కారును చుట్టుముట్టిన దొంగలతో పోరాడుతున్న వ్యక్తి
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాలో దొంగలు పట్టపగలే రెచ్చిపోతున్నారు. ముఠాలుగా యథేచ్చగా దొంగతనాలకు పాల్పడున్నారు. దీంతో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. అయితే ఓ వ్యక్తి దొంగల బారి నుంచి తనను, తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు సింహంలా పోరాడాడు. ముసుగులు ధరించిన దొంగల ముఠా ఆయన కారును చుట్టుముట్టగా.. కత్తితో వారిని హడలెత్తించాడు. ఓ దొంగను దాదాపు పొడిచినంత పని చేశాడు. అతని తెగువను చూసి దొంగలంతా అక్కడి నుంచి వెనుదిరిగారు.
“But why would I need a gun in South Africa” pic.twitter.com/po6zq83e7p
— Roman Cabanac (@RomanCabanac) July 20, 2022
ఓవైపు దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆత్మరక్షణ కోసం గన్ లెసెన్సులు జారీ చేయకుండా చట్టాన్ని తేవాలని ఆలోచిస్తున్న సమయంలో.. ఈ దొంగల ముఠాకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కుటుంబం కోసం వీరోచితంగా పోరాడిన సదరు వ్యక్తి ధైర్యాన్ని నెటిజన్లు కొనియాడారు. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా గన్ లెైసెన్స్ అంశంపై చర్చిస్తున్నారు . ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు గన్ ఉంటే బాగుండేదని, అందుకే ఆత్మరక్షణ కోసం గన్ లైసెన్సులు జారీ చేయాలనే డిమాండ్ వినపడుతోంది.
మరోవైపు అమెరికాలో గన్ కల్చర్ వల్ల మాస్ షూటింగ్‌లు జరిగి వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అక్కడ వయోజనులందరికీ అధికారికంగా తుపాకుల పొందేందుకు అనుమతి ఉంటుంది. దక్షిణాఫ్రికాలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇదిలాఉండగా.. జులై 10న జొహన్నెస్‌బర్గ్ సమీపంలోని ఓ బార్‌లో దుండగుల ముఠా అర్ధరాత్రి తుపాకులతో రెచ్చిపోయి 14 మందిని చంపిన విషయం తెలిసిందే.
చదవండి: యుద్ధ ట్యాంకర్లతో జనాలను భయపెడుతూ.. మళ్లీ మారణహోమం తప్పదా?!
Comments
Please login to add a commentAdd a comment