కింబర్లీ: ఐసీసీ మహిళల చాంపియన్ షిప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ మహిళలు సైతం అదరగొట్టారు. ఆతిథ్య జట్టుపై 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. ఇక 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య జట్టును 125 పరుగులకే కుప్పకూల్చారు. భారత మహిళల బౌలర్లలో సీనియర్ బౌలర్ జూలన్ గోస్వామి నాలుగు వికేట్లతో కదం తొక్కగా.. శిఖా పాండే మూడు , పూనమ్ యాదవ్‌లు రెండు వికెట్లు తీశారు. గైక్వాడ్‌కు ఓ వికెట్ దక్కింది. దీంతో ప్రొటీస్ మహిళా బ్యాట్స్‌ఉమెన్‌లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. సఫారీ మహిళా బ్యాట్స్‌ఉమెన్‌లలో కెప్టెన్ వాన్ నీకెర్క్ (41), లారా వోల్వార్డ్(21), మరిజన్నే కాప్(23), సునే లూస్(18)లు మినహా మిగతా ఎవరూ రెండెంకల స్కోరు చేయలేదు. దీంతో ఆతిథ్య జట్టు 43.2 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది.
స్మృతి మెరుపులు..
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 213 పరుగులు చేశారు. ఓపెనర్ స్మృతి మంధన 84 ( 98 బంతులు, 8 ఫోర్లు 1 సిక్సు)తో మెరవగా కెప్టెన్ మిథాలీ రాజ్ 45(70 బంతులు,2 ఫోర్లు) రాణించారు. మిగతా భారత బ్యాట్స్‌ఉమన్‌లు విఫలమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment