
బ్లూమ్‌ఫొంటీన్: దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు, వన్డే సిరీస్‌లలో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్ రాత టి20ల్లోనూ మారలేదు. గత మ్యాచ్‌లతో పోలిస్తే కాస్త పోరాటపటిమ కనబర్చినా... చివరకు ఓటమి తప్పలేదు. గురువారం రాత్రి ఇక్కడ జరిగిన తొలి టి20లో దక్షిణాఫ్రికా 20 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.
‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డివిలియర్స్ (27 బంతుల్లో 49; 8 ఫోర్లు) చెలరేగగా, డి కాక్ (44 బంతుల్లో 59; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. చివర్లో బెహర్దీన్ (17 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా దూకుడు ప్రదర్శించాడు. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులే చేయగలిగింది. ప్యాటర్సన్, హెండ్రిక్స్, ఫ్రైలింక్, ఫెలుక్‌వాయో తలా 2 వికెట్లు తీశారు.