టాంటన్: ముక్కోణపు మహిళల టి20 క్రికెట్ టోర్నీలో ఒకే రోజు రెండు అత్యధిక స్కోర్ల రికార్డులు నమోదయ్యాయి. న్యూజిలాండ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈ టోర్నీ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా బుధవారం ఉదయం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 216 పరుగులు సాధించింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా (209/4; ఇంగ్లండ్‌పై) పేరిట ఉంది. కివీస్ కెప్టెన్ సుజీ బేట్స్ (66 బంతుల్లో 124 నాటౌట్; 16 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగింది. సోఫియా డివైన్ ( 73; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు)తో కలిసి తొలి వికెట్‌కు 182 పరుగులు జోడించి మహిళల టి20ల్లో ఏ వికెట్‌ౖకైనా అత్యుత్తమ భాగస్వామ్యం నమోదు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 150 పరుగులకే పరిమితమైంది.
టామీ బ్యూమోంట్ సెంచరీ...
న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత సాయంత్రం ఇంగ్లండ్ తో దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 250 పరుగులు సాధించింది. ఇంగ్లండ్ జట్టులో టామీ బ్యూమోంట్ (52 బంతుల్లో 116; 18 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో సెంచరీ సాధించింది.
ఉదయం రికార్డు సాయంత్రం బద్దలు...
Published Thu, Jun 21 2018 1:11 AM | Last Updated on Thu, Jun 21 2018 1:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment