్‌ గా టాప్‌లో ట్రెండ్ అవుతోంది. సెప్టెంబర్ చివర్లోనే రెంటల్ విధానంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. అయితే అక్టోబర్ 10 నుంచి ఉచితంగా అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుతం టాప్ ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement