టి20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తొలిసారి బ్యాటింగ్‌లో కాస్త మెరిశాడు. టి20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు చాలా రోజుల క్రితమే ఫామ్ కోల్పోయిన బవుమా గురువారం పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 36 పరుగులు చేశాడు. బవుమా ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అయితే క్రీజులోకి వచ్చినప్పటి నుంచి బవుమా ఇబ్బందిగానే కనిపించాడు. ముఖ్యంగా పరుగులు తీయడంలో బద్దకించాడు.
ఫలితంగా రెండుసార్లు రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న బవుమా మరో రెండు బౌండరీలు బాదాడు. అయితే చివరకు షాదాబ్ ఖాన్‌కు దొరికిపోయాడు. 19 బంతుల్లోనే 36 పరుగులు చేసిన బవుమా రిజ్వాన్‌కు క్యాచ్‌కు ఇచ్చి వెనుదిరిగాడు. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే సమాయానికి సౌతాఫ్రికా 9 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది.
అయితే డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో సౌతాఫ్రికా 9 ఓవర్లు ముగిసేసరికి 84 పరుగులు చేయాలి. కానీ 15 పరుగులు ప్రొటిస్ వెనుకబడి ఉంది. వర్షం పాకిస్తాన్‌కు మేలు చేయనుంది. మ్యాచ్ రద్దు అయితే మాత్రం సౌతాఫ్రికా ఓటమి పాలయ్యే అవకాశం ఉంది. ఇక పాకిస్తాన్‌కు సెమీస్ ఆశలు నిలవాలంటే కచ్చితంగా సౌతాఫ్రికాపై నెగ్గాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఇప్తికర్ అహ్మద్ 51, షాదాబ్ ఖాన్ 52 అర్థసెంచరీలతో చెలరేగగా.. మహ్మద్ హారిస్, మహ్మద్ నవాజ్‌లు తలా 28 పరుగులు చేశారు.
చదవండి: మహ్మద్ నవాజ్ రనౌటా లేక ఎల్బీనా?
పాక్ తరపున రెండో బ్యాటర్‌గా..
Comments
Please login to add a commentAdd a comment