మెరిసిన స్మృతి మంధన.. దక్షిణాఫ్రికా లక్ష్యం 214 | Indian women set to target 214 against South Africa | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 5 2018 5:34 PM | Last Updated on Mon, Feb 5 2018 5:35 PM

Indian women set to target 214 against South Africa - Sakshi

స్మృతి మంధన (ఫైల్‌)

కింబర్లీ: ఐసీసీ మహిళల చాంపియన్‌ షిప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్‌ మహిళలు 214 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన భారత మహిళలు నిర్ణీత 50 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 213 పరుగులు చేశారు. ఓపెనర్‌ స్మృతి మంధన 84 ( 98 బంతులు, 8 ఫోర్లు 1 సిక్సు)తో మెరవగా కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ 45(70 బంతులు,2 ఫోర్లు) రాణించారు.

మిగతా బ్యాట్స్‌ఉమెన్‌లు విఫలమవ్వడంతో భారత్‌ ఆతిథ్య జట్టు ముందు స్వల్పలక్ష్యాన్ని ఉంచింది. దక్షిణాఫ్రికా మహిళా బౌలర్లలో మరిజన్నే కాప్‌, అయబోంగా కాకాలు రెండేసి వికెట్లు పడగొట్టగా.. మసబట క్లాస్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement