
హషీమ్ ఆమ్లా
జొహనెస్‌బర్గ్: భారత్-దక్షిణాఫ్రికా చివరి టెస్టు నాలుగో రోజు ఆటలో దక్షిణాఫ్రికా కుదురుగా ఆడుతోంది. భోజన విరామ సమయానికి వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. ఇక వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.
17/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆతిథ్య జట్టు 27 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. డీన్ ఎల్గర్ (28; 95 బంతుల్లో 3 ఫోర్లు), హషీమ్ ఆమ్లా (26; 60 బంతుల్లో4 ఫోర్లు)బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ ఇద్దరు భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ 64 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రొటీస్ జట్టుకు విజయానికి ఇంకా172 పరుగుల దూరంలో ఉంది.