చెలరేగిన సఫారీలు
ముంబై: టీ20 క్రికెట్ వరల్డ్ కప్లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో దక్షిణాఫ్రికా 229 పరుగుల భారీ స్కోరు చేసింది. సఫారీ ఓపెనర్లు హషిమ్ ఆమ్లా(31 బంతుల్లో 58 పరుగులు), డికాక్(24 బంతుల్లో 52 పరుగులు) ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికి ఆరేశారు. వీరిద్దరి వీర విహారంతో 7 ఓవర్లకే సౌతాఫ్రికా స్కోరు 96 పరుగులకు చేరుకుంది. అనంతరం స్వల్ప వ్యవధిలో ఓపెనర్ల వికెట్లను కోల్పోవడంతో స్కోరు కాస్త నెమ్మదించింది.
డివిలియర్స్(16), డుప్లిసిస్(17) దాటిగా ఆడే ప్రయత్నంలో త్వరగా పెవిలియన్ చేరారు. అనంతరం క్రీజులోకి వచ్చిన డుమిని(28 బంతుల్లో 54 పరుగులు), మిల్లర్(12 బంతుల్లో 28) చివర్లో దాటిగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో అలీకి 2 వికెట్లు దక్కగా.. విల్లీ, రషీద్లకు చెరో వికెట్ దక్కింది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.